సహాయం:విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చెయ్యడం పరిచయం/4
ఎడిటరును తెరవడం
పరికరాలపట్టీ ప్రాథమిక విషయాలు
లింకులు, వికీలింకులు
మార్పులను ప్రచురించడం
కొత్త వ్యాసాల సృష్టి
సారాంశం
|
మీరు చేసే సవరణలు పూర్తయ్యాక, పరికరాలపట్టీ లోని నీలం రంగు మార్పులను ప్రచురించుబొత్తాన్ని నొక్కండి. అప్పుడు తెరుచుకునే డైలాగ్ పెట్టెలో దిద్దుబాటు సారాంశం ఇవ్వండి. ఈ సారాంశం, మీరు ఏమి మార్చారో ఇతర వాడుకరులు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
మీరు చేసినది ఏ వివాదామూ లేని చిన్నపాటి ఫార్మాటింగు మార్పులలాంటివి అయితే, మీ దిద్దుబాటును చిన్న మార్పుగా గుర్తిస్తే ఇతర వాడుకరులకు అది ఉపయోగపడుతుంది (మీరు లాగిన్ అయి ఉంటేనే ఈ వికల్పం కనిపిస్తుంది లేదంటే కనబడదు). అలాగే< ఆ పేజీలో ఇకపై జరిగే మార్పుచేర్పుల గురించి మీకు తెలియాలంటే , ఆ పేజీని మీ వీక్షణ జాబితా లోకి చేర్చుకోవచ్చు (ఇది కూడా, లాగిన్ అయి ఉన్నవారికే పనిచేస్తుంది).
|