సయ్యద్ అహ్మద్ (6 మార్చి 1943 - 27 సెప్టెంబర్ 2015) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, రచయిత కాంగ్రెస్ పార్టీచెందిన రాజకీయ నాయకుడు. అతను 16 మే 2015న మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసాడు,[1] అయితే సెప్టెంబరు 27న పదవిలో చనిపోయే ముందు నాలుగు నెలలు మాత్రమే పనిచేశాడు.[2]

సయ్యద్ అహ్మద్
మణిపూర్ గవర్నర్
In office
2015 మే 16 – 2015 సెప్టెంబర్ 27
అంతకు ముందు వారుకృష్ణ కాంత్
జార్ఖండ్ గవర్నర్
In office
2011 సెప్టెంబర్ 4 – 2015 మే 15
అర్జున్ ముండా హేమంత్ సోరేన్
అంతకు ముందు వారుఫారూఖ్
వ్యక్తిగత వివరాలు
జననం1943 మార్చి 6
ఉత్తరప్రదేశ్ భారతదేశం
మరణం2015 ఆగస్టు 27
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసయ్యద్ హుస్సేన్ తార
నైపుణ్యంరాజకీయ నాయకుడు

అతను 72 సంవత్సరాల వయస్సులో రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు భారతదేశంలోని ముంబైలోని లీలావతి హాస్పిటల్ బాంద్రాలో 27 సెప్టెంబర్ 2015న క్యాన్సర్‌తో మరణించాడు.[3] సయ్యద్ అహ్మద్ కు భార్య, ఇద్దరు పిల్లలు, ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కూతురు ఉన్నారు.

బాల్యం

మార్చు

అహ్మద్ హిందీ ఇంగ్లీషు రెండింటిలోనూ రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉర్దూలో డాక్టరేట్ పట్టారు.[4] అతను పగ్దండి సే షహర్ తక్ అనే ఆత్మకథను వ్రాసాడు [4] అతను మక్తల్ సే మంజిల్, కఫాస్ సే చమన్ జాంగే-ఆజాదీ మే ఉర్దూ షాయారీ రచనలను రచించాడు.

రాజకీయ జీవితం

మార్చు

సయ్యద్అహ్మద్ 1977లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు [4] ముంబైలోని నాగ్‌పడా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.[4] మహారాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.

2011 26 ఆగస్టు 26న, భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జార్ఖండ్‌కు గవర్నర్‌గా సయ్యద్ అహ్మద్ను నియమించారు.[5] రాష్ట్రపతి పాటిల్ అదే రోజున కేరళ గవర్నర్‌గా నియమితులైన ఎం.ఒ.హెచ్. ఫరూక్ స్థానంలో అతనిని నియమించారు.[5] సయ్యద్ అహ్మద్ జార్ఖండ్ గవర్నర్‌గా 2011 సెప్టెంబరు 4న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జార్ఖండ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ చంద్ర తాటియా సయ్యద్ అహ్మద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.[4] అప్పటినుండి 1015 మే 17 వరకు పనిచేసాడు.

సయ్యద్ అహ్మద్ మే 2015లో మణిపూర్‌ గవర్నరుగా నియమితులు అయ్యారు [1]

2015 మే 16న ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో సయ్యద్ అహ్మద్ మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీకాంత మహపాత్ర సయ్యద్ అహ్మద్‌తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.[1] అప్పటినుండి 2015 సెప్టెంబరు 27 వరకు పనిచేసాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Dr Syed Ahmad sworn in as Governor of Manipur". ibnlive. 2015-05-16. Archived from the original on 2015-09-27. Retrieved 2015-05-18.
  2. "Manipur Guv Syed Ahmed passes away in Mumbai". intoday.in.
  3. PTI. "Manipur governor Syed Ahmed dies in Mumbai". www.livemint.com/.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "New governor to take oath today". The Times of India. 2011-09-04. Archived from the original on 2012-09-26. Retrieved 2011-09-08.
  5. 5.0 5.1 "K Rosaiah, Ram Naresh Yadav named governors". The Times of India. 2011-08-27. Archived from the original on 2012-09-26. Retrieved 2011-09-08.

వెలుపలి లంకెలు

మార్చు