చతుర్విధ అభినయములు లలో నాలుగవది. సత్త్వమనగా హృదయంలో ఆవిర్భవించిన భావం. ఇది మానవుల హృదయాలలో అవ్యక్తంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి నటించడమే సాత్త్వికాభినయం. భావ ప్రకటన అనేది ఈ సాత్త్వికాభినమే.

ఇది రెండు విధాలుగా ఉంటుంది. 1. అంతరం: మనసును ఆశ్రయించుకొని ఉంటుంది. 2. బాహ్యం: దేహాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది.

విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి: అని భరతుడు చెప్పడం వల్ల ప్రేక్షకులలో అణిగివున్న రసాలను విభావానుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల నటుడు రసానుభూతి పొందగలుగుతాడు. ఇలా ప్రేక్షకులలో రసానుభూతిని కలిగించడమే సాత్త్వికాభినయం.

మూలాలుసవరించు