సయ్యద్ ముహమ్మద్ ఆరిఫ్

బ్యాట్మింటన్ క్రీడాకారుడు మరియు శిక్షకుడు

సయ్యద్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ (1944 జనవరి 29) బ్యాడ్మింటన్‌ కోచ్‌. అతను అరిఫ్ సాహెబ్ గా సుపరిచితుడు. అతని సేవలకు గానూ భారతప్రభుత్వము పద్మశ్రీ, ద్రోణాచార్య పురస్కారములచే సత్కరించింది.[1] గోపీచంద్‌,చేతన్‌ ఆనంద్‌, గుత్తా జ్వాల,సైనా నెహ్వాల్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ పొందారు[1].

ఎస్.ఎం.ఆరిఫ్ సాహబ్
జననం (1944-01-29) 1944 జనవరి 29 (వయసు 80)
హైదరాబాదు
జాతీయతభారతీయుడు
వృత్తిబాడ్మింటన్ కోచ్

ప్రారభ జీవితం

మార్చు
 
పద్మశ్రీపురస్కారం

ఎస్.ఎం.ఆరిఫ్ తెలంగాణా లోని హైదరాబాదుకు చెందినవాడు. అతను హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి బి.యస్సీ చేసాడు. అతను అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ నిర్వహిస్తున్న క్రికెట్ జట్టులో నాలుగు సంవత్సరాల పాటు ఆడాడు. తరువాత హెచ్.సి.ఎ. లీగ్ లో దకన్ బ్లూస్ కోరకు ఆడాడు.[2] తరువాత అతను తన క్రికెట్ కోచ్ పక్కనపెట్టి బ్యాడ్మింటన్ ను అనుసరించాడు.

జీవితం

మార్చు

S. M. ఆరిఫ్, తన కళాశాల రోజుల్లో, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఇంటర్-వర్సిటీ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అతను అనేక జాతీయ టోర్నమెంట్లలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

పాటియాలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుండి బ్యాడ్మింటన్ కోచింగ్‌లో డిప్లొమా సంపాదించాడు. 1974 లో అతను బ్యాడ్మింటన్ కోసం జాతీయ శిక్షకుల ప్యానెల్‌లో చేరాడు[3]. 1997 లో నేషనల్ చీఫ్ బ్యాడ్మింటన్ కోచ్‌గా నియమించబడ్డాడు. మాజీ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పుల్లెల గోపిచంద్, మాజీ భారత జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ పి. వి. వి. లక్ష్మి, జ్వాలా గుత్తా, సైనా నెహ్వాల్ సహా పలువురు భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు ఆరిఫ్ శిక్షణ ఇచ్చాడు.

ప్రముఖుల ప్రశంసలు

మార్చు
  • ఆరిఫ్ సర్ లేకుంటే నేను లేనట్లే.చిన్నప్పటినుంచి నా కెరీర్‌ను మలచిన తండ్రిలాంటి ఆరిఫ్ సర్‌కు ఈ వరల్డ్ చాంపియన్‌షిప్‌ విజయం అంకితం.--గుత్తా జ్వాల

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Arjuna Award for Milkha, Abhinav; Khel Ratna for Gopichand". The Tribune. 2001-08-03. Retrieved 2009-08-31.
  2. "Noted badminton coach, a cricketer to the core". The Hindu. Retrieved 22 January 2012.
  3. "Coaching right". The Hindu. 2005-03-19. Archived from the original on 2005-05-23. Retrieved 2009-08-31.