పంజాబీ జానపద నృత్యాలు

పంజాబీ నృత్యాలు పంజాబ్ లోని జానపద, మత నృత్యాల  కలయిక. భారత్, పాకిస్థాన్ దేశాల్లోని పంజాబీ ప్రజల స్థానిక నృత్యాలు మిగిలిన వాటితో ప్రత్యేకంగా ఉంటాయి. పంజబీ నృత్య రీతుల్లో హుషారుగా చేసే నృత్యాలతో పాటు, నెమ్మదిగా చేసే రకాలు కూడాఉంటాయి. స్త్రీలకు, పురుషులకు విడివిడిగా ప్రత్యేక శైలులున్నాయి. కొన్ని నృత్యాలు ప్రాంతాలతో మారితే, కొన్ని మతపరమైన నృత్యాలు ఉండటం విశేషం.

సాధారణంగా ప్రత్యేక సందర్భాల్లో పంజాబీలు నృత్యాలు చేస్తుంటారు. పంట చేతికొచ్చే సమయం (వైశాఖి), పెళ్ళిళ్ళు, లోహ్రీ, జషన్-ఇ-బహరాన్ (వసంత కాలపు పండుగ), విందులు (పండగల్లో)లో ఎక్కువగా  నృత్యాలు చేస్తారు పంజాబీలు. పంజాబీ భార్యాభర్తలు జంటలుగా  నృత్యాలు చేసినా, భర్తలు చేతులు పైకెత్తి పురుషుల పద్ధతిలోనూ,  భార్యలు స్త్రీల ప్రత్యేక పద్ధతిలోనూ నృత్యాలు చేయడం విశేషం.

భాంగ్డా/భాంగ్రా నృత్యరీతులు పురుషుల ప్రధాన పంజాబీ జానపద నృత్యాలు, గిద్దా స్త్రీల ప్రత్యేక నృత్య రీతులు.

జాబితా మార్చు

"స్త్రీల" సాధారణ పంజాబీ జానపద నృత్యాలు
 
పంజాబీ యువతుల నృత్యం
పురుషుల పంజాబీ జానపద నృత్యాలు
 
ధమాల్ నృత్యం
  • భాంగ్రా (నృత్యం)
  • మల్వాయ్ గిద్దా
  • ఝూమర్
  • లుడ్డీ
  • జల్లీ
  • మీర్జా
  • సెయిల్ కోటి
  • జుగ్నీ
  • ఖిచన్
  • ధమల్
  • డంకరా
  • ఖట్కా (ఖడ్గ నృత్యం)
స్త్రీ, పురుషులకు సాధారణమైన పంజాబీ జానపద నృత్య రీతులు

కొన్ని నృత్యాల గురించి.. మార్చు

భాంగ్రా మార్చు

పంజాబ్ జానపద కళా రూపాలలో ప్రసిద్ధమైనది. ఇతర ప్రాంతాల ప్రజలను ఎక్కువగా ఆకర్షించే నృత్య రీతి. గోధుమ విత్తనాలను చల్లే సమయంలో ఎంతో ఆనందంగా సామూహికంగా ఈ భాంగ్రా నృత్యాన్ని చేస్తారు పంజాబీలు. కళాకారులు వలయాకారంగా మారి నృత్యం చేస్తుంటారు ఈ నృత్య రీతిలో. వలయం మధ్యలో డోలు వాద్యగాడు ఉంటాడు. నృత్యం మధ్యలో పంజాబ్ జానపద గేయాలు పాడుతుంటారు. గోధుమ విత్తనాలు నాటే సమయంతో భాంగ్రా ఋతువు ప్రారంభమవుతుంది. భాంగ్రా నృత్యానికి శాస్త్ర నిబంధనలు ఉండవు.

సమ్మి మార్చు

సమ్మి నృత్యం పంజాబీ గిరిజన స్త్రీల ప్రత్యేక నృత్య రీతి. ఈ నృత్య రీతి ముఖ్యంగా పాకిస్థాన్ లోని సాండల్ బార్ ప్రాంతానికి చెందినది. బాజీగర్, రాయి, లోబానా, సాంసీ తెగల స్త్రీలు ఎక్కువగా ఈ నృత్యం ప్రదర్శిస్తుంటారు. చారిత్రిక గ్రంథాల ప్రకారం మార్వాడ్ ప్రాంతంలోని "సమ్మి మహారాణి" ఈ నృత్యం చేసిందని, ఆమె పేరు మీదుగానే ఈ నృత్యానికి సమ్మి అని పేరు వచ్చిందని ఒక కథనం. ఈ నృత్యం కూడా మిగిలిన పంజాబీ జానపద నృత్యాల మాదిరిగా కళాకారులు వలయాకారంలో ఉండి ప్రదర్శిస్తుంటారు.

గిద్దా మార్చు

గిద్దా నృత్యం భారత్, పాకిస్థాన్ లలోని పంజాబ్ ప్రాంతాలకు చెందిన జానపద నృత్యం. ఈ నృత్యంలో కూడా కళాకరులు వలయాకారంలో తిరుగుతూ నృత్యం చేస్తుంటారు. ఇది ప్రాచీనమైన పంజాబీ జానపద నృత్యం. గిద్దా నృత్య రీతి స్త్రీలకు ప్రత్యేకమైనది. ఈ నృత్యం భాంగ్రా కన్నా చాలా వేగవంతంగా ఉంటాయి.

ఇవి కూడా చూడండి మార్చు