సాక్షి గులాటి

భారతీయ సినిమా నటి, మోడల్

సాక్షి గులాటి భారతీయ సినిమా నటి, మోడల్. 2008లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కాంట్రాక్ట్ అనే హిందీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[2][3]

సాక్షి గులాటి
Sakshi Gulati.jpg
జననంమార్చి 10, 1983
వృత్తినటి, మోడల్
ఎత్తు5 అడుగుల 8 అంగుళాలు[1]

జీవిత విశేషాలుసవరించు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని ఆర్మీ నేపథ్యానికి చెందిన పంజాబీ కుటుంబంలో 1983, మార్చి 10న సాక్షి జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ (హోన్స్) డిగ్రీని పూర్తిచేసింది. నటన, కథక్, సల్సా వంటి నృత్యాలు,[2] ఈత, గుర్రపు స్వారీ మొదలైన వాటిల్లో శిక్షణ పొందింది.[4]

సినిమారంగంసవరించు

2007లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. కాంట్రాక్ట్ (2008), ది ఫిల్మ్ ఎమోషనల్ అత్యాచార్ (2010), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు (2011),[5] చిత్రాంగద (2017)[6] వంటి చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష
2007 ఢిల్లీ హైట్స్ స్వీటి (అతిథి పాత్ర) హిందీ
2008 కాంట్రాక్ట్ ఇయా (ప్రధాన పాత్ర) హిందీ
2010 ది ఫిల్మ్ ఎయోషనల్ అత్యాచార్ ఐశ్వర్య (అతిథి పాత్ర) హిందీ
2011 కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు కనిష్క (ప్రధాన పాత్ర) తెలుగు
2017 చిత్రాంగద[7] సంయుక్త (ప్రధాన పాత్ర) తెలుగు
2017 దుశ్మన్ రేహా (ప్రధాన పాత్ర) పంజాబి

మూలాలుసవరించు

  1. "SAKSHI GULATI - PROFILE". The Times of India. 3 September 2013. Retrieved 2 April 2020.
  2. 2.0 2.1 "Contract with Bollywood". The Hindu. 5 July 2008. Retrieved 2 April 2020.
  3. "Sakshi Gulati looks sexy in a photoshoot". Times Internet.
  4. "Telly actor Nishant Malkani celebrates birthday with friends". Mid Day. 3 September 2013. Retrieved 2 April 2020.
  5. "Sakshi Gulati". IMDb.
  6. "'Chitrangada' wrapped up". Y Talkies. 3 September 2013. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 2 April 2020.
  7. 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 2 April 2020.

ఇతర లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో సాక్షి గులాటి