సారాలంకారం
సారాలంకారం తెలుగు భాషలో ఒక అలంకారము.
- లక్షణం
- పూర్వపూర్వముల కంటే ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటే తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
- ఉదాహరణ
- రాజ్యములో భూమి గొప్పది. భూమిలో కూడా పట్టణం గొప్పది. పట్టణంలోనూ భవనం గొప్పది. భవనంలో శయ్య గొప్పది. శయ్యమీద సర్వాంగ శోభిత అయిన జవరాలు గొప్పది.
- వివరణ
- ముందు భూమి గొప్పదని, దానికంటె పట్టణం, పట్టణం కంటే భవనం, భవనం కంటే శయ్య, శయ్య కంటే జవరాలు గొప్పదని - ఇలా ముందున్న వాటి కంటే తరువాతి వాటికి గొప్పతనం చెప్పడం వల్ల ఇది సారాలంకారం.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |