ప్రపంచ ఆరోగ్య సంస్థ

(World Health Organization నుండి దారిమార్పు చెందింది)

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్య రాజ్య సమితి సహకారంతో నడిచే ఈ సంస్థ 1948 ఏప్రిల్ 7న స్థాపించబడింది.దీని ముఖ్య కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.

జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం

ధ్యేయం

మార్చు

స్థాపన

మార్చు
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాలు:
  Eastern Mediterranean; స్థావరం: కైరో, ఈజిప్టు
  యూరోప్; స్థావరం: కోపెన్ హాజెన్, డెన్మార్క్
  South East ఆసియా; స్థావరం: కొత్త ఢిల్లీ, భారత దేశం
  Western Pacific; స్థావరం: మనీలా, ఫిలిప్పీన్స్

దీని ధ్యేయం ప్రపంచంలోని మానవలందరికి సరికొత్త వైద్యసదుపాయాలు అందజేయడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్య రాజ్య సమితిచే నడుపబడే సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ అధికారికంగా 26 దేశాల అమోదంతో, మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 1948 ఏప్రిల్ 7 న ప్రారంభిచబడింది.[1]

కార్యకలాపాలు

మార్చు

అంతర్జాతీయ సమన్వయంతో పాటు ఈ ఆరోగ్య సంస్థ, సార్స్, మలేరియా, ఎయిడ్స్ వంటి ప్రాణాంతకమైన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తుంది. కొన్ని ఏళ్ళపాటు కష్టపడిన తర్వాత, 1979 లో మశూచి (స్మాల్ పాక్స్) (అమ్మవారు) వ్యాధిని సమూలంగా నివారించినట్టు ఈ సంస్థ పేర్కొంది. ఈ విధంగా మానవుని ప్రయత్నాల ద్వారా నివారించబడిన మొదటి వ్యాధిగా మశూచి (స్మాల్‌పాక్స్) చరిత్రలో నిలిచిపోయింది. మలేరియా, సిస్టోసోమియాసిస్కు టీకా మందులు కనిపెట్టే దిశలో సంస్థ నిరంతర శ్రమ కొనసాగుతుంది. పోలియోను సమూలంగా నిర్మూలంచే దిశలో కూడా ఈ సంస్థ కృషి చేస్తుంది.

సభ్యత్వం

మార్చు

ఇందులో ప్రస్తుతం 194 దేశాలు సభ్యదేశాలగా ఉన్నాయి., వీటిల్లో ఒక్క లీచ్‌టెన్‌స్టెయిన్ తప్ప అన్ని ఐక్యరాజ్యసమితి దేశాలు, 2 అన్య దేశాలు (నియూ, కుక్ దీవులు) ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Chronicle of the World Health Organization, April 1948" (PDF). World Health Organization. p. 54. Archived from the original (PDF) on 2011-11-04. Retrieved 2007-07-18.

బయటి లింకులు

మార్చు