సరస్వతీ విశ్వేశ్వర

సరస్వతీ విశ్వేశ్వర బెంగుళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థలోని మోలెక్యూలార్ బయోఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఈవిడ పని చేసేది కాంప్యుటేషనల్ బయాలజీ మీద. ఈమె పరిశోధన ప్రధానంగా జీవవ్యవస్థలలోని నిర్మాణ-నిర్వాహక సంబంధాలను విశదీకరించడం పై జరుగుతున్నది. ప్రోటీన్ లాంటి స్థూలాణువుల పనితనాన్ని కాంప్యుటేషనల్, గణిత పద్ధతులను వాడుతూ అర్థం చేసుకోవటం ఇందులోని ముఖ్యమయిన అంశం. ఇది ఎన్నో సవాళ్ళతో కూడుకున్న పరిశోధన. ఒక వైపు నుండి జీవవ్యవస్థలను సాంప్రదాయక పద్ధతులలో క్షుణ్ణంగా పరిశీలించడం, మరో వైపు నుండి జీవవ్యవస్థలను సమగ్రంగా పరిశీలించేందుకు అత్యాధునిక పద్ధతులను కనుగొనడం. ఇలా చేసేందుకు ఈవిడ జీవవ్యవస్థలు, అణువులకు సంబంధించిన రసాయన సూత్రాలు,, భౌతిక-గణిత సిద్ధాంతాలను తీవ్ర స్థాయిలో ఉపయోగించారు.

సరస్వతీ విశ్వేశ్వర
జననంసరస్వతీ విశ్వేశవర

బాల్యం

మార్చు

ఈమె కర్నాటకలోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. ఈమెకు అన్నదమ్ములు-అక్కచెళ్ళెళ్ళు హెచ్చు. వీరిది ఒక చిన్న మధ్య తరగతి ఉమ్మడి కుటుంబం.అప్పుడే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజులు. ఈమె మామయ్యలు స్వాతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకొన్న విషయం తల్లి ద్వారా వినేది. తాత ఉపాధ్యాయుడు కావడం వలన ఇంటిల్లిపాదికీ చదువంటే మక్కువ ఉండేది. ఈమె తండ్రి అయితే ఆడ-మగ తేడా లేకుండా విద్య అందాలని అభిలషించేవాడు. ఈ విధంగా ఈమెకు ఒక పక్క సాంప్రదాయ కుటుంబ విలువలు, మరో పక్క స్త్రీ-పురుష వివక్షలేని ఆధునిక విద్య సమకూరాయి.

విద్య

మార్చు

ఈమె విజ్ఞాన శాస్త్రంలో స్నాతక, స్నాతకోత్తర విద్యను బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి పొందారు. స్నాతకోత్తర విద్యలో బయోకెమిస్ట్రీ (జీవరసాయనశస్త్రం) ముఖ్యమయిన విషయమయినప్పటికీని ఈమె ఇతర విజ్ఞాన విషయాలలో కూడా అభిరుచిని చూపారు. ఈ ఆసక్తి తరువాతి రోజుల్లో విద్యాభ్యాసానికి ఆమెకెంతో దోహదపడింది. న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీ నుండి పీహెచ్‍డీలో క్వాంటం కెమిస్ట్రీను విషయంగా తీసుకున్నపుడు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఈ పీహెచ్‍డీను ఈమె డేవిడ్ బెవెరిజ్ అనే ప్రొఫెసర్ నేతృత్వంలో చేసింది. ఆ తరువాత ఈమె పోస్ట్-డాక్టరల్ ఫెలోగా నోబెల్ గ్రహీత క్వాంటం కెమిస్ట్రీ పరిశోధనలో సుపరిచితుడయిన కార్నెజీ మెలన్ యూనివర్సిటీ, పిట్స్‍బర్గ్ ప్రొఫెసర్ జాన్ పోపుల్ అధీనంలో చేరింది. ఆ తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి ఐఐఎస్సీలో మోలెక్యూలార్ బయోఫిజిక్స్ విభాగంలో పోస్ట్-డాక్టరల్ ఫెలోగా చేరి, కాలాంతరంలో అక్కడే ఉపాధ్యాయురాలుగా మారింది.

ఉద్యోగం

మార్చు

ఆమె పోస్ట్-డాక్టరల్ ఫెలో నుండి క్రమంగా ఐఐఎస్సీలోనే ఉపాధ్యాయురాలిగా స్థిరపడింది. ప్రస్తుతం అక్కడ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నది. ఈమె కింద ఎంతో మంది విద్యార్థులు పీహెచ్‍డీ పూర్తి చేస్తున్నారు. పరిశోధనలంటే ఈమెకెంతో మక్కువ.

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  • [1][permanent dead link] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.