సామీ అస్లాం

పాకిస్తానీ క్రికెటర్

సమీ అస్లాం (జననం 1995, డిసెంబరు 12) పాకిస్తానీ క్రికెటర్. మేజర్ లీగ్ క్రికెట్‌లో చేరడానికి ముందు 2015 - 2017 మధ్యకాలంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు.

సమీ అస్లాం
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సమీ అస్లాం
పుట్టిన తేదీ (1995-12-12) 1995 డిసెంబరు 12 (వయసు 28)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఓపెనింగ్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 220)2015 ఏప్రిల్ 28 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2017 అక్టోబరు 6 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 202)2015 ఏప్రిల్ 22 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2016 సెప్టెంబరు 1 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012–2020పాకీ నేషనల్ బ్యాంక్
2012–2020లాహోర్ ఈగిల్స్
2023-presentటెక్సాస్ సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 13 4 52 70
చేసిన పరుగులు 758 78 3,110 3,225
బ్యాటింగు సగటు 31.58 19.50 35.34 48.86
100లు/50లు 0/7 0/0 8/13 10/19
అత్యుత్తమ స్కోరు 91 45 221 169
వేసిన బంతులు 48 60
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 1/- 0/– 23/– 13/–
మూలం: ESPNcricinfo, 2020 డిసెంబరు 8

క్రికెట్ రంగం

మార్చు

ప్రస్తుతం అండర్-19 వన్డే చరిత్రలో 1695 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు.[1] ఆస్ట్రేలియాలో జరిగిన 2012 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొన్న పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడు.[2] యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2014 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు, పాకిస్తాన్‌ను టోర్నమెంట్‌లో ఫైనల్స్‌కు నడిపించాడు. 2014లో పీసీబీ సమ్మర్ క్యాంప్‌కు ఎంపికయ్యాడు.[3] పాకిస్తాన్ తరపున 2017 అక్టోబర్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా తన చివరి సిరీస్ ఆడాడు.

2019 మార్చిలో, 2019 పాకిస్థాన్ కప్ కోసం పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[4][5] 2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్‌కు దక్షిణ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[6][7]

యునైటెడ్ స్టేట్స్‌కు[8][9] ప్రాతినిధ్యం వహించే లక్ష్యంతో 2020 నవంబరులో, పాకిస్తాన్‌లో తన కెరీర్‌ను ముగించాడు.[10] 2023 నవంబరులో యుఎస్ఏ తరపున ఆడేందుకు అర్హత పొందుతాడు.[11] 2021 జూన్ లో, మైనర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ముందు ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో అస్లాం ఎంపికయ్యాడు.[12][13]

2023 మార్చిలో, అస్లామ్ మేజర్ లీగ్ క్రికెట్ కోసం రౌండ్ 5లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు డ్రాఫ్ట్ చేయబడ్డాడు.

మూలాలు

మార్చు
  1. "Sami Aslam profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-10-07.
  2. "Pakistan Under-19s Squad". 6 October 2016. Retrieved 2023-10-07.
  3. "Sami Aslam". ESPNcricinfo. ESPN Inc. 1 October 2016. Retrieved 2023-10-07.
  4. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. 23 March 2019. Retrieved 2023-10-07.
  5. Shah, Abdul Mohi (24 March 2019). "Pakistan Cup one-day cricket from April 2". The International News. Retrieved 2023-10-07.
  6. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. 3 September 2019. Retrieved 2023-10-07.
  7. Farooq, Umar (3 September 2019). "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-10-07.
  8. Penna, Peter Della (3 December 2020). "USA cricket stepping up foreign recruitment to live up to ODI status". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-10-07.
  9. "Sami Aslam announces 'new beginning' in California". The News International. 4 December 2020. Retrieved 2023-10-07.
  10. Farooq, Umar (19 November 2020). "Sami Aslam is considering quitting Pakistan cricket". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-10-07.
  11. "'I was in a bad place' – Sami Aslam makes startling revelations about Pakistan cricket". CricTracker. 9 May 2021. Retrieved 2023-10-07.
  12. "Pre-Draft Selections Confirmed by 21 Minor League Cricket Teams as Draft Day Looms". USA Cricket. 4 June 2021. Retrieved 2023-10-07.
  13. "All 27 Teams Complete Initial Roster Selection Following Minor League Cricket Draft". USA Cricket. 10 June 2021. Retrieved 2023-10-07.

బాహ్య లింకులు

మార్చు