సామర్థ్యం (భౌతిక శాస్త్రం)

భౌతిక శాస్త్ర సాంకేతిక పదం. శక్తి ప్రసరణ, వాడుక, బదిలీలను కొలిచే యూనిట్
సామర్థ్యమును లెక్కించి వ్యక్తపరచు పద్ధతులలో ఒకటి అశ్వ సామర్థ్యం, ఒక మెట్రిక్ అశ్వ సామర్థ్యం 1 సెకనులో 1 మీటరు చొప్పున 75 కిలోగ్రాములు ఎత్తగలదు.

సామర్థ్యం (Power - పవర్) అనగా భౌతిక శాస్త్రం ప్రకారం పనిచేయడం యొక్క రేటు. ఇది ప్రతి యూనిట్ సమయం ప్రకారం వినియోగించబడిన శక్తి యొక్క మొత్తం. ఇది ఎటువంటి దిశను కలిగియుండదు, ఇది ఒక అదిశా పరిమాణం. అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో పవర్ యొక్క యూనిట్ అనేది సెకనుకు జౌల్ (జౌల్ పర్ సెకండ్ - J/s), ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో ఆవిరి యంత్రము అభివృద్ధి చేసిన జేమ్స్ వాట్ గౌరవార్ధం వాట్ అని పిలువబడుతుంది.