సారస్వత నికేతనం

ప్రకాశం జిల్లా వేటపాలెం లోని గ్రంథాలయం.

సారస్వత నికేతనం బాపట్ల జిల్లా వేటపాలెం లోని పురాతన తెలుగు గ్రంథాలయం. ఈ గ్రంథాలయము 1918 అక్టోబరు 15 నాడు ఊటుకూరి వెంకట శ్రేష్టి స్థాపించాడు. అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశాడు.[1] స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉంది.

సారస్వత నికేతనం గ్రంథాలయం
భవనం
దేశముభారతదేశం
స్థాపితము1918-10-15
చట్టపరమైన విధికి సూచనలుసొసైటీల నమోదు చట్టం, 1920
ప్రదేశమువేటపాలెం, ఆంధ్రప్రదేశ్
భౌగోళికాంశాలు15°47′00″N 80°18′22″E / 15.783278°N 80.306111°E / 15.783278; 80.306111
గ్రంధ సంగ్రహం / సేకరణ
గ్రంధాల సంఖ్య1 లక్ష
ఇతర విషయాలు
సిబ్బంది / ఉద్యోగులు;10
వెబ్‌సైటుhttp://www.saraswataniketanam.in
సారస్వత నికేతనం, వేటపాలెం కరపత్రం తొలిపేజీ

చరిత్ర మార్చు

1918 అక్టోబరు 15 నాడు ఊటుకూరి వెంకట శ్రేష్టి స్థాపించిన ఈ గ్రంథాలయమునకు గాంధేయుడు గోరంట్ల వెంకన్న మొదటి దశలో భూరి విరాళము ఇచ్చాడు. దీని కొత్త భవనానికి 1929 లో మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించాడు. దీని భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ ఉంది. కొన్ని వార్తాపత్రికలు 1909 వ సంవత్సరమునుండి ఉన్నాయి. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బసచేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు.

గ్రంథాలయం అభివృద్ధిలో కొన్ని ముఖ్య ఘట్టాలు మార్చు

 • 1918 అక్టోబరు 15 నాడు ఊ.వెం. శ్రేష్ఠి F.A.R.U., హిందూ యువజన సంఘం గ్రంథాలయాన్ని స్థాపించాడు
 • 1924 ఒక పెంకుటిల్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రంథాలయాన్ని తరువాత 'సారస్వత నికేతనం' అని నామకరణం చేశారు. ఈ భవనాన్ని జమ్నాలాల్ బజాజ్ చే ప్రారంభించబడింది.
 • 1927 లో ఈ గ్రంథాలయం, 1927 సొసైటీ చట్టం క్రింద రిజిస్టరు కాబడింది.
 • 1929 క్రొత్త భవంతికి శంకుస్థాపన, మహాత్మా గాంధీ, చేసాడు. తరువాత ఈ భవంతిని ప్రకాశం పంతులు ప్రారంభించాడు.
 • 1930 ఈ గ్రంథాలయం, జిల్లా కేంద్ర గ్రంథాలయంగా గుర్తింపు పొందినది.
 • 1935 బాబూ రాజేంద్ర ప్రసాద్, గ్రంథాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని శంకుస్థాపన చేశాడు. ఇదో జ్ఞానమందిరంగా అభివర్ణింపబడింది.
 • 1936 గాంధీగారు రెండో సారి విచ్చేశాడు.
 • 1942 గుంటూరు జిల్లా గ్రంథాలయాల సభ జరిగింది.
 • 1943 అంతర్జాతీయ సహకార ఉద్యమం.
 • 1949 6వ దక్షిణ భారత యువత విద్యా సదస్సు జరిగింది.
 • 1950 జర్నలిజం కొరకు తరగతులు, వావిలాల గోపాలకృష్ణ ప్రధానాచార్యులుగా వ్యవహరించి, జరిపించారు.
 • 1985 RRLF, కలకత్తా వారిచే ఇవ్వబడిన మ్యాచింగ్-గ్రాంటు సహాయంతో, క్రొత్త వింగ్ ను ఏర్పాటు గావించారు.
 • 2018 వందేళ్ల పండుగ సందర్భంగా గ్రంథాలయ భవనం చిత్రంలో పోస్టల్‌ కవర్‌ విడుదల.[2]

భౌగోళికము మార్చు

చీరాల నుండి 8 కి.మీ దూరంలో వేటపాలెంలో వున్నది. (OSM పటం చూడండి)

 
సారస్వత నికేతనం

అపురూపమైన పుస్తకాలు మార్చు

సారస్వత నికేతనంలో ఎన్నో అపురూపమైన, అత్యంత అరుదైన పుస్తకాలు ఉండటం వలన తెలుగు సాహిత్య చరిత్రలో, చరిత్రరచనకు ఉపయోగం. తెలుగులో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర గ్రంథాన్ని 1940 ప్రాంతాల్లో మూడవసంకలనం కూర్పుచేసి పునర్ముద్రించేందుకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, పుస్తకప్రియుడు దిగవల్లి వేంకటశివరావు ప్రయత్నించగా వేటపాలెం గ్రంథాలయంలోనే మంచి ప్రతి దొరికి పునర్ముద్రణ సాధ్యమైంది.[3]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

 1. "జాతీయోద్యమ జ్ఞానపుంజం!". m.andhrajyothy.com. Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-22.
 2. "వందేళ్ల గ్రంథాలయం!". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2019-11-05.
 3. వీరాస్వామయ్య, యేనుగుల (1941). "  పీఠిక#saraswata".   కాశీయాత్ర చరిత్ర (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. వికీసోర్స్. 

బయటి లింకులు మార్చు