సల్మాన్ అలీ అఘా

పాకిస్తానీ క్రికెటర్

సల్మాన్ అలీ అఘా (జననం 1993, నవంబరు 23),[2] పాకిస్తానీ క్రికెటర్. దేశీయ మ్యాచ్‌లలో దక్షిణ పంజాబ్‌కు, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్‌కు ఆడతాడు. 2022 జూలైలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[3]

సల్మాన్ అలీ అఘా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1993-11-23) 1993 నవంబరు 23 (వయసు 31)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు6 అ. 0 అం. (1.83 మీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 247)2022 జూలై 16 - శ్రీలంక తో
చివరి టెస్టు2023 జూలై 24 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 236)2022 ఆగస్టు 16 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 11 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13Lahore Shalimar
2018–2021లాహోర్ కలందర్స్
2019–2023సదరన్ పంజాబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 9 17
చేసిన పరుగులు 536 413
బ్యాటింగు సగటు 47.71 41.30
100లు/50లు 2/4 0/3
అత్యధిక స్కోరు 132 58
వేసిన బంతులు 642 384
వికెట్లు 9 4
బౌలింగు సగటు 45.33 80.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/75 2/42
క్యాచ్‌లు/స్టంపింగులు 7/- 9/–
మూలం: ESPNcricinfo, 15 January 2023

దేశీయ క్రికెట్

మార్చు

2013 ఫిబ్రవరిలో, లాహోర్‌లోని అపోలో క్రికెట్ క్లబ్‌లో చాలా సంవత్సరాలు ఆడిన తర్వాత ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[4] 2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టులో ఎంపికయ్యాడు.[5][6]

2018 జూన్ లో, గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ కోసం ఆటగాళ్ళ డ్రాఫ్ట్‌లో ఎడ్మోంటన్ రాయల్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు.[7][8] ఆరు మ్యాచ్‌లలో 218 పరుగులతో ఎడ్మంటన్ రాయల్స్ తరపున టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[9]

2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్‌కు దక్షిణ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[10] 2021 అక్టోబరులో, శ్రీలంక పర్యటన కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[11]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2021 జనవరిలో, దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[12][13] 2021 మార్చిలో, జింబాబ్వేతో సిరీస్ కోసంమళ్ళీ పాకిస్తాన్ టెస్ట్ జట్టులో స్థానం పొందాడు.[14][15] 2021 జూన్ లో, సల్మాన్ ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[16] 2022 జూన్ లో, శ్రీలంకలో వారి రెండు-మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[17] ఆ సిరీస్‌లోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[18] 2022 ఆగస్టులో, నెదర్లాండ్స్ పర్యటన కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[19] ఆ సిరీస్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు.[20] 2022 డిసెంబరులో, తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు.[21]

మూలాలు

మార్చు
  1. "Agha Salman". Sportskeeda. Retrieved 27 July 2023.
  2. "Salman Ali Agha Special Interview | Pakistan vs New Zealand | 4th ODI 2023 | PCB | M2B2A". Sports Central. Retrieved 6 May 2023 – via YouTube.
  3. "Agha Salman". ESPNcricinfo. Retrieved 1 November 2015.
  4. "Salman Ali Agha Makes Debut For Pakistan In The First Test Against Sri Lanka". CricketNMore. 16 July 2022.
  5. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  6. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  7. "Global T20 Canada: Complete Squads". SportsKeeda. Retrieved 4 June 2018.
  8. "Global T20 Canada League – Full Squads announced". CricTracker. Retrieved 4 June 2018.
  9. "Global T20 Canada 2018, Edmonton Royals: Batting and Bowling Averages". ESPNcricinfo. Retrieved 16 July 2018.
  10. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  11. "Pakistan Shaheens for Sri Lanka tour named". Pakistan Cricket Board. Retrieved 2 October 2021.
  12. "Shan Masood, Mohammad Abbas, Haris Sohail dropped from Pakistan Test squad". ESPNcricinfo. Retrieved 15 January 2021.
  13. "Nine uncapped players in 20-member side for South Africa Tests". Pakistan Cricket Board. Retrieved 15 January 2021.
  14. "Pakistan squads for South Africa and Zimbabwe announced". Pakistan Cricket Board. Retrieved 12 March 2021.
  15. "Sharjeel Khan returns to Pakistan T20I side for tour of South Africa and Zimbabwe". ESPNcricinfo. Retrieved 12 March 2021.
  16. "Mohammad Abbas, Naseem Shah return to Pakistan Test squad". ESPNcricinfo. Retrieved 4 June 2021.
  17. "Yasir Shah returns for Sri Lanka Tests". Pakistan Cricket Board. Retrieved 22 June 2022.
  18. "1st Test, Galle, July 16 - 20, 2022, Pakistan tour of Sri Lanka". ESPNcricinfo. Retrieved 16 July 2022.
  19. "Pakistan name squads for Netherlands ODIs and T20 Asia Cup". Pakistan Cricket Board. Retrieved 3 August 2022.
  20. "1st ODI, Rotterdam, August 16, 2022, Pakistan tour of Netherlands". ESPNcricinfo. Retrieved 16 August 2022.
  21. Ali, Mir Shabbar (28 December 2022). "Gritty Salman cracks maiden ton before New Zealand respond strongly". DAWN.COM.

బాహ్య లింకులు

మార్చు

Pakistan Cricket Board