సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్

గర్భాశయంలోని సర్విక్స్ భాగంలో ఏర్పడ్డ క్యాన్సర్

సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని సర్విక్స్ భాగంలో ఏర్పడ్డ కా.[2] సర్విక్స్ అంటే గర్భాశయ దిగువ భాగం. ఇది గర్భాశయాన్ని, యోనితో అనుసంధానించుతుంది.

సర్విక్స్ గర్భాశయ కాన్సర్
ఇతర పేర్లుసర్వైకల్ కాన్సర్
సర్వైకల్ కాన్సర్ కనిపించే ప్రదేశము, సాధారణ కణాలు ఇంకా కాన్సర్ కణాలు
ఉచ్చారణ
ప్రత్యేకతగర్భకోశ వ్యాధులు, ఆంకాలజీ
లక్షణాలులక్షణాలు కనిపించవు. తరువాత, అసాధారణ యోని రక్తస్రావం, కటి నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కొన్నిసార్లు ప్రేగు, మూత్రాశయం పనితీరుతో సమస్యలు ఉండవచ్చు
సాధారణ ప్రారంభం10 నుండి 20 సంవత్సరాల మధ్య
రకాలు90% పొలుసుల కణ క్యాన్సర్ , 10% అడెనో క్యార్సినోమా, కొంతవరకు ఇతర రకాలు
కారణాలుమానవ పాపిల్లోమావైరస్ సంక్రమణ
ప్రమాద కారకములుధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, గర్భ నియంత్రణ మాత్రలు, చిన్న వయస్సులోనే లైంగిక సంబంధం ప్రారంభించడం, చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం
రోగనిర్ధారణ పద్ధతిగర్భాశయ పరీక్ష, బయాప్సీ, మెడికల్ ఇమేజింగ్
నివారణపాప్ పరీక్ష, ఎసిటిక్ ఆమ్లాన్నీ ఉపయోగించి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్
చికిత్సశస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్
రోగ నిరూపణ68%లో 5 సంవత్సరాల మనుగడ, అమెరికా లో 46%
తరుచుదనము570,000 new cases (2018)
మరణాలు311,000 (2018)

కారణాలు

మార్చు

దీనికి కారణం శరీర ఇతర భాగాలపై దాడి చేయగల లేదా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్న కణాల అసాధారణ పెరుగుదల .[3] సాధారణంగా ప్రారంభంలో, ఎటువంటి లక్షణాలు కనిపించవు..[2] తరువాత, అసాధారణ యోని రక్తస్రావం, కటి నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కొన్నిసార్లు ప్రేగు, మూత్రాశయం పనితీరుతో సమస్యలు ఉండవచ్చు.[2] సంభోగం తర్వాత రక్తస్రావం తీవ్రంగా ఉండకపోవచ్చు కానీ ఇది గర్భాశయ క్యాన్సర్ ఉనికిని కూడా సూచించవచ్చు.

90% పైగా సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ కేసులకు మానవ పాపిల్లోమావైరస్ సంక్రమణ (HPV) కారణమవుతుంది.[4][5] అయితే, HPV సంక్రమణలు ఉన్న అంత మందికి గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి చెందదు.[6] ఇతర ప్రమాద కారకాలలో ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, గర్భ నియంత్రణ మాత్రలు, చిన్న వయస్సులోనే లైంగిక సంబంధం ప్రారంభించడం, చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం వంటివి ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువ ముఖ్యమైనవి కావు.[7][8]

సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా 10 నుండి 20 సంవత్సరాల కాలం ముండు నుంచి జరుగుతున్న మార్పుల నుండి అభివృద్ధి చెందుతుంది.[6] ఈ క్యాన్సర్ కేసులలో సుమారు 90% పొలుసుల కణ క్యాన్సర్ (squamous cell carcinomas), 10% అడెనోక్యార్సినోమా, కొంతవరకు ఇతర రకాలు.[7]

వ్యాధి నిర్ధారణ, నివారణ

మార్చు

రోగనిర్ధారణ సాధారణంగా గర్భాశయ పరీక్ష, తరువాత బయాప్సీ ద్వారా జరుగుతుంది. క్యాన్సర్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మెడికల్ ఇమేజింగ్ చేస్తారు.[8] హెచ్.పి.వి. (HPV) టీకాలు అధిక-ప్రమాదకర వైరస్ల కుటుంబానికి చెందిన రెండు నుండి ఏడు వైరస్ల వరకు రక్షిస్తాయి. 90% సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్లను నివారించవచ్చు.[9][10][11] అయితే క్యాన్సర్ ప్రమాదం ఎప్పటికీ ఉన్నందున, మార్గదర్శకాలు సాధారణంగా పాప్ పరీక్షలను కొనసాగించాలని సిఫార్సు చేస్తాయి.[9] ఇతర నివారణ పద్ధతులు ఏమంటే లైంగిక భాగస్వాములను తక్కువ కలిగి ఉండటం, కండోమ్ల వాడకం.[12] పాప్ పరీక్ష లేదా ఎసిటిక్ ఆమ్లాన్నీ ఉపయోగించి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముందస్తు మార్పులను గుర్తించగలదు, ఇది చికిత్స చేసినప్పుడు, క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించగలదు.[13] చికిత్సలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ కలపి ఉండవచ్చు.[8] అమెరికాలో ఐదేళ్ల మనుగడ రేటు 68%. [14] అయితే, క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తించారన్న దానిపై ఈ ఫలితాలు ఆధారపడి ఉంటుంది .[7]

వ్యాధి ప్రాబల్యం

మార్చు

ప్రపంచవ్యాప్తంగా, క్యాన్సర్కు ఈ సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ నాల్గవ అత్యంత సాధారణ కారణం . మహిళల్లో క్యాన్సర్ మరణాలకి నాల్గవ కారణం కూడా.[6] 2012 లో, సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ కేసులు 528,000 , ఇంకా 266,000 మరణాలు సంభవించాయి.[6] ఇది మొత్తం క్యాన్సర్ మరణాలలో సుమారు 8%.[15] అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుమారు 70% సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్లు, 90% మరణాలు సంభవిస్తున్నాయి.[6][16] తక్కువ ఆదాయ దేశాలలో, క్యాన్సర్ మరణానికి ఇది అత్యంత సాధారణ కారణాలలో ఒకటి .[13] అభివృద్ధి చెందిన దేశాలలో, సర్విక్స్ గర్భాశయ పరీక్ష కార్యక్రమాల విస్తృత వినియోగం సర్విక్స్ గర్భాశయ క్యాన్సర్ రేట్లను బాగా తగ్గించింది.

సూచనలు

మార్చు
  1. "CERVICAL | meaning in the Cambridge English Dictionary". dictionary.cambridge.org (in ఇంగ్లీష్). Archived from the original on 16 May 2018. Retrieved 5 October 2019.
  2. 2.0 2.1 2.2 Armstrong, Deborak K. (2020). "189. Gynaecologic cancers". In Goldman, Lee; Schafer, Andrew I. (eds.). Goldman-Cecil Medicine (in ఇంగ్లీష్). Vol. 1 (26th ed.). Philadelphia: Elsevier. pp. 1327–1329. ISBN 978-0-323-55087-1. Archived from the original on 2022-07-08. Retrieved 2022-07-08.
  3. "Defining Cancer". National Cancer Institute. 2007-09-17. Archived from the original on 25 June 2014. Retrieved 10 June 2014.
  4. Kumar V, Abbas AK, Fausto N, Mitchell RN (2007). Robbins Basic Pathology (8th ed.). Saunders Elsevier. pp. 718–721. ISBN 978-1-4160-2973-1.
  5. Kufe, Donald (2009). Holland-Frei cancer medicine (8th ed.). New York: McGraw-Hill Medical. p. 1299. ISBN 9781607950141. Archived from the original on 2015-12-01.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 World Cancer Report 2014. World Health Organization. 2014. pp. Chapter 5.12. ISBN 978-9283204299.
  7. 7.0 7.1 7.2 "Cervical Cancer Treatment (PDQ®)". National Cancer Institute. 2014-03-14. Archived from the original on 5 July 2014. Retrieved 25 June 2014.
  8. 8.0 8.1 8.2 "Cervical Cancer Treatment (PDQ®)". NCI. 2014-03-14. Archived from the original on 5 July 2014. Retrieved 24 June 2014.
  9. 9.0 9.1 "Human Papillomavirus (HPV) Vaccines". National Cancer Institute. 2011-12-29. Archived from the original on 4 July 2014. Retrieved 25 June 2014.
  10. "FDA approves Gardasil 9 for prevention of certain cancers caused by five additional types of HPV". U.S. Food and Drug Administration. 10 December 2014. Archived from the original on 10 January 2015. Retrieved 8 March 2015.
  11. Tran NP, Hung CF, Roden R, Wu TC (2014). Control of HPV infection and related cancer through vaccination. Vol. 193. pp. 149–71. doi:10.1007/978-3-642-38965-8_9. ISBN 978-3-642-38964-1. PMID 24008298. {{cite book}}: |work= ignored (help)
  12. "Cervical Cancer Prevention (PDQ®)". National Cancer Institute. 2014-02-27. Archived from the original on 6 July 2014. Retrieved 25 June 2014.
  13. 13.0 13.1 World Health Organization (February 2014). "Fact sheet No. 297: Cancer". Archived from the original on 2014-02-13. Retrieved 2014-06-24.
  14. "SEER Stat Fact Sheets: Cervix Uteri Cancer". NCI. National Cancer Institute. November 10, 2014. Archived from the original on 6 July 2014. Retrieved 18 June 2014.
  15. World Cancer Report 2014. World Health Organization. 2014. pp. Chapter 1.1. ISBN 978-9283204299.
  16. "Cervical cancer prevention and control saves lives in the Republic of Korea". World Health Organization. Archived from the original on 5 November 2018. Retrieved 1 November 2018.