సాంస్కృతిక పునరుజ్జీవనం



ఐరోపాలో మధ్యయుగము తరువాత, రిఫార్మేషన్ ముందు (సుమారు 14 - 16వ శతాబ్దాల మధ్య) జరిగిన కాలాన్ని రెనసాన్స్ (ఫ్రెంచిలో పునర్జన్మ) అంటారు. ముఖ్యవైఖరుల లో

  • మూలముల నుండి శాస్త్ర అధ్యయనము
  • విజ్ఞాన శాస్త్రము ముందంజ వేయుట
  • చిత్రలేఖనములో దృష్టి (perspective) పెరుగుట
  • నాగరికమైన, పోపు సంబధమైన సంరక్షకత్వము పెరగడము

రెనసాన్స్ ఆత్మ జ్ఞానము

మార్చు

15 వ శతాబ్దములో ఇటలీలో రచయతలు, చిత్రకారులు, శిల్పులు సమాజములో వస్తున్న మార్పులు గమనిస్తూ వారి వారి చాతుర్యాన్ని పురాతన పద్ధతి, రోమన్ పద్ధతిగా విభజించుకుంటూ వస్తున్నారు. వసారి రెనసాన్స్ ను మూడు దశలుగా విభజించాడు. మొదటి దశలో Cimabue, Giotto and Arnolfo di Cambio; రెండవ దశలో Masaccio, Brunelleschi and Donatello; మూడవ దశలో లియొనార్డో డావించీ, మైఖెలాంజిలో ముఖ్యులు. పద్ధతులు పాతవైపొయాయ్యని తెలియడముతో పాటు ప్రకృతిని అధ్యయనము చేసి అనుకరించాలన్న జిజ్ఞాస కూడా ఈ అభివృద్ధికి కారణము.

రెనసాన్స్ చారిత్రిక యుగము

మార్చు

19వ శతాబ్దపు మొదలలో కాని రెనసాన్స్ ను చారిత్రిక యుగముగా గుర్తించలేదు. ఫ్రెంచ్ చారిత్రికుడు జూల్స్ మిషలె (1798-1874) రెనసాన్స్ లో సంస్కృతి, కళ లలో కంటే విజ్ఞానశాస్త్రములో నే ఆభివృదీ ఎక్కువ జరిగిందని భావించాడు. మిషలె లెక్క ప్రకారము రెనసాన్స్ కాలము క్రిష్టోఫర్ కొలంబస్ నుండి కోపర్నికస్, గెలీలియో ల వరకూ (అంటే 15-17 శతాబ్దాల మధ్య) .[1]. స్వీడన్ కు చెందిన చారిత్రికుడు [జేకబ్ బర్కాడ్ట్] వసారీ వలే (1818-1897) లో రెనసాన్స్ ను Giotto, మైఖెలాంజిలో ల మధ్య కాలముగా నిర్ణయించాడు. అతని పుస్తకము బాగా చదువబడి ఇటాలియన్ రెనసాన్స్ కు కొత్త అర్థాన్ని భావాన్ని తీసుకొచ్చింది.[2]. అర్కిటెక్చరులో పాల్ లెట్రావులీ (1795-1855) చిత్రించిన నూతన రోమ్ బిల్డింగుల ఫోలియో రెనసాన్స్ మీద ఆసక్తి పెరగడానికి కారణమైనది.

15, 16 వ శతాబ్దము ల లో ఐరోపా లో వివిధ దేశముల లో జరిగిన రెనసాన్స్ లు

మార్చు
 
లియోనార్డో డావించీ విట్రూవియన్ మేన్, ఒక కళ, విజ్ఞానశాస్త్రముల కలయిక

20వ శతాబ్దములో పండితులు రెనసాన్స్ ను, ప్రాంతీయ జాతీయ గమనములుగా విభజించారు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Jules Michelet. History of France, translated by G. H. Smith. (New York: D. Appleton, 1847).
  2. Peter Gay, Style in History. (New York: Basic Books 1974)

మూలములు

మార్చు