దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి
దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి టూకీగా సార్క్ (SAARC-South Asian Association for Regional Cooperation).
సార్క్ 8 డిసెంబర్ 1985 న ka ాకాలో స్థాపించబడింది. దీని సచివాలయం నేపాల్ లోని ఖాట్మండులో ఉంది. సంస్థ ఆర్థిక, ప్రాంతీయ సమైక్యత అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది 2006 లో దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని ప్రారంభించింది. సార్క్ ఐక్యరాజ్యసమితిలో పరిశీలకుడిగా శాశ్వత దౌత్య సంబంధాలను కొనసాగిస్తుంది, యూరోపియన్ యూనియన్‌తో సహా బహుళపక్ష సంస్థలతో సంబంధాలను అభివృద్ధి చేసింది.
చరిత్ర
మార్చు1970 సంవత్సరము చివరలో, అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియౌర్ రెహ్మాన్ దక్షిణాసియా దేశాలతో కూడిన వాణిజ్య కూటమిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఈ విషయం అతను దక్షిణ ఆసియా దేశాల ప్రభుత్వాల అధిపతులతో తెలియ చేశాడు.1981 లో కొలంబోలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు అంగీకరించాయి.1983 ఆగస్టులో, న్యూఢిల్లీ లో జరిగిన సమావేశంలో నాయకులు దక్షిణాసియా ప్రాంతీయ సహకారంపై ఒక ప్రకటనను చేసాయి. [1]
దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)1985 డిసెంబర్, 7-8 తేది ల లో స్థాపించబడింది . దీని ప్రధాన కార్యాలయం నేపాల్ లోని ఖాట్మండులో ఉంది . దీని స్థాపనలో ఉద్దేశ్యం, దక్షిణాసియాలోని దేశాలు వారి సామూహిక స్వావలంబనకు ఆర్థిక, సాంకేతిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిని చేసుకోవడం . దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలలో ఏడుగురు వ్యవస్థాపక సభ్యులు బంగ్లాదేశ్, భూటాన్, భారత్ , మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ , శ్రీలంక. 2007 లో ఆఫ్ఘనిస్తాన్ ఈ సంస్థలో చేరింది. దేశాధినేతల సమావేశాలు సాధారణంగా ప్రతి సంవత్సరం ఖరారు చేయబడతాయి, ఈ దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాలు సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి. ఈ దేశాల సహకారం మొత్తం 11 రంగాలలో వ్యవసాయం, విద్య, సంస్కృతి, క్రీడలు; ఆరోగ్యం, జనాభా, పిల్లల సంక్షేమం, పర్యావరణం, వాతావరణ పరిరక్షణ , గ్రామీణాభివృద్ధి , పర్యాటక, రవాణా, శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం, మహిళల సంక్షేమం , అభివృద్హి , మాదక ద్రవ్యాల రవాణా నివారణ. నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉండాలని, "ద్వైపాక్షిక, వివాదాస్పద సమస్యలు" నివారించాలని పేర్కొన్నవి[2] [3]
పరిశీలకులు
మార్చుదక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) కు ప్రస్తుతం తొమ్మిది మంది దేశాల పరిశీలకులు గా ఉన్నాయి అవి: (i) ఆస్ట్రేలియా; (ii) చైనా; (iii) యూరోపియన్ యూనియన్; (iv) ఇరాన్; (v) జపాన్; (vi) కొరియా రిపబ్లిక్; (vii) మారిషస్; (viii) మయన్మార్మ (ix) అమెరికా. [4]
సభ్యదేశాలు
మార్చుపై ఏడు దేశాలు సభ్యులుగా 1985december8 'సార్క్'ఏర్పడింది తదుపరి 2007లో అఫ్‌ఘనీస్తాన్ 8వ దేశంగా చేరింది. నందగోపాల్ రాయల
మూలాలు
మార్చు- ↑ "A Research Guide on the South Asian Association for Regional Cooperation (SAARC)". www.nyulawglobal.org. Archived from the original on 14 మార్చి 2021. Retrieved 8 February 2021.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "South Asian Association for Regional Co-operation | Asian organization". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
- ↑ "SAARC". www.southasiafoundation.org. Archived from the original on 2018-10-29.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ https://en.wikipedia.org/wiki/South_Asian_Association_for_Regional_Cooperation. వికీసోర్స్.