సమాజంలో పాత ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ తీవ్ర, త్వరిత మార్పులను వ్యతిరేకించే ఆలోచనా పద్ధతిని సాంప్రదాయ వాదం అనవచ్చు.[1].జ్ఞానోదయ యుగం (ఐరోపా) లో నిమ్న జాతులపట్ల నిర్లక్ష్యం, శాస్త్ర వేదాంతాలపట్ల ఆసక్తుల కారణంగా సంభవించిన ఫ్రెంచ్ విప్లవం కాలంలో ఈ వాదం పుట్టింది.

సాంప్రదాయ వాదం (ముఖ్యంగా ఏకేశ్వరవాదం పాటించే మతాలలో) మతపర విశ్వాసాలకి దోహద పడుతుంది. కొందరు సంప్రదాయవాదులు ప్రస్తుత స్థితిగతులను నిలబెట్టడానికి కొమ్ముకాస్తే, మిగిలినవారు ఒకప్పటి పాత పద్ధతులకు వెనెక్కివెళ్ళడం మంచిదని వాదిస్తారు. ఇంగ్లాండు లో పుట్టుకొచ్చిన సాంప్రదాయకపక్షం (మార్గరెట్ థాచర్ వంటి ప్రధాన మంత్రులు) ధనిక-పేద వర్గాలమధ్య ప్రజాస్వామ్య బద్ధమైన, మెఱుగైన సహకారాన్ని పెంపొందించే శ్రేయోరాజ్యాన్ని ఆశిస్తే, అమెరికా లోని సాంప్రదాయవాదులు (రోనాల్డ్ రీగన్ వంటి అధ్యక్షులు) శ్రేయోరాజ్యాన్ని శంకిస్తూ వ్యాపార ప్రపంచానికి మొగ్గుచూపే వర్గంగా రూపుదిద్దుకున్నారు.

సంప్రదింపులు

మార్చు
  1. "Conservatism (political philosophy)". Britannica.com. Retrieved on 1 November 2009.

ఇతర పుటలు

మార్చు