సవారి (2020 సినిమా)
సవారి 2020, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి నిర్మాణ సారథ్యంలో సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ తదితరులు నటించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.
సవారి | |
---|---|
దర్శకత్వం | సాహిత్ మోత్కూరి |
రచన | సాహిత్ మోత్కూరి |
నిర్మాత | సంతోష్ మోత్కూరి నిషాంక్ రెడ్డి కుదితి |
తారాగణం | నందు, ప్రియాంక శర్మ |
ఛాయాగ్రహణం | మొనీష్ భూపతిరాజు |
కూర్పు | సంతోష్ మేనం |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థ | కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 7 ఫిబ్రవరి, 2020 |
సినిమా నిడివి | 133 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చురాజు (నందు), తనకు ప్రాణమైన బాద్ షా అనే గుర్రంతో బస్తీలో నివసిస్తుంటాడు. ఆ గుర్రంపై సవారీకి తిప్పుతూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అయితే ఆ గుర్రానికి గుండె జబ్బు రావడంతో అందుకు సంబంధించిన ఆపరేషన్ చేయాల్సివస్తుంది. అందుకోసమే డబ్బు సంపాదిస్తుంటాడు. మరోవైపు భాగీ (ప్రియాంకా శర్మ) అనే గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే సడన్‌గా ఓరోజు బాద్ షా మాయం అయిపోతుంది. ఆ గుర్రం కోసం పిచ్చోడిలా తిరుగుతుంటాడు. ఆ గుర్రం ఏమైంది? భాగీతో ప్రేమాయణం ఎన్ని మలుపులు తిరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
మార్చు- నందు (రాజు)
- ప్రియాంక శర్మ (భాగీ)
- గుర్రం (బాద్ షా)
- శివ కుమార్ (శాండీ)
- శ్రీకాంత్ రెడ్డి గంట (కాశీ)
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
- నిర్మాణం: సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి కుడితి
- సంగీతం: శేఖర్ చంద్ర
- సినిమాటోగ్రఫీ: మొనీష్ భూపతిరాజు
- కూర్పు: సంతోష్ మేనం
- నిర్మాణ సంస్థ: కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్
నిర్మాణం
మార్చుఈ చిత్రానికి నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు.[1] రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు మొదట ప్రకటించారు; అయితే, ఆ వార్తలు అబద్ధమని తేలింది.[2] ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలలో గుర్రం, నందు, ప్రియాంక శర్మలు నటించారు.[3][4][5] ఈ చిత్రంలో మురికివాడకు చెందిన వ్యక్తిగా నందు నటించాడు.[6]
పాటలు
మార్చుఈ చిత్రానికి పాటలను శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.[7] "నీ కన్నులు" అనే పాట 2019 అక్టోబరు నెలలో విడుదలైంది.[8] పూర్ణాచారి రాసిన "ఉండిపోవా నువ్విలా" పాట విడుదలైన తర్వాత అందరిని అలరించింది.[9]
విడుదల
మార్చుఈ చిత్రం 2020, ఫిబ్రవరి 7న విడుదలైంది.[6][10][11] "సినిమాలోని డ్రామా సరిగా లేదు" అని ఫిల్మ్ కంపానియన్ రాసింది.[12] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 2.5 రేటింగ్ ఇచ్చింది. "ఈ చిత్రం అంతగా నచ్చకపోయినా ముఖం మీద చిరునవ్వు తెప్పిస్తుంది" అని పేర్కొంది.[13]
మూలాలు
మార్చు- ↑ "Savaari trailer: Geetha Madhuri surprised over Nandhu's bold act - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
- ↑ ""My next film set against a village backdrop," says actor Nandu - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
- ↑ "Of a horse and a hero". Telangana Today. Retrieved 2020-10-27.
- ↑ "'Savaari' first look: Rustic rom-com from independent filmmaker Saahith Mothkuri - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
- ↑ "'Savaari' teaser: The story of a horse, a man and his lady love - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
- ↑ 6.0 6.1 "'I am happy Savaari is garnering attention'". Telangana Today. Retrieved 2020-10-27.
- ↑ "I have to thank music buffs for making Savaari's songs a hit: Shekar Chandra - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
- ↑ "Nee Kannulu from the film Savaari is a peppy number - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
- ↑ ""I'm a very independent and self-motivated individual," says lyricist Purna Chary". The Times of India. April 25, 2020. Retrieved 2020-10-27.
- ↑ "Nandu and Priyanka Sharma starrer 'Savaari' set for a grand release on Feb 7 - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
- ↑ "5 Telugu movies we can't wait to see this Friday". The Times of India. February 4, 2020. Retrieved 2020-10-27.
- ↑ Menon, Vishal (May 30, 2020). "Revisiting Telugu Film Savaari On Aha: An Overlong, Melodramatic Man-Horse Bromance That Has Its Moments". Retrieved 2020-10-27.
- ↑ "Savaari Movie Review: Savaari is an entertaining rom-com despite the flaws". Retrieved 2020-10-27 – via timesofindia.indiatimes.com.