సర్దార్ (1984 సినిమా)

సర్దార్ 1984లో విడుదలైన తెలుగు సినిమా. దేవి కమల్ మూవీస్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు నిర్మించిన ఈ సినిమాకు నందం హరిశ్చంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

సర్దార్
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం నందం హరిశ్చంద్రరావు
నిర్మాణం కె.సి.శేఖర్ బాబు
తారాగణం కృష్ణంరాజు,
శారద
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ దేవి కమల్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • కృష్ణంరాజు
  • జయప్రద
  • సత్యనారాయణ
  • శారద
  • కవిత
  • జయమలిని
  • రాగిణి
  • సావిత్రి గణేశన్
  • కాంతారావు
  • ఎం. అప్పారావు
  • వంగా అప్పారావు
  • బాబ్ క్రిస్టో
  • జవ్వాధి రామారావు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకుడు: నందం హరిశ్చంద్రరావు
  • నిర్మాత: కె.సి.శేఖర్‌బాబు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • స్టూడియో: దేవి కమల్ మూవీస్
  • నిర్మాత: కె.సి. శేఖర్ బాబు
  • ఛాయాగ్రాహకుడు: ఎస్.వెంకట్ రత్నం
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి
  • శైలి: యాక్షన్, డ్రామా
  • విడుదల తేదీ: 1984 జనవరి 7
  • IMDb ID: 0355998
  • అసోసియేట్ డైరెక్టర్: రావు గోపాల రావు
  • అసిస్టెంట్ డైరెక్టర్: ఎస్.శివశంకర్, ఎన్.బి. రాజేంద్రప్రసాద్
  • కథ: భీశెట్టి లక్ష్మణ రావు
  • చిత్రానువాదం: నందం హరిశ్చంద్ర రావు
  • సంభాషణ: పరుచూరి సోదరులు
  • సంగీత దర్శకుడు: చక్రవర్తి (సంగీతం)
  • నేపథ్య సంగీతం: చక్రవర్తి (సంగీతం)
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి
  • సౌండ్ రికార్డింగ్: ఎ.ఆర్. స్వామినాథన్
  • రీ రికార్డింగ్: రాజగోపాల్
  • సంగీతం లేబుల్: AVM
  • అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: కలిగోట్ల సత్యం
  • ఆర్ట్ డైరెక్టర్: రంగారావు
  • కాస్ట్యూమ్ డిజైన్: బి. కొండయ్య
  • స్టిల్స్: బి. వెంకట్ రావు
  • ప్రచార రూపకల్పన: ఎస్. దావూద్
  • మేకప్: పి.వి. కృష్ణ, టి. వెంకటేశ్వర రావు, సి. వెంకటేశ్వర రావు
  • జుట్టు స్టైల్స్: కమలా, సీను
  • డాన్స్ డైరెక్టర్: ఎన్.ఎ.తార (డాన్స్ మాస్టర్), శివ సుబ్రహ్మణ్యం
  • ప్రొడక్షన్ కంట్రోలర్: కొత్తూరి మల్లికార్జున రావు
  • స్టంట్ డైరెక్టర్: మాధవన్
  • ప్రయోగశాల: జెమిని కలర్ ల్యాబ్ (మద్రాస్)

కథాంశం మార్చు

జాతీయోద్యమంలో ఒక ద్రోహి మూలంగా ప్రాణాలు కోల్పోయిన ఒక దేశభక్తుని కుమారుడు పెరిగి పెద్దవాడై నీతినిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తాడు. అతడు దేశద్రోహిని పట్టించే ప్రయత్నంలో కృతకృత్యుడయ్యే ముందు ఎన్ని అగచాట్లకు గురి అయ్యిందీ, అతడు కూడా ఎందుకు కటకటాలపాలయ్యిందీ ఈ చిత్రకథ వివరిస్తుంది.

పాటల జాబితా మార్చు

1: మనసొక పాడిన పాట, రచన వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల

2: ఆకురాయి చేతిలో, రచన వేటూరి, గానం.ఎస్ జానకీ, పి.సుశీల

3: చిలిపి చైత్రమాసమా , రచన: వేటూరి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4: పంచాంగం చూడొద్దురోయీ, రచన: వేటూరి, గానం. పి సుశీల

5: పోరా పోరా సూరిడా , రచన వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .

మూలాలు మార్చు

  1. "Sardar (1984)". Indiancine.ma. Retrieved 2020-08-25.

2. ఘంటసాల గళమృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్

బయటిలింకులు మార్చు