సాజిద్ అలీ

పాకిస్తానీ మాజీ క్రికెటర్

సాజిద్ అలీ (జననం 1963, జూలై 1) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1984-1997 మధ్యకాలంలో 13 వన్డేలు ఆడాడు.

సాజిద్ అలీ
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 13
చేసిన పరుగులు 130
బ్యాటింగు సగటు 10.83
100లు/50లు -/- 0/0
అత్యధిక స్కోరు 28
వేసిన బంతులు
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a
అత్యుత్తమ బౌలింగు -/-
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 1/-
మూలం: Cricinfo, 2006 మే 3

క్రికెట్ రంగం

మార్చు

ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో రాణించాడు. 1982/83 నుండి 2005 డిసెంబరులో పాకిస్తాన్ కస్టమ్స్ కు చివరి మ్యాచ్ వరకు 22 సంవత్సరాలపాటు క్రికెట్ లో ఉన్నాడు. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో ఎక్కువ భాగం అతను నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కోసం ఆడాడు. 10,000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు, ఇది జట్టు రికార్డుగా నిలిచింది.[1]

సాజిద్ అలీ పాకిస్తాన్ తరపున 13 వన్డే ఇంటర్నేషనల్‌లను ఆడాడు. 12 వన్డే ఇన్నింగ్స్‌లలో అతను 28 పరుగుల అత్యధికంతో మొత్తం 130 పరుగులు మాత్రమే చేశాడు. 22 సీజన్లపాటక ఫస్ట్-క్లాస్ కెరీర్ ను కొనసాగించాడు.[2]

2020 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన ఓవర్-50 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[3][4] అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా టోర్నమెంట్ మూడవ రౌండ్ మ్యాచ్‌ల సమయంలో రద్దు చేయబడింది.[5]

మూలాలు

మార్చు
  1. Most Runs for National Bank of Pakistan, CricketArchive, Retrieved on 2023-09-03
  2. "Sajid Ali". ESPNCricinfo. Retrieved 2023-09-03.
  3. "2020 over-50s world cup squads". Over-50s Cricket World Cup. Archived from the original on 2022-09-20. Retrieved 2023-09-03.
  4. "Over-50s Cricket World Cup, 2019/20 - Pakistan Over-50s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-09-03.
  5. "Over-50s World Cup in South Africa cancelled due to COVID-19 outbreak". Cricket World. Retrieved 2023-09-03.

బాహ్య లింకులు

మార్చు