సరఫరా, గిరాకీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సరఫరా, గిరాకీ మార్కెట్లో ధర నిర్ణయం యొక్క ఒక ఆర్థిక పద్ధతి. ఆంగ్లంలో దీన్ని సప్లై అండ్ డిమాండ్ అంటారు. పోటీ మార్కెటులో యూనిట్ ధర సరఫరా పరిమాణం, గిరాకీ పరిమాణం సమానంగా ఉన్న చోట స్థిరపడుతుంది. ప్రస్తుత ధర వద్ద వినియోగదారులు ఉత్పత్తి అయిన యూనిట్ల మొత్తాన్ని వినియోగిస్తుండగా, ఉత్పత్తిదారులు వినియోగదారులకు అవసరమయిన యూనిట్ల మొత్తాన్ని ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ఫలితం ధర, పరిమాణం యొక్క ఆర్థిక సమతౌల్యం.
సరఫరా, గిరాకీకి సంబంధించిన నాలుగు ప్రాథమిక సూత్రాలు:
1. గిరాకీ పెరుగుతుంది, సరఫరా మారదు, అప్పుడు ఇది అధిక సమతుల్యతా ధరకు, అధిక పరిమాణానికీ దారితీస్తుంది.
2. గిరాకీ తగ్గుతుంది, సరఫరా మారదు, అప్పుడు ఇది తక్కువ సమతుల్యతా ధరకు, తక్కువ పరిమాణానికీ దారితీస్తుంది.
3. గిరాకీ మారదు, సరఫరా పెరుగుతుంది, అప్పుడు తక్కువ సమతుల్యతా ధరకు, ఎక్కువ పరిమాణానికీ దారితీస్తుంది.
4. గిరాకీ మారదు, సరఫరా తగ్గుతుంది, అప్పుడు అధిక సమతుల్యతా ధరకు, తక్కువ పరిమాణానికీ దారితీస్తుంది.