సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బహాదుర్ : (ఉర్దూ :: سید احمد خان بہا در) ( 1817 అక్టోబరు 17 – 1898 మార్చి 27), పరిచయమైన పేరు సర్ సయ్యద్, భారతీయ విద్యావేత్త, రాజకీయ నాయకుడు, ఇస్లామీయ సామాజిక సంస్కర్త, నవీన భావాలు గలవాడు. ముస్లిం సమాజంలో విద్యావ్యాప్తి కొరకు అహర్నిశలూ కఠోరంగా కృషిచేసిన ఘనుడు. భారతీయులందరికి సర్ సయ్యద్ గా పరిచయం ఉన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బహదూర్ 1817 అక్టోబరు 17 న డిల్లిలో జన్మించారు. ఇతని తండ్రి  మీర్ ముత్తకి, తల్లి అజిజున్నిస్సా. ఇతని వంశస్థులు మొఘల్ ఆస్థానంలో ఉన్నతోద్యోగులుగా ఉండేవారు. ఇతని 21 సంవత్సరముల వయస్సులోనే  తండ్రి మరణించారు ఆ పిదప తల్లి పెంపకంలో పెరిగారు. ఇతని తల్లి క్రమశిక్షణ, ధార్మిక విశ్వాసాలు గలిగిన స్త్రీ.ఇతని విద్యాబ్యాసం ఇంటి వద్ద సంప్రదాయక మత శిక్షణలో గడిచింది. దివ్య ఖురాన్, అరబ్బీ, పర్షియన్, గణితం, వైద్యం, అభ్యసించారు. చిన్న తనం నుండి సాంస్కృతిక, కవితాచర్చలలో పాల్గొనే వారు. 1938 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీలో క్లర్క్ గా చేరి తన ప్రతిభతో సబ్-జడ్జిగా నియమింప బడినారు.

దక్షిణ ఆసియా
నవీన యుగం
పేరు: సయ్యద్ అహ్మద్ ఖాన్
జననం: అక్టోబరు 17 1817
మరణం: 1898 మార్చి 27(1898-03-27) (వయసు 80)
సిద్ధాంతం / సంప్రదాయం: సున్నీ; మొఘల్
ముఖ్య వ్యాపకాలు: విద్య, రాజకీయ రంగం
ప్రముఖ తత్వం: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, రెండు దేశాల సిద్ధాంతము
ప్రభావితం చేసినవారు: మొఘల్ సామ్రాజ్యము, పాశ్చాత్యవిద్య
ప్రభావితమైనవారు: ముస్లింలీగ్

సర్ సయ్యద్ భారతీయ ముస్లిం విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఇతడు ఇస్లామిక్ సమాజంలో మార్పులు తేవటానికి ప్రయత్నించాడు, ఆధునిక భావాలు కలవాడు. ముస్లిం సమాజంలో విద్య వ్యాప్తి కోసం ఎంతోగా కృషి చేసాడు. భారతదేశంలో క్రమంగా 1857 తరువాత ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితి తగ్గుతూ ఉండటం అతను గమనించాడు. సర్ సయ్యద్ ప్రకారం, ముస్లింలు బ్రిటిష్ వారితో  సానుకూల విధానాన్ని అనుసరించి వారి  విద్య, వారి మార్గాలు అనుసరించాలి. అతను ముస్లింల కొరకు  బ్రిటిష్ ప్రభుత్వం నుండి ప్రయోజనం కోరారు.

"భారత దేశ తిరుగుబాటు యొక్క కారణాలు వ్యాసం" అంటూ ఒక వ్యాసం సర్ సయ్యద్ రాశారు, ఈ కరపత్రం బ్రిటిష్ అధికారుల మధ్య ఉచితంగా పంపిణీ చేయబడింది. దానిలో  1857 తిరుగు బాటు వ్యాప్తికి  కారణాలు ఎత్తి చూపారు. తబ్యిన్-ఉల్-కలాం పుస్తకంలో ఇస్లాం మతం, క్రైస్తవ మతం మధ్య సారూప్యతలు చూపారు.బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ను  స్థాపించాడు

సర్ సయ్యద్ భారతదేశం ముస్లింల విద్యా ఉన్నతిలో ఒక కీలక పాత్ర పోషించారు. అతను ముస్లింల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడాని కృషి  చేసారు. విద్య విషయంలో సర్ సయ్యద్ భావాలతో ఏకిభవించే భారతీయ ముస్లిం     ప్రముఖుల వ్యాసాలు కలిగిన ఒక పత్రిక, తఃజిబ్-ఉల్-అక్లాఖ్ ఏర్పాటు చేసారు.1863 లో ఘాజీపూర్ శాస్త్రీయ సొసైటీని స్థాపించాడు.దాని ద్వారా ఉర్దూ, ఇంగ్లీష్ లో శాస్త్రీయ వ్యాసాలు ప్రచురించారు. 1859 లో మొరదాబాద్ లో ఒక పాఠశాలలో తెరిచారు.1864 లో ఘజిపూర్ లో ఒక పాఠశాలలో తెరిచారు.కొత్త స్కూల్స్ కొరకు నిధులు సేకరించటానికి ఒక కమిటీ ఏర్పాటు చేసారు. 1875 మే 24 న అలిగర్ లో ముహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ఏర్పాటు చేసారు. ముస్లింల విద్యా ప్రమాణాలను పెంచడానికి 1866 లో ముహమ్మదన్ విద్యా సమావేశాలు నిర్వహించారు.

సర్ సయ్యద్ భారతీయ ముస్లింల సాంఘిక, ఆర్థిక, విద్య పరంగా  వెనకుబాటుతనానికి, ఆధునిక విద్య అందుబాటులో లేక పోవటమే అని నమ్మారు. సర్ సయ్యద్ భారతీయ ముస్లింల అభివృద్ధికి ఆధునిక విద్య, శాస్త్రీయ విద్య  అనగా ఇంగ్లిష్ విద్యను అభ్యసించాలని నమ్మారు. ముస్లింలు ఒక చేతితో దివ్య ఖురాన్ మరియక చేతిలో సైన్స్ పుస్తకాలు  చేపట్టాలని భావించారు.

ఇంగ్లాండ్ (1869-70) ను సందర్శించినడు ముస్లిం ల కోసం అతను ఒక గొప్ప విద్యా సంస్థ ఒక ముస్లిం కేంబ్రిడ్జ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసారు, ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ముస్లింల విద్య కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసారు, ఒక ప్రభావవంతమైన పత్రిక తఃదిబ్-అల్-అక్లాఖ్ ("సామాజిక సంస్కరణ"),. "ముస్లిం మతం ఉన్నతి , సంస్కరణ." కొరకు ప్రారంభించారు. ఒక ముస్లిం పాఠశాల 1875 మేలో అలిగర్ లో స్థాపించబడినది,, 1876 లో తన రిటైర్మెంట్ తరువాత సయ్యిద్ కళాశాల విస్తరించడం కోరరకు తనజీవితాన్ని అంకితం చేసారు. 1877 జనవరిలో కళాశాల యొక్క పునాది రాయి వైస్రాయ్ వేశారు. కళాశాల వేగవంతమైన పురోగతి సాధించింది. 1886 లో సయ్యిద్ విద్య ప్రోత్సహించడానికి ఒక ఉమ్మడి వేదిక అఖిల భారత ముహమ్మదన్ విద్య కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సర్ సయ్యిద్ క్రియాశీల రాజకీయాల్లోకి చేరటానికి బదులు   విద్య పై కేంద్రీకరించ వలసినదిగా ముస్లింలకు  సలహా ఇచ్చాడు. కొంతమంఅది ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. సర్ సయ్యద్  కాంగ్రెస్ భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థాపన వంటి దాని లక్ష్యాలను వ్యతిరేకంగా బయటకువచ్చారు. అతను విద్య, రాజకీయ సంస్థలు  కొన్ని తరగతులకు  పరిమితమైన భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అసమానంగా పనిచేస్తుంది అని వాదించారు. ముస్లింలు అతని సలహా అనుసరించి అనేక సంవత్సరాల పాటు అనగా తమ సొంత రాజకీయ సంస్థను ఏర్పాటు చేసే  వరకు రాజకీయాల నుంచి తప్పుకొనినారు. 1906 లో ముస్లిం మతం లీగ్ వ్యవస్థాపన వరకు, భారత ఇస్లాం మతం యొక్క ప్రధాన జాతీయ కేంద్రంగా ఆలీగర్  ఉంది.

సర్ సయ్యద్ భారత  ఉప-ఖండంలో ముస్లింల రాజకీయ అవగాహన పెంచటానికి కృషి చేసారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల స్థితి పెంచటం లో  ఒక కీలక పాత్ర పోషించారు. అతను ముస్లింలు, బ్రిటిష్ మధ్య మంచి సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. అతను అలిగర్ ఉద్యమం ద్వారా ముస్లిం పునరుద్ధరణ తద్వారా విద్య యొక్క ప్రాధాన్యతను చూపారు.

1875 లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజిని స్థాపించి దాన్నిక్రమంగా  ఆలీగర్ ముస్లిం యూనివర్సిటీగా రూపుదిద్దిన ఘనుడు. నూతన పాశ్చాత్య విజ్ఞానాల మేలవింపుతో విద్య బోధనా చేయడం దాని ముఖ్య ఉద్దేశం. ఈ విశ్వ విద్యాలయంలో 280 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. దీనిలో 12 ప్రధాన విభాగాలు ఉన్నాయి. అవి వరుసగా వ్యవసాయ శాస్త్రాల విభాగం, కళల విభాగం, వాణిజ్య విభాగం, ఇంజినీరింగ్, సాంకేతిక విభాగం, న్యాయ విభాగం, జీవ శాస్త్రాల విభాగం, మేనేజిమెంట్ స్టడీస్ & పరిశోధనల విభాగం, వైద్య విభాగం, శాస్త్రాల విభాగం, సామాజిక శాస్త్రాల విభాగం, మతశాస్త్రాల విభాగం, యూనాని వైద్య విభాగం.

విద్య రంగంలో సర్ సయ్యద్ చేసిన కృషి ఫలితంగా అలిగర్ ఉద్యమ ప్రభావంతో అనేక మంది  భారతీయ ముస్లింలు ప్రభావితులయ్యారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణ భారతంలో అనేక ముస్లిం  విద్యా సంస్థలు వెలసినవి. 1888 లో అతనికి సర్ బిరుదు లభించింది.

భారతదేశంలో ద్వి-జాతి సిద్దాంతానికి ఆద్యుడు సర్ సయ్యద్. అతను నాటిన బీజాన్ని ఇక్బాల్, జిన్నా పెంచి పాకిస్తాన్ ఏర్పాటుకు ప్రధాన కారణ మైనారు.

అలిగర్ ముస్లిం మతం విశ్వవిద్యాలయం పెద్ద సంఖ్యలో మేధావులు, పండితిలు, శాస్త్రవేత్తలను ఉత్త్పత్తి చేసింది. వారు వివిధ హోదాల్లో దేశానికి సేవచేసారు. ఈ విశ్వవిద్యాలయం యొక్క మొదటి గ్రాడ్యుయేట్  రాజా మహేంద్ర ప్రతాప్  సింగ్. దివంగత డాక్టర్ జాకీర్ హుస్సియన్, భారతదేశం యొక్క మాజీ అధ్యక్షుడు, డాక్టర్ సయ్యద్ మహ్మూద్ కూడా అలిగర్ లో చదువుకున్న ఉన్నతాధికారుల్లో ఉన్నారు. విశ్వవిద్యాలయం అసంఖ్యాకంగా వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు, పాత్రికేయులు, తయారు చేసింది ఈ విశ్వవిద్యాలయపు పూర్వపు విద్యార్థులలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దుగాంధీగా పేరొందిన, స్వాతంత్ర్య సమరయోధుడు, ముహమ్మద్ హమీద్ అన్సారి, ప్రస్తుత, భారత ఉపరాష్ట్రపతి, ఈశ్వరీ ప్రసాద్, చరిత్రకారుడు, షేక్ అబ్దుల్లా, కాశ్మీరు, మాజీ ముఖ్యమంత్రి, డా. రాహి మాసూమ్ రేజా, రచయిత, మహాభారత్ సీరియల్ ఫేమ్, సాహెబ్ సింగ్ వర్మ, రాజకీయ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు, ముహమ్మద్ యూనుస్, భారతీయ దౌత్యవేత్త, స్పెయిన్, టర్కీ, ఇండోనేషియా కు, భారత రాయబారి., ధ్యాన్ చంద్, హాకీ క్రీడాకారుడు, కె. ఆసిఫ్, హిందీ సినీరంగ ప్రముఖుడు (మొఘల్ ఎ ఆజం ఫేమ్), లాలా అమరనాధ్, క్రికెట్ క్రీడాకారుడు, భారత మాజీ క్రికెట్ కేప్టెన్, నసీరుద్దీన్ షా, హిందీ సినిమా కళాకారుడు, షిబ్లీ నౌమాని, ఇస్లామిక్ స్కాలర్, లియాకత్ అలీఖాన్, పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి, షకీల్ బదాయూని, ఉర్దూ కవి, పాటల రచయిత  జావేద్ అక్తర్, కవి, పాటల రచయిత, ముష్తాక్ అలీ, మాజీ భారత క్రికెట్ కాప్టైన్,  ప్రొ.పి.ఎస్. గిల్, భౌతిక శాస్త్రవేత్త, ప్రొ. ముహమ్మద్ హబీబ్, చరిత్ర కారుడు, స్వత్రంత్ర సమర యోధుడు, డా. ఇర్ఫాన్ హబీబ్, ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు, జఫర్ ఇక్బాల్, భారత మాజీ హాకీ కేప్టన్, మజాజ్ (AsrarulHaq), ఉర్దూ కవి, యూనివర్సిటీ గీత కర్త మొదలగు వారు ఉన్నారు.

మూలాలు

మార్చు

మహమ్మదన్ అంగ్లో ఓరియంటల్ కాలేజీని స్ఠాపించి దాన్నే అంచెలంచెలుగా అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా తీర్చిదిద్దిన ధీశాలి. ఇతడి దూరదృష్టి మూలంగానే ముస్లిం సమాజంలో విద్యాపరంగానూ రాజకీయంగానూ ఎదుగుదలకు ఓ వేదిక ఏర్పాటైంది.

ఇవీ చూడండి

మార్చు