సరాయికేలా, జార్ఖండ్ రాష్ట్రం, సరాయికేలా ఖర్సావన్ జిల్లా లోని పట్టణం, ఆ జిల్లా ముఖ్యపట్టణం. ఇంతకు ముందు ఇది పశ్చిమి సింగ్‌భుమ్ జిల్లాలో ఉండేది. పూర్వపు సంస్థానమైన ఒడియా సారికేలా రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. పట్టణం రహదారి జంక్షను, వ్యవసాయ వాణిజ్య కేంద్రం. పట్తణానికి సమీపంలో రాగి, ఇనుము-ధాతువు, ఆస్బెస్టాస్, సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇది జంషెడ్‌పూర్, చైబాసా లకు మధ్య ఉంది.

సరాయికేలా
సరాయికెల్లా[1]
సరాయికేలా సరాయికెల్లా[1] is located in Jharkhand
సరాయికేలా సరాయికెల్లా[1]
సరాయికేలా
సరాయికెల్లా[1]
జార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 22°43′N 85°57′E / 22.72°N 85.95°E / 22.72; 85.95
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాసరాయికేలా ఖర్సావన్
Time zoneUTC+5:30 (IST)
PIN
833219
Telephone code06597
Vehicle registrationJH-22
అధికార భాష[2]హిందీ

భౌగోళికం మార్చు

సరాయికేలా దక్షిణ జార్ఖండ్‌లోని ఖర్కాయ్ నది ఒడ్డున ఉంది. ఇక్కడి నుండి జంషెడ్పూర్ కు మంచి రోడ్డు సౌకర్యం ఉంది.

చరిత్ర మార్చు

సరాయికేలా సంస్థానం మార్చు

సరాయికేలా రాజ్యాన్ని 1620 లో రాజా బిక్రమ్ సింగ్ స్థాపించాడు. (ప్రస్తుత పాలక కుటుంబం పేరు "సింగ్ దేవ్" ల కంటే ముందు). [3]

సంస్కృతి మార్చు

సరైకేలా చౌ నృత్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది ఒరియా, హో గిరిజన సంస్కృతిల ప్రత్యేక సమ్మేళనం. పూర్వపు రాజ భవనం, కుదరసాయి దేవాలయం, గెస్ట్ హౌస్, శివాలయం దర్శనీయ ప్రదేశాలు. రథయాత్ర, దుర్గా పూజ ఇక్కడ జరుపుకునే ప్రధానమైన పండుగలు. ఇది లడ్డూకి కూడా ప్రసిద్ధి.

చౌదరి, సెక్సేరియా, సాహు కుటుంబాలు సెరాయికెలా యొక్క ప్రధాన వ్యాపార కుటుంబాలలో ముఖ్యమైనవి. వీళ్ళు సెరాయికెలా లోని వివిధ వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారు. అభిజీత్ గ్రూప్ (కార్పొరేట్ ఇస్పాట్ & అల్లాయ్స్ లిమిటెడ్) సెరైకెలాలో తన స్టీల్ & పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది (పట్టణం నుండి 7 కి.మీ.). బృహస్పతి సిమెంట్ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ కర్మాగారాన్ని పట్టణ్నికి సమీపంలో ఏర్పాటు చేస్తోంది. సేసా గోవా, భారత్ స్టీల్ సంస్థ వారి ఉక్కు కర్మాగారం కూడా ఈ ప్రాంతంలో ప్రతిపాదనలోఉన్నాయి.

జనాభా మార్చు

2011 జనగణన ప్రకారం,[4] సరాయికేలా జనాభా 26,145. జనాభాలో పురుషులు 53%, మహిళలు 47% ఉన్నారు. సరాయికేలా సగటు అక్షరాస్యత 70%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 61%. సరాయికేలా జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు మార్చు

  1. http://odisha.gov.in/e-magazine/Orissareview/2011/Apr/engpdf/31-34.pdf
  2. "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. Archived from the original (PDF) on 8 జూలై 2016. Retrieved 24 సెప్టెంబరు 2021.
  3. Princely States of India
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.