సనా గుహలు

(సానా గుహలు నుండి దారిమార్పు చెందింది)

సనా గుహలు అనేవి మానవ నిర్మిత గుహలు. ఇవి గుజరాత్, సోమనాథ్ లోని ఒక కొండ పైన ఉన్నాయి. ఈ గుహలను సా.పూ 2 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుహల్లో అందమైన బొమ్మలు, స్తూపాలూ ఉన్నాయి.[1]

సనా గుహలు
సనా గుహలు
Map showing the location of సనా గుహలు
Map showing the location of సనా గుహలు
Map showing the location of సనా గుహలు
Map showing the location of సనా గుహలు
అక్షాంశ రేఖాంశాలు20°57′45″N 71°12′08″E / 20.9624188°N 71.2023475°E / 20.9624188; 71.2023475
Plan, section and drawings of pillars of Sana caves (Chaitya Cave and Bhima Chauri Vihara)

సనా గుహల పేరుతో రెండు చోట్ల గుహలు ఉన్నాయి. ఈ రెండూ గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలోనే ఉన్నాయి. ఒకటి, ఊనా తాలూకాలో సనా వంకియా వద్ద ఉన్న సనా దుంగార్ బౌద్ధ గుహలు. ఈ ప్రదేశం ఊనా పట్టణం నుండి 28 కి.మీ. దూరం లోను, తులసి శ్యామ్ నుండి 35 కి.మీ., రజులా నుండి 35 కి.మీ. దూరం లోనూ ఉంది.[2]

రెండవది వెరావల్-సోమనాథ్ ప్రాంతంలో, వెరావల్ నుండి 7 కి.మీ. దూరంలోను, సోమనాథ దేవాలయం నుండి 2 కి., మీ. దూరం లోనూ ఉన్న సనా బౌద్ధ గుహలు. వీటిని సనా గుహలు అని అనరు. ప్రభాస్ పటాన్ లోని ప్రాచీన గుహలు అంటారు. ఈ రెండు గుహల మధ్య దూరం 105 కి.మీ. పేర్లలో ఉన్న సారూప్యత వలన, ఈ రెండు ప్రదేశాల్లో ఉన్న సామీప్యత వలనా ఈ రెండు గుహల గురించిన సమాచారం పత్రికల్లో కలగలిసి పోయింది.

సనా దుంగార్ బౌద్ధ గుహలు

మార్చు

మెత్తటి రాతిలో తొలిచిన గుహలు ఇక్కడ 62 ఉన్నాయి. స్తూపాలు, చైత్యాలు, పిల్లోలు, బెంచిలు ఉన్నాయి. కొన్ని గుహలు గుమ్మటం ఆకారంలో ఉంటాయి. కొందరు చారిత్రికుల ప్రకారం ఈ గుహల నిర్మాణం సా.పూ. 2 వ శతాబ్దంలో మొదలైంది.[3] సా.శ. 1 వ శతాబ్దంలో వీటిని నిర్మించారని మరి కొందరు అంటారు.[4]

వర్షాకాలంలో ఇవి బౌద్ధ సన్యాసులకు ఆశ్రయం కలిగించాయి. కొండపై అనేక ఎత్తుల్లో వీటిని తొలిచారు. బౌద్ధాన్ని ప్రవచించే సూచికలను ఇక్కడ చూడవచ్చు.

ప్రభాస్ పటాన్ గుహలు

మార్చు

ప్ర్భాస్ పటాన్ వద్ద ఉన్న బౌద్ధ గుహలు వాస్తు రీత్యా సరళమైనవి. ఇక్కడ రెండే గుహలు ఉన్నాయి. సా.శ. 3-4 శతాబ్దాల నాటి బౌద్ధ విహారంలో భాగంగా వీటిని భావిస్తున్నారు. ఇవి 8.7 మీ. x 9.45 మీ. పొడవు వెడల్పులతో, 2.5 మీ. ఎత్తుతో ఉన్నాయి. గుహలకు బయట చెక్కిన గూళ్ళ వరుస తప్పించి గుహలపై ఎటువంటి అలంకరణలనూ చెక్కలేదు.

మూలాలు

మార్చు
  1. Sagar, Krishna Chandra (1992). Foreign influence on ancient India. New Delhi: Northern Book Centre. p. 150. ISBN 8172110286.
  2. Sagar, Krishna Chandra (1992). Foreign influence on ancient India. New Delhi: Northern Book Centre. p. 150. ISBN 8172110286.
  3. Tourism Corporation of Gujarat Limited. "Sana Caves". Tourism Corporation of Gujarat Limited. Archived from the original on 31 ఆగస్టు 2014. Retrieved 1 December 2013.
  4. Brancaccio, Pia (2010). The Buddhist Caves at Aurangabad: Transformations in Art and Religion. Brill Publishers. p. 63. ISBN 9004185259.
"https://te.wikipedia.org/w/index.php?title=సనా_గుహలు&oldid=3102834" నుండి వెలికితీశారు