వికీపీడియాలో డేటాను ప్రదర్శించేందుకు పట్టికలను వాడతారు. ఈ పాఠంలో కొత్త పట్టికలను చేర్చడం, పాత వాటిని దిద్దడం గురించి చూడవచ్చు.
పేజీని దిద్దుబాటు స్థితిలో తెరిచినపుడు, పైన కనిపించే పరికరాలపట్టీని వాడి పట్టికను తేలిగ్గా సృష్టించవచ్చు. బొత్తాన్ని నొక్కితే రెండు నిలువు వరిసలు, ఒక అడ్డు వరుసతో కూడిన పట్టిక యూక వికీ మార్కప్, పేజీలో కర్సరు ఉన్నచోట చేరుతుంది. అ వికీ మార్కప్ కింది విధంగా ఉంటుంది:
{| class="wikitable"
|+ Caption
! శీర్షిక గడి !! శీర్షిక గడి
|-
| కంటెంటు గడి || కంటెంటు గడి
|}
ఆ తరువాత పట్టిక వ్యాఖ్యను, శీర్షికలను, గడుల్లోని డేటాను మార్చుకోవచ్చు, కొత్త వరుసలను చేర్చుకోవచ్చు.
వికీపీడియా లోని పట్టికలను, ముఖ్యంగా పెద్ద పట్టికలు, దిద్దడానికి అమ్మో అనిపిస్తాయి గానీ, అవి పనిచేసే విధానం చాలా సరళంగా ఉంటుంది.