సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం
సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది.[1]
సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | అండమాన్ నికోబార్ |
Area | 85.47 కి.మీ2 (33.00 చ. మై.) |
Established | 1979 |
చరిత్ర
మార్చుఈ ఉద్యానవనం 1979లో స్థాపించబడింది. ఇది 85.47 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడి వాతావరణం సాధారణంగా 20-30 ° C (68–86 ° F) మధ్య మారుతూ ఉంటుంది. ఇక్కడ వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది.[2]
జంతుజాలం
మార్చుఈ ఉద్యానవనంలో సముద్ర ఉష్ణోగ్రతలలో నివసించే జంతువులు సంరక్షించబడుతున్నాయి. అందులో అండమాన్ అడవి పంది, అండమాన్ హిల్ మైనా, అండమాన్ ఇంపీరియల్ పావురం, వాటర్ మానిటర్, డాల్ఫిన్లు, తిమింగలాలు, ఉప్పునీటి మొసలి వంటి అనేక జంతువులు సంరక్షించబడుతాయి.
వృక్ష సంపద
మార్చుఈ ఉద్యానవనం చుట్టూ తేమ, ఉష్ణమండల వృక్షసంపదతో పాటు ఆకురాల్చే సతత హరిత అడవులు ఇందులో ఉన్నాయి. అందులో స్కోలోపియా పుసిల్లా, క్లిస్టాంతస్ రోబస్టస్ జాతుల వృక్షాలు ఇందులో పెరుగుతాయి. ఈ వృక్షాలు భారతదేశంలో అరుదుగా కనిపిస్తాయి.[3]
మూలాలు
మార్చు- ↑ Bisht, R.S. (1995). National parks of India. New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. p. 71. ISBN 8123001789.
- ↑ Negi, S.S. (2002). Handbook of national parks, wildlife sanctuaries, and biosphere reserves in India (3rd rev. ed.). New Delhi: Indus Pub. Co. p. 52. ISBN 8173871280.
- ↑ New Reports to the Flora of India from Saddle Peak National Park, North Andaman. Rheedea. Vol. 19 (1 & 2) 69-71. 2009