సాయి పరాంజపే (జననం 19 మార్చి 1938), ప్రముఖ భరతీయ సినీ దర్శకురాలు, రచయిత. ఆమె దర్శకత్వం వహించిన స్పర్శ్, కథ, చష్మే, బద్దూర్, దిశ వంటి సినిమాలు ఎన్నో పురస్కారాలు పొందాయి. జస్వందీ, సక్ఖే షేజరీ, అల్బెల్ వంటి ఎన్నో మరాఠీ నాటకాలు రాసి, దర్శకత్వం వహించింది సాయి.

Sai Paranjpye.jpg
సాయి పరాంజపే

2006లోభారత ప్రభుత్వం, సాయికి పద్మభూషన్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.[1]

తొలినాళ్ళ జీవితం మార్చు

19 మార్చి 1938న ముంబైలో జన్మించింది. రష్యాకు చెందిన యౌరా స్లెప్ట్జాఫ్ కూ, మహారాష్ట్రకు చెందిన శకుంతలా పరాంజపేలకు పుట్టింది ఆమె.[2] రష్యన్ జనరల్ కుమారుడైన స్లెప్ట్జాఫ్ వాటర్ కలర్ చిత్రకారుడు. సాయి తల్లి శకుంతల మరాఠీ,హిందీ సినిమాల్లో నటి. 1930లు, 40ల్లో ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. 1937లో వి.శాంతారాం తీసిన క్లాసిక్  దునియా నా మానే  సినిమాలో కూడా నటించింది శకుంతల. ఆ తరువాత రచయితగా మారిన ఆమె, సామాజిక కార్యకర్తగా సేవలు చేసింది. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికైన శకుంతలకు, 1991లో పద్మభూషన్ అవార్డు ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం.[3]

సాయి పుట్టిన చాలా కొద్దిరోజుల్లోనే, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. శకుంతల తండ్రి సర్ ఆర్.పి.పరాంజపే ఇంట్లోనే పెరిగింది సాయి. ఆమె తాత ఆర్.పి.పరాంజపే ప్రముఖ గణితశాస్త్రవేత్త, విద్యావేత్త. 1944-47 మధ్యకాలంలో అతను ఆస్ట్రేలియాలో భారత హైకమీషనర్ గా పనిచేశాడు.  పూణెతో సహా భారతదేశంలోని వివిధ నగరాల్లో చదువుకుంది ఆమె. భారత్ తో పాటు ఆస్ట్రేలియాలోని కేన్ బెర్రాలో కూడా చదువుకుంది సాయి.[4]

మూలాలు మార్చు

  1. Padma Bhushan Awardees Ms. Sai Paranjpye, Arts, Maharashtra, 2006.
  2. Sai Paranjpye at ASHA Archived 17 డిసెంబరు 2007 at the Wayback Machine
  3. Shakuntala Profile Archived 2016-03-04 at the Wayback Machine History, names Pranajpye.
  4. Three Years In Australia Archived 2012-02-09 at the Wayback Machine Item: 13460, booksandcollectibles.