సాహస సింహం
సాహస సింహం 1984, డిసెంబరు 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. విగ్నేశ్వర సినీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.వి. సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో ఎన్. దామోధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, కాంచన, ఆర్.ఎన్.సుదర్శన్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]
సాహస సింహం | |
---|---|
![]() సాహస సింహం సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఎన్. దామోధరన్ |
రచన | గోపి (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఎం. శాంతి నారాయణ్ |
కథ | అబర్ణ నాయుడు |
నిర్మాత | ఎస్.వి. సుబ్బారావు |
తారాగణం | కమల్ హాసన్ శ్రీప్రియ కాంచన ఆర్.ఎన్.సుదర్శన్ సత్యరాజ్ |
కూర్పు | నరసింహారావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విగ్నేశ్వర సినీ ఆర్ట్స్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 1984 డిసెంబరు 1 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథసవరించు
ఈ చిత్రం జర్నలిస్ట్, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడైన ఆనంద్ (కమల్ హాసన్) కథ. ఆనంద్ శ్రీప్రియతో ప్రేమలో ఉన్నాడు. పాతాళ రాజు సుదర్శన్ చేసిన నేరాలకు సంబంధించిన వీడియో ఆనంద్ కు దొరుకుతుంది. ఈ వీడియో కోసం ఒక ముఠా ఆనంద్ వెంట పడుతుంది. దాన్ని సంపాదించడానికి సుదర్శన్ ముఠాకు చెందిన సత్యప్రియ అనే వ్యక్తి ఆనంద్‌తో స్నేహం చేస్తాడు. కాని అతని పన్నాగం ఫలించదు. ఇంతలో, ఆనంద్ ప్రేమకోసం శ్రీప్రియ తన తండ్రి మేజర్ సుందర్రాజన్ తో గొడవపడి ఆమె ఇంటినుండి బయటికి వచ్చేస్తుంది. వీడియో కోసం శ్రీప్రియను సుదర్శన్ ముఠా బెదిరిస్తుంది. ఆనంద్ స్నేహితుడు వై.జి.మహేంద్రన్ కూడా అండర్‌వరల్డ్ ముఠా చేతిలో చిక్కుకుంటాడు. ఆనంద్ తన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ సుందర్సన్ పై కూడా పోరాడవలసి వస్తుంది. చివరికి, ఆనంద్ ఆ ముఠాను అడ్డుతొలగించి, వీడియోను కాపాడుతాడు.
తారాగణంసవరించు
- కమల్ హాసన్
- శ్రీప్రియ
- కాంచన[3]
- ఆర్.ఎన్.సుదర్శన్[4][5]
- సత్యరాజ్
- మేజర్ సుందరరాజన్
- వై.జి.మహేంద్రన్
- సత్యప్రియ
- టి.కె.ఎస్. నటరాజన్
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: ఎన్. దామోధరన్
- నిర్మాత: ఎస్.వి. సుబ్బారావు
- మాటలు, పాటలు: గోపి
- చిత్రానువాదం: ఎం. శాంతి నారాయణ్
- కథ: అబర్ణ నాయుడు
- సంగీతం: కె. చక్రవర్తి
- కూర్పు: నరసింహారావు
- నిర్మాణ సంస్థ: విగ్నేశ్వర సినీ ఆర్ట్స్ క్రియేషన్స్
ఇతర వివరాలుసవరించు
- సత్యరాజ్ కొద్ది నిమిషాలు సుదర్శన్ కు చెందిన ముఠా సభ్యుడిగా కనిపిస్తాడు.
- ఇందులో అన్ని యాక్షన్ సన్నివేశాలు కరాటే నేపథ్యంలో ఉన్నాయి. కమల్ హాసన్ ఆ యాక్షన్ సన్నివేశాలలో మెప్పించాడు..
మూలాలుసవరించు
- ↑ "Sahasa Simham (1984)". Indiancine.ma. Retrieved 2020-08-27.
- ↑ "Pagadai Panirendu LP Vinyl Records". Retrieved 2020-08-27.
- ↑ "A Movie on Kanchana". UDHAYAM (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-04-25. Retrieved 2020-08-27.
- ↑ Khajane, Muralidhara (14 September 2017). "Committed to acting". The Hindu. Retrieved 2020-08-27.
- ↑ "R N Sudarshan no more, RNR Family Last". Indiaglitz.com. Retrieved 2020-08-27.