సలాడు అనేది చిన్న ముక్కలు, సాధారణంగా కూరగాయలు లేదా పండ్ల మిశ్రమాన్ని కలిగి ఉన్న ఆహారం.[1][2]అయినప్పటికీ వివిధ రకాలైన సలాడులు వాస్తవంగా రెడీ-టు-ఈటు ఆహారంగా ఉంటాయి. సలాడ్లు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద వడ్డిస్తారు లేదా చల్లగా ఉంటాయి. దక్షిణ జర్మను బంగాళాదుంప సలాడు ఇందుకు మినహాయింపుగా వెచ్చగా వడ్డిస్తారు.

Salad
Salad platter.jpg
A garden salad consisting of lettuce, cucumber, scallions, cherry tomatoes, olives, sun-dried tomatoes, and cheese
Main ingredientsSmall pieces of vegetables, fruits, meat, eggs, or grains; mixed with a sauce.
VariationsMany
Cookbook:Salad at Wikibooks  Salad

గార్డెను సలాడ్లు పాలకూర, అరుగూలా / రాకెటు, కాలే లేదా బచ్చలికూర వంటి ఆకుకూరల పునాదిగా ఉపయోగిస్తారు; సలాడు అనే పదం తరచుగా గార్డెను సలాడ్లను సూచిస్తుంది. ఇతర రకాలు బీను సలాడు, ట్యూనా సలాడు, ఫట్టౌషు, గ్రీకు సలాడు (ఆకుకూరలు లేకుండా కూరగాయల ఆధారిత), సోమెను సలాడు (నూడిలు ఆధారిత సలాడు). సలాడు రుచికి ఉపయోగించే సాసును సాధారణంగా సలాడు డ్రెస్సింగ్ అంటారు; చాలా సలాడు డ్రెస్సింగు నూనె, వెనిగరు మిశ్రమం లేదా కేఫీరు వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది.


సలాడ్లు భోజనంలో ఏ సమయంలోనైనా వడ్డించవచ్చు:

 • ఆకలిని అధికరించే తేలికపాటి, చిన్న-భాగం సలాడ్లు భోజనం మొదటి కోర్సుగా ఉపయోగపడ్డాయి.
 • సైడ్ సలాడ్లు-సైడ్ డిషుగా ప్రధాన కోర్సుతో పాటు. క్లాసికలు వంటలలో బంగాళాదుంప సలాడు, సీజరు సలాడు ఉన్నాయి.
 • ప్రధాన ఆహారం అయున సలాడ్లలో సాధారణంగా మాంసం, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు లేదా జున్ను వంటి అధిక ప్రోటీను కలిగిన ఆహారాలు కొంత భాగాన్ని కలిగి ఉంటాయి.
 • డెజర్టు సలాడ్లు-పండ్లు, జెలటిను, స్వీటెనర్లు లేదా చిలికిన క్రీం కలిగిన తీపి మిశ్రమాలు ఉంటాయి.

పేరువెనుక చరిత్రసవరించు

 
Green leaf salad with salmon and bread

"సలాడు" అనే పదం అదే అర్థంలోని ఫ్రెంచి నుండి ఆంగ్లంలోకి వచ్చింది. ఇది మునుపటి లాటిను హెర్బా సలాటా (సాల్టెడు గ్రీన్సు) సంక్షిప్త రూపం, లాటిను సలాటా (సాల్టెడు) నుండి, సాలు (ఉప్పు) నుండి. ఆంగ్లంలో ఈ పదం మొదట 14 వ శతాబ్దంలో "సలాడు" లేదా "సాలెటు" గా కనిపిస్తుంది. సలాడుతో ఉప్పు ముడిపడి ఉంటుంది. ఎందుకంటే కూరగాయలను ఉప్పునీరు (నీటిలో ఉప్పు ద్రావణం) లేదా రోమను కాలంలో సలాడులను రుచికొరకు ఉప్పు నూనె, వెనిగరు డ్రెస్సింగుతో చేస్తారు.[3]సలాడు ఆధారిత కొన్ని జాతీయాలలో " సలాడు రోజులు " అనుభవం లేని యవ్వనం" ("పసిమి" భావన ఆధారంగా) అనే అర్ధంలో ఒక జాతీయాన్ని మొదట షేక్స్పియరు 1606 లో నమోదు చేసాడు.[3] సలాడు బారు వాడకం బఫే-శైలిని సూచిస్తుంది. సలాడు పదార్ధాల జాబితా మొదట 1976 లో అమెరికను ఇంగ్లీషులో కనిపించింది.

చరిత్రసవరించు

రోమన్లు, పురాతన గ్రీకులు, పర్షియన్లు మిశ్రమ ఆకుకూరలను డ్రెస్సింగుతో, ఒక రకమైన మిశ్రమ సలాడు తిన్నారు.[4][5] గ్రీకు, రోమను సామ్రాజ్య విస్తరణల కారణంగా లేయర్డు డ్రెస్సింగుతో సలాడ్లు ఐరోపాలో ప్రాచుర్యం పొందాయి. తన 1699 పుస్తకంలో ఎసిటారియా: ఎ డిస్కోర్స్ ఆన్ సాలెట్స్,[6] జాన్ ఎవెలిన్ తన తోటి బ్రిటన్లను తాజా సలాడు ఆకుకూరలు తినమని ప్రోత్సహించడంలో స్వల్ప విజయం సాధించాడు. [7] స్కాటుదేశీయులు రాణి మేరీ, క్రీము ఆవాలు డ్రెస్సింగు, ట్రఫుల్సు, చెర్విలు, ఉడికించిన గుడ్ల ముక్కలను ఆకుకూరలతో కప్పి ఉడికించిన సెలెరీ రూటు చేర్చి తింటారు.

17 వ శతాబ్దపు న్యూ నెదర్లాండు కాలనీలో సలాడ్ల మీద ఉపయోగించే నూనెను చూడవచ్చు (ఈ ప్రాంతం న్యూయార్కు, న్యూజెర్సీ, డెలావేరు అని పిలువబడింది). సరుకును అంచనా వేసేటప్పుడు ఓడలపైకి వచ్చే సాధారణ వస్తువుల జాబితా, "1.10 ఫ్లోరిన్ల వద్ద సలాడు ఆయిలు డబ్బా", "16 ఫ్లోరిన్ల వైను వెనిగరు యాంకరు" ఉన్నాయి. ఇది 17 వ శతాబ్ధంలో సలాడులు ఉపయోగించబడ్డాయని భావించడానికి నిదర్శనంగా ఉంది.[8] కురాకో ద్వీపం నుండి న్యూ నెదర్లాండు డైరెక్టరుకు 1665 లో రాసిన లేఖలో ఆకుకూరలు పంపమని ఒక అభ్యర్థన ఉంది: "క్యాబేజీ, క్యారెట్లు, పాలకూర, పార్స్లీ వంటి ప్రతి రకమైన విత్తనాలను నాకు పంపిస్తే సంతోషిస్తానని నేను చాలా స్నేహపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. వీటిని ఇక్కడ పొందలేము, మీకు మాపట్ల గౌరవం పుష్కలంగా ఉందని నాకు తెలుసు, ... ".ఈ లేఖలో పేర్కొనబడ్డ విషయాలు సలాడు వాడకానికి నిదర్శనంగా ఉంది.[9]


సలాడులు సూపరు మార్కెట్లలో, రెస్టారెంట్లలో, ఫాస్టు ఫుడు విక్రయశాలలలో లభ్యం ఔతాయి. యునైటెడు స్టేట్సులో, రెస్టారెంట్లు తరచూ సలాడు తయారీ పదార్థాలతో "సలాడు బారు" ను కలిగి ఉంటాయి. వీటిని వినియోగదారులు తమ సలాడ్ను కలిపి తినడానికి ఉపయోగిస్తారు.[10] సలాడు రెస్టారెంట్లు 2014 లో 300 మిలియన్లకు పైగా సంపాదించాయి.[11] 2010 లలో ఇంట్లో సలాడు వినియోగం పెరుగుతోంది. కాని తాజాగా తరిగిన పాలకూర నుండి, బ్యాగ్డ్ గ్రీన్సు, సలాడు కిట్ల వైపుకు వెళుతుంది. బ్యాగు అమ్మకాలు సంవత్సరానికి 7 బిలియను డాలర్లకు చేరుకుంటాయని అంచనా.[12]

సలాడులో రకాలుసవరించు

సలాడులు (ప్రత్యేకమైన దినుసులు) వైవిధ్యంగా ఒక బేసిను వంటి పాత్రలో కలిపి తయారు చేయబడతాయి.

గ్రీన్ సలాడుసవరించు

 
గ్రీన్ సలాడు

గ్రీన్ సలాడు లేదా గార్డెను సలాడు చాలా తరచుగా పాలకూర రకాలు, బచ్చలికూర లేదా రాకెటు (అరుగూలా) వంటి ఆకు కూరలతో కూడి ఉంటుంది. ఆకుకూరలు కానివి సలాడులో ఎక్కువ భాగాన్ని తయారుచేస్తే దాన్ని గ్రీన్ సలాడుకు బదులుగా వెజిటబులు సలాడు అని పిలుస్తారు. సలాడులో ఉపయోగించే సాధారణ ముడి కూరగాయలు దోసకాయలు, మిరియాల పొడి, టమోటాలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, సెలెరీ, ముల్లంగి, పుట్టగొడుగులు, అవోకాడో, ఆలివు, ఆర్టిచోకు హార్టులు, పాం హార్టు, వాటరు క్రెసు, పార్స్లీ, దుంపలు, ఆకుపచ్చ బీన్సు గింజలు, బెర్రీలు, విత్తనాలు, పువ్వులు భాగంగా ఉంటాయి. హార్డు-ఉడికించిన గుడ్లు, బేకను, రొయ్యలు, చీజులను అలంకరించుగా వాడవచ్చు. కాని పెద్ద మొత్తంలో జంతువుల ఆధారిత ఆహారాలు కూడిన సలాడులు విందులలో వడ్డించే అధికంగా ఉంటాయి.

చీలిక సలాడు లెట్యూసు (ఐసు బర్గు వంటివి) నుండి సగం లేదా క్వార్టరు, ఇతర పదార్ధాలతో అలకరించి తయారు చేస్తారు. [13]

బౌండు సలాడుసవరించు

 
గ్రుడ్డు, మయనీసులతో తయారు చేయబడిన అమెరికా శైలి ఉర్లగడ్డ సలాడు

బౌండు సలాడ్లు మయోనైసు వంటి మందపాటి సాసులతో మిశ్రితం చేయబడతాయి. నిజమైన [సాలిడు] బౌండు సలాడు స్కూపుతో ప్లేటులో ఉంచినప్పుడు అది స్కూపు ఆకారం సంతరించుకుంటుంది. ట్యూనా సలాడు, చికెను సలాడు, గుడ్డు సలాడు, బంగాళాదుంప సలాడు బౌండు సలాడులకు ఉదాహరణగా ఉంటాయి. బౌండు సలాడ్లను తరచుగా శాండ్‌ విచ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పిక్నిక్లు, బార్బెక్యూలలో ఇవి ప్రాచుర్యం పొందాయి.

మెయిన్ కోర్సుగా సలాడులుసవరించు

 
మయానీసుతో సాంప్రదాయ కాడ్ స్లోవాక్ ఫిష్ సలాడ్

ప్రధాన కోర్సు సలాడ్లు (దీనిని "డిన్నరు సలాడ్లు"[14] లేదా యునైటెడ్ స్టేట్సులో "ఎంట్రీ సలాడ్లు" అని కూడా అంటారు) చిన్న చిన్న పౌల్ట్రీ, సీఫుడు లేదా స్టీక్ ఉండవచ్చు. సీజరు సలాడు, చెఫ్ సలాడు, కాబ్ సలాడు, చైనీసు చికెన్ సలాడు, మిచిగాన్ సలాడు డిన్నరు సలాడ్లుగా వడ్డించబడుంటాయి.

ఫ్రూటు సలాడులుసవరించు

 
ఫ్రూటు సలాడు

ఫ్రూటు సలాడ్లు పండ్లతో తయారు చేయబడతాయి (పాక కోణంలో), ఇవి తాజాగా లేదా తయారుగా ఉండవచ్చు. " ఫ్రూటు కాక్టైలు " ఇదికు ఉదాహరణగా ఉంటుంది.

డిజర్టు(భోజనానంతర) సలాడులుసవరించు

 
అంబ్రోసియా

డెజర్టు(భోజనానంతర) సలాడ్లలో అరుదుగా ఆకుకూరలు ఉంటాయి. ఇవి తరచుగా తీపిగా ఉంటాయి. సాధారణ వైవిధ్యాలు జెలటిను లేదా చిలికిన చేసిన క్రీంతో తయారు చేయబడతాయి; ఉదా: జెల్లో సలాడు, పిస్తా సలాడు, అంబ్రోసియా. డెజర్టు సలాడ్ల ఇతర రూపాలు స్నికర్సు సలాడు, గ్లోరిఫైడు రైస్, కుకీ సలాడు.[14]

డ్రెస్సింగుసవరించు

 
A dish of American-style Italian dressing.

సలాడ్ల కోసం ఉపయోగించే సాసులను తరచుగా "డ్రెస్సింగు" అని పిలుస్తారు.


పాశ్చాత్య సంస్కృతిలో సలాడు డ్రెస్సింగులో రెండు ప్రాథమిక రకాలు ఉన్నాయి:

 • సలాడు ఆయిలు వెనిగరు మిశ్రమం (ఎమల్షను)ఆధారంగా తయారుచేసే సలాడులను వైనైగ్రెట్సు అంటారు. తరచుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, మిరియాలు, చక్కెర, ఇతర పదార్ధాలతో రుచి చూస్తారు.[15]
 • క్రీం డ్రెస్సింగు సలాడులు సాధారణంగా మయానీసు లేదా పులియబెట్టిన పాల ఉత్పత్తులైన పెరుగు, సోర్ క్రీం (క్రీం ఫ్రాచే, స్మేటన) లేదా మజ్జిగ ఆధారంగా తయారు చేయబడతాయి.

యునైటెడు స్టేసులో మయానైసు-ఆధారిత రాంచి డ్రెస్సింగు అత్యంత ప్రాచుర్యం పొందింది. వైనైగ్రెట్సు, సీజరు తరహా డ్రెస్సింగు చాలా వెనుకబడి ఉన్నాయి.[16] ఫ్రాంసులో సాంప్రదాయ డ్రెస్సింగు వైనైగ్రెట్సు సాధారణంగా ఆవాలు ఆధారితవి, సోర్ క్రీం (స్మేటన), మయానీసు తూర్పు ఐరోపా దేశాలు, రష్యాలో ప్రధానంగా ఉన్నాయి. మందపాటి సాసులను కొన్నిసార్లు "కాల్చిన బంగాళాదుంప" గా, మెటోనిమి రూపంగా సూచిస్తారు. అయినప్పటికీ అవి చాలా అరుదుగా పిండి ఉత్పత్తులను కలిగి ఉంటాయి. డెన్మార్కులో, డ్రెస్సింగులు తరచుగా క్రీం ఫ్రేచే మీద ఆధారపడి ఉంటాయి. దక్షిణ ఐరోపా, తూర్పు మధ్యధరాలో, సలాడు సాధారణంగా ఆలివు నూనె, వినిగరుతో డైనరుతో తయారుచేయబడుతుంది. ఆసియాలో సలాడు డ్రెస్సింగులకు నువ్వుల నూనె, ఫిషు సాసు, సిట్రసు జ్యూసు లేదా సోయా సాసులను జోడించడం సర్వసాధారణం.[ఉల్లేఖన అవసరం]

ఇతర సలాడు డ్రెస్సింగులు:

సలాడు రికార్డులుసవరించు

2016 సెప్టెంబరు 4 న రష్యాలోని మాస్కోలోని రెడ్ స్క్వేరులో మౌజెనిడిసు యాత్ర ఆధారంగా 100 కిలోగ్రాముల (44,300 పౌండ్లు) సలాడు రికార్డు సృష్టించబడింది. ఈ గ్రీకు సలాడులో టమోటాలు, దోసకాయలు, ఉల్లిపాయలు, ఆలివు, ఫెటా చీజు, ఆలివు ఆయిలు, ఒరేగానో, ఉప్పు ఉపయోగించబడ్డాయి.[17]

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. మూస:Cite dictionary
 2. "salad". Oxford Dictionaries. Oxford University Press. Retrieved 16 ఆగస్టు 2014.
 3. 3.0 3.1 మూస:OEtymD
 4. Lynne Olver. "TheFood Timeline: history notes--salad". Cite web requires |website= (help)
 5. "salad-recipe.net". మూలం నుండి 3 నవంబర్ 2005 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 6. "A Discourse of Sallets-Free Ebook". Cite web requires |website= (help)
 7. "The History Of Salad". ChefTalk.com. 17 ఫిబ్రవరి 2010. మూలం నుండి 5 జూన్ 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 20 అక్టోబర్ 2009.
 8. "Council Minutes page 78" (PDF). Cite web requires |website= (help)
 9. "Curaçao Papers page 234" (PDF). Cite web requires |website= (help)
 10. "Birth of the salad bar; Local restaurant owners may have invented the common buffet," The State Journal-Register (Springfield, IL), December 28, 2001, Magazine section (p. 10A)
 11. Lam, Bourree (3 జులై 2015). "America's $300 Million Salad Industry". The Atlantic. Retrieved 3 జులై 2015.
 12. "As Bagged Salad Kits Boom, Americans Eat More Greens". Cite web requires |website= (help)
 13. Paula Deen. "Wedge Salad". Food Network. Retrieved 25 జనవరి 2016.
 14. 14.0 14.1 Melissa Barlow, Stephanie Ashcraft. Things to Do with a Salad: One Hundred One Things to Do With a Salad. Gibbs Smith, 2006. ISBN 1-4236-0013-4. 128 pages, page 7.
 15. "Vinaigrette". BBC Good Food. మూలం నుండి 30 సెప్టెంబర్ 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 16 జనవరి 2020.
 16. "Top Ten Most Popular Salad Dressing Flavors". The Food Channel®. మూలం నుండి 26 జూన్ 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 16 జనవరి 2020.
 17. "Largest salad". Guinness World Records (ఆంగ్లం లో). Retrieved 14 నవంబర్ 2017.

అదనపు అధ్యయనంసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సలాడు&oldid=2939962" నుండి వెలికితీశారు