సహాయం:విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చెయ్యడం పరిచయం/5
ఎడిటరును తెరవడం
పరికరాలపట్టీ ప్రాథమిక విషయాలు
లింకులు, వికీలింకులు
మార్పులను ప్రచురించడం
కొత్త వ్యాసాల సృష్టి
సారాంశం
|
వికీపీడియాలో ఇప్పటికి 1.02 లక్షల వ్యాసాలున్నాయి. అంటే, ఉన్నవాటినే మెరుగు పరచాల్సిన పని కూడా ఉంటుందన్నమాటే. అయితే, మీరు పూర్తిగా కొత్త వ్యాసాన్ని సృష్టించదలిస్తే అంతకంటే కావాల్సింది లేదు! ఆ పని మొదలు పెట్టే ముందు మీరు మూడు సంగతులను గమనంలో ఉంచుకోవాలి : విషయ ప్రాముఖ్యతవ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉందా? వికీపీడియాలో చేరాలంటే విషయానికి తగినంత ప్రాముఖ్యత ఉండాలి. విషయంతో ఏ సంబంధమూ లేని స్వతంత్ర ప్రచురణల్లో (ఉదా: వార్తా పత్రికలు, పుస్తకాలు, పత్రికలు, వైజ్ఞానిక/విద్యా సంబంధ ప్రచురణలు వగైరా) విషయం గురించి గణనీయంగా ప్రచురితమై ఉండాలి.
విశ్వసనీయ మూలాలువ్యాసంలో చర్చనీయంశమైన విషయాలకు మద్దతుగా విశ్వసనీయమైన, ధ్రువీకరించుకోదగిన మూలాలున్నాయా? వ్యాసం మొదలుపెట్ట బోయే ముందే, మూలాలుగా చూపించుకునేందుకు విశ్వసనీయమైన, ష్రువీకరించుకోదగ్గ వనరులను సేకరించి పెట్టుకోవడం ఉత్తమమైన పద్ధతి. వికీపీడియా లోని సమాచారం కచ్చితత్వంతో, ధ్రువీకరించుకోదగ్గదిగా, విశ్వసనీయంగా ఉంచేందుకు ఇది అత్యావశ్యకం. వ్యాస విషయం పట్ల వేరే విధమైన ఆసక్తివ్యాస విషయంతో మీకు వేరే విధమైన ఆసక్తి (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) ఉందా? మీ గురించి, మీ సంస్థ గురించి, మీకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి గురించీ రాయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇలాంటి విషయాల వ్యాసాల్లో నిష్పాక్షికతను, తటస్థ దృక్కోణాన్నీ కలిగి ఉండడం కష్టం కాబట్టి. ఆ వ్యాసాన్ని మీరే రాయకపోయినా, ఇతర వాడుకరులను రాయమని కోరవచ్చు. తగు సమాచారాన్ని, సంబంధిత విశ్వసనీయ వనరులతో సహా వారికి అందించవచ్చు. కొత్త పేజీని ఎక్కడ సృష్టించాలికొత్త పేజీని మీ వాడుకరి పేజికి ఉపపేజిగా సృష్టించడం ఉత్తమం. (వాడుకరి:ఉదాహరణ/ఉపపేజీ లాగా నన్నమాట) ". ఈ విధంగా మీ వ్యాసాన్ని అభివృద్ధి పరచి, ఆ తరువాత దాన్ని ప్రధానబరి లోకి తరలించవచ్చు.
|