సాధు చెట్టి : బి.సి.డి.గ్రూపు కులం.

చరిత్ర

మార్చు

మద్రాసు రాష్ర్టంలో ఆంధ్ర ప్రాంతం అంతర్భాగంగా ఉన్న రోజుల్లో సాధుచెట్టి కులస్థుల పూర్వీకులు తమిళప్రాంతం, ఆంధ్రప్రాంతం అనే తేడా ఎరుగరు. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఉమ్మడి మద్రాస్‌ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లుగా విడదీసిననప్పుడు సాధుచెట్టి కులంవారు కూడా రెండుగా విడిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉన్న చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలలో నివసిస్తున్న వీరు మాతృభూమిపై అభిమానంతో తమిళనాడుకు వెళ్ల కుండా ఇక్కడే ఉండిపోయారు. అయితే జనాభాపరంగా ఎక్క వ శాతం తమిళనాడులో ఉన్న కారణంగా అక్కడివారు బలమైన శక్తిగా ఎదిగారు. పైగా తమిళనాడులో ఉద్యమ స్వభావంతో ఉన్న వారికి అక్కడ మంచి గుర్తింపు లభించటంతో బిసీ ఉద్యమం బలం పుంజుకుంది. ఇవన్నీ తమిళనాడులో ఉన్న సాధు చెట్టి వారికి తోడ్పడడంతో అక్కడివారు ఉచ్ఛ స్థితికి చేరుకు న్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడినవారు తమ కులం పేరును సైతం చెప్పుకోలేకపోతున్నారు.

వృత్తి, సామాజిక జీవనం

మార్చు

వీరి పూర్వీకులు జనపనారతో తాళ్లు, సంచులు,బోరీలు తయారు చేసేవారు. బంగ్లాదేశ్ లో ఈ వృత్తి చేసే ముస్లిం కుటుంబాల వారు వేలసంఖ్యలో ఉన్నారు. సొంత భూములు లేకపోవ టంతో జనపనార పండించే రైతుల పొలాలలోని జనుమును ఎకరాల చొప్పున టోకున కొనుగోలు చేసేవారు. ఆ జనుము నుంచి నారను వేరుచేసి దాన్ని కూడా నీళ్లలో ఒక రాత్రి నానబెట్టి మరుసటి రోజు బండమీదవేసి చెక్కతో మోదేవారు. దాదాపు వారం రోజులు ఇదే విధంగా చేయటంతో నార శుభ్ర పడి మెత్తగా తయారయ్యేది. ఆ నారను పేని `కదురు' సాయం తో తాళ్లుగా తయారు చేసేవారు.జనపనా రను చిన్న చిన్న పాయలుగా తీసుకుని తొడపైన పెట్టుకుని పొడవాటి తాడుగా పేనేవారు. ఈ క్రమంలో తొడపైన చేతిరా పిడి కారణంగా చర్మం లేచిపోయి పుండ్లు పడేవి. అటువంటి పుండ్లు పడకుండా ఉండేందుకు తొడపైన అరచేది వెడల్పున ఉన్న ఇనుప రేకు కట్టుకుని దానిపై నారను పేని తాళ్లను తయా రు చేయటం ఆరంభించారు. ఈ విధంగా తయారైన తాళ్లను మగ్గాలపై ఎక్కించి ఒక అడుగు వెడల్పు, 36 ఆడుగుల పొడ వున్న జనపనార బట్టను తయారు చేసేవారు. ఈ బట్టతో తమ కు కావలసిన సైజులో సంచులు, బోరీలు తయారు చేసే వారు. వీటిని గాడిదలు, గుర్రాలపై వేసుకుని ఊరూరా తిరిగి అమ్మే వారు. పంటలు ఇంటికి చేరే సమయంలో వీరికి చేతి నిండా పనే. కాగా జనుము పండించేవారు తగ్గిపోవటం, ప్లాస్టిక్‌ సంచుల మార్కెట్‌ పెరగడంతో వీరు ఉపాధి కోల్పోయారు. వీరికి సొంత భూములు లేకపోవటంతో వ్యవసాయ కార్మికు లుగా బతుకుబండిని లాగుతున్నారు.

కుల ధ్రువీకరణ పత్రాల సమస్య

మార్చు

సాధుచెట్టి కులస్థులు రాష్ర్టమంతటా దాదాపు 50 వేల మంది ఉన్నారు. రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాలలో జలిజ అని కూడా కుల సర్టిఫికెట్లు ఇస్తున్నారు. తమ కంటూ ఒక కులం ఉంది కనుక ఆ పేరున కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలనేది వీరి వాదన.సివిల్‌ సర్వీసెస్‌లో ఈ కులస్తులు ఒక్కరు కూడా లేరు.ప్రతి జిల్లాలోనూ తమ వారికి ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు