సహాయం:వికీ మార్కప్తో దిద్దుబాటు చెయ్యడం పరిచయం/2
దిద్దుబాటు చెయ్యడం
ఆకృతీకరణ
లింకులూ వికీలింకులూ
మార్పులను భద్రపరచడం
కొత్త వ్యాసాలను సృష్టించడం
సారాంశం
|
ఎక్కువ వ్యాసాల్లో పాఠ్యాన్ని ఆకృతీకరించే పని పెద్దగా ఉండదు. ఏ భాగాన్నైతే ఆకృతీకరించాలో ఆ పాఠ్యానికి ఆ చివర గానీ ఈ చివర గానీ, లేదా రెండు వైపులా గానీ కొన్ని సంకేతాలను చేర్చితే సరిపోతుంది. ఆ మార్కప్ను నేరుగా టైపు చెయ్యవచ్చు, లేదా దిద్దుబాటు పెట్టెకు పైన ఉన్న పరికరాల పెట్టె ద్వారా చేర్చవచ్చు.
విభాగాలు, ఉప విభాగాలను పేరాగ్రాఫు నొక్కినపుడు వచ్చే మెనూ లోని శీర్షిక ను ఎంచుకోవడం ద్వారా చేర్చవచ్చు. "శీర్షిక" ను ఎంచుకుంటే ఎంచుకున్న పాఠ్యాన్ని ప్రధాన విభాగంగా మారుస్తుంది. పేజీలో చాలా ఎక్కువగా వాడే విభాగం ఇది.
|