రంగస్థలం మీద నటీనటుల శారీరక, మానసిక, వాచిక కలాపాన్ని అభినయం అంటారు. నటులు తాము ధరించిన పాత్రయొక్క సుఖదుఃఖాది అవస్థలు, హావభావ విలాసీది చూష్టలను వ్యక్తీకరిస్తూ, ఆ పాత్రే మన ముందు ప్రత్యక్షమైందని భ్రమింపజేసి, రసానుభూతి కలిగించే ప్రక్రియే అభినయం. ఉదాః తేలు కుట్టినపుడు ఏడవడం సహజం. అది అభినయమనమనిపించుకోదు. తేలు కుట్టనపుడు కుట్టినట్లు నటించి, నిజంగా తేలు కుట్టిందని ఎదుటివారు నమ్మేట్లు చేయడం అభినయం.

రంగస్థలంపై కళాకారుల అభినయం

ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాజ్మయమ్
ఆహార్యం చన్ద్ర తారాది తం వందే సాత్త్వికం శివమ్ (అభినయ దర్పణం 1-1)

ఈ అభినయం రెండు రకాలు.

  1. స్థూలాభినయం - వాక్యార్థ అభినయం. వాక్యార్థాన్ని స్థూలంగా ప్రేక్షకుల హృదయాలలో హత్తకునేలా చేయడం. ఇది నాటక ప్రదర్శనలో ప్రయోగిస్తారు.
  2. సూక్ష్మాభినయం - ప్రతి పదానికి అర్థాన్ని ప్రదర్శించి చూపడం. ఇది నృత్య ప్రదర్శనలో ఉపయోగిస్తారు.

మూనవుని పుట్టకతో సిద్ధించిన అనుకరణ ప్రవృత్తి అభినయానకి మూలమని కొందరి అభిప్రాయం. అత్మావిష్కరమే అభినయమని కొందరు, నాటక కథ ద్వారా సిద్ధించిన మానవ హృదయ జీవనమే అభినయమని మరికొందరి భావన. పాత్ర బాహ్యకృతిని చిత్రించడమే గాక, నటుడు తనలోని మానవ స్వభావాలను ఆ పాత్రలో పొందుపరచి తన ఆత్యను అందులో ప్రతిష్టించి, మానవుల అంతర్జీవితాన్ని సృజించి కళాత్యకంగా ప్రదర్శించడమే అభినయమని మరికొందరు నిర్వచించారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కళాకారుని ద్వారా ఒక్కొక్క రీతిలో అభినయం వర్థిల్లి ప్రచారంలోకి వచ్చింది.

పై రెండు రకాల అభినయాలే కాకుండా ఇంకో నాలుగు రకాల అభినయాలు ఉన్నాయి. వాటినే చతుర్విధ అభినయములు అంటారు. అవి.

  1. ఆంగికాభినయం (అంగములచే నెరవేర్పబడునది)
  2. వాచికాభినయం (భాషా రూపమైనది)
  3. ఆహార్యాభినయం (రంగస్థలమునకు వలసిన సంభారమును సమకూర్చుట)
  4. సాత్త్వికాభినయం (సత్వము-ఇతరుల సుఖదుఃఖాది భావములను చూచి వానిని భావించునపుడు మనస్సునకు గలుగు అత్యంతాసక్తిచే నెరవేర్పదగిన భావములు మూలమున కలుగు అభినయము)

"ఆంగికో వాచికాహార్యౌ సాత్త్వికశ్చేత్యసౌ పునః" [నృ.ర. 1-29]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అభినయం&oldid=3858766" నుండి వెలికితీశారు