సహాయం:విజువల్ ఎడిటరుతో మూలాలివ్వడం గురించి పరిచయం/5
నిర్ధారత్వం
మూలాలను చేర్చడం
ఉన్నవాటిని సరిదిద్దడం
మూలాలను మళ్ళీ మళ్ళీ వాడడం
విశ్వసనీయ వనరులు
సారాంశం
|
వికీపీడియా వ్యాసాల్లో ఉన్న సమాచారాన్ని నేరుగా సమర్థించే నమ్మకమైన, ప్రచురించిన మూలాలు అవసరం. వ్యాసానికి మూలాలను ఎలా జోడించాలో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కానీ ఏ వనరులను ఉపయోగించాలి? వికీపీడియాలోని "మూలం" అనే పదానికి మూడు అర్థాలు ఉన్నాయి: కృతి (ఉదాహరణకు, ఒక పత్రం, వ్యాసం, పుస్తకం), కృతికర్త (ఉదాహరణకు, రచయిత), కృతి ప్రచురణకర్త (ఉదాహరణకు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్). ఈ మూడూ విశ్వసనీయతను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా చాలావరకు విశ్వసనీయమైన వనరుల విషయంలో వాస్తవాలను తనిఖీ చేయడంలో, చట్టపరమైన సమస్యలను విశ్లేషించడంలో, ప్రచురణలో రచనను పరిశీలించడంలోనూ ఎక్కువ మంది నిమగ్నమై ఉంటారు. విద్యాసంబంధమైన ప్రచురణలు, సాటివారి-సమీక్షకు లోనైన ప్రచురణలు సాధారణంగా అత్యంత విశ్వసనీయమైన వనరులు. ఇతర విశ్వసనీయ వనరులలో విశ్వవిద్యాలయ పాఠ్యపుస్తకాలు, గౌరవనీయమైన ప్రచురణ సంస్థలు ప్రచురించిన పుస్తకాలు, పత్రికలు, జర్నళ్ళు, ప్రధాన స్రవంతి వార్తాపత్రికలూ ఉన్నాయి. (CNN వారి iReport వంటి కొన్ని వార్తా సంస్థలు, మ్యాగజైన్లు వారి వెబ్సైట్లలో "బ్లాగులను", వినియోగదారు వ్రాసిన కథనాలనూ ప్రచురిస్తాయని గమనించండి. ప్రచురణకర్త యొక్క వృత్తిపరమైన రచయితలు వ్రాసినట్లయితే ఇవి నమ్మదగినవి కావచ్చు, కాని పాఠకుల పోస్టులు సాధారణంగా నమ్మదగిన వనరులుగా పరిగణించబడవు) రచయిత, ప్రచురణకర్త ఒకరే అయి ఉండే స్వీయ-ప్రచురిత మీడియా - న్యూస్లెటర్లు, వ్యక్తిగత వెబ్సైట్లు, పుస్తకాలు, పేటెంట్లు, ఓపెన్ వికీలు, వ్యక్తిగత లేదా సమూహ బ్లాగులు, ట్వీట్ల వంటివి - సాధారణంగా మూలాలుగా ఆమోదించబడవు. ఒక మినహాయింపు ఏమిటంటే, రచయిత ఒక అంశంపై చేసిన కృతులు గతంలో తృతీయ పక్షం ద్వారా ప్రచురితమై, ఆ విషయానికి సంబంధించి నిపుణుడిగా నమోదయి ఉంటే, ఆ సందర్భంలో, వారి స్వీయ-ప్రచురిత రచన ఆ విషయానికి మాత్రం నమ్మదగిన వనరుగా పరిగణించబడుతుంది (కాని ఇతర విషయాలకు కాదు). అయినప్పటికీ కూడా, మూడవ పార్టీ ప్రచురణలే ఉత్తమమైనవి. మూలం ఉపయోగపడుతుందా లేదా అనేది సందర్భం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని అంశాలకు విశ్వసనీయంగా ఉన్న మూలాలు ఇతర అంశాలకు విశ్వసనీయమైనవి కాకపోవచ్చు. ఉన్న సమాచారానికి సాధ్యమైనంత ఉత్తమమైన మూలాన్ని కనుగొనడానికి మీరు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. జీవించి ఉన్న ప్రజల గురించిన సమాచారం కోసం, అత్యంత విశ్వసనీయమైన వనరులను మాత్రమే వాడాలి. మరోవైపు, వ్యాసాల విషయమైన వ్యక్తి రాసిన స్వీయ-ప్రచురిత మూలాలు కొన్నిసార్లు వారి గురించిన సమాచారానికి వనరులుగా ఉపయోగపడవచ్చు. ఇవి సాధారణ మార్గదర్శకాలు, కానీ నమ్మదగిన వనరులనేది సంక్లిష్టమైన అంశం. దాన్ని ఇక్కడ పూర్తిగా వివరించడం అసాధ్యం. వికీపీడియా:నిర్ధారత్వం పేజీలో మరింత సమాచారం పొందవచ్చు.
|