సవారి బండి గతంలో..... పల్లెల్లో బాగా జరుగు బాటున్న రైతుల వద్ద సవారి బండి వుండేది. ఇది ఒక ఎద్దుతో గాని, రెండెద్దులతో గాని నడిచేది. బండి పైన గూడు లాగ వుండి లోన కూర్చున్న వారికి నీడ నిచ్చే విధంగా వుండేది. వెదురు బద్దలతో తయారు చేసిన ఒక తడిక లాంటిది బండి పైన కప్పబడి వుంటుంది. అది బండిలో కూర్చున్న వారుకి ఎండ నుండి వర్షం నుండి రక్షణ నిచ్చేది. బండిలో చాపలు వేసి వుండేవి. మనుషుల ప్రయాణానికే ఉపయోగించే వారు. బండి తయారి కూడా అందంగా చెక్కబడి వుండేది. దానికి రంగులు వేసి వుంటుంది. దానికి కట్టే ఎద్దులకు కూడా అలంకరణ చాల బాగా వుండేది. ఎద్దుల మూతికి మూజంబరం, నడుముకు వెంట్రుకల దారం, కొమ్ములకు కుప్పెలు, కొన కొమ్ముకు రంగుల కుచ్చులు, మెడలో మువ్వలు, గజ్జలు, ఒక గంట, వుండేవి. ఆ బండిలో ప్రయాణిస్తుంటే అదొక హోదా..... దాన్నే సవారి బండి అనేవారు. దీన్ని మనుషుల సవారి కొరకు తప్ప సామానులకు రవాణ కొరకు వుపయోగించరు. సామానుల రవాణ కొరకు మరొక సవారి బండి వుండేది. అది కేవలం సరకుల రవాణా కొరకు మాత్రమే ఉపయోగించే వారు. దీనిని ఇతర ప్రదేశాలకు, సంతలకు తమ వస్తువులను రవాణ చేసుకోవడాన్నికి వ్వాపారస్తులు వాడే వారు.

బగ్గీ

ప్రయాణీకుల సౌకర్యార్ధం గూడు కట్టబడడం వలన దీనిని కొన్ని ప్రాంతాలలో గూడు బండి అని పిలుస్తారు.

మూలాలు

మార్చు