వై.జి.మహేంద్రన్

భారతీయ సినిమా నటుడు

వై.జి.మహేంద్రన్ ఒక భారతీయ సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా తమిళ సినిమాలలో హాస్యపాత్రలలో నటించాడు. ఇతడు నటుడే కాకుండా నాటక రచయిత, ప్రయోక్త, గాయకుడు. ఇతడు అనేక తమిళ నాటకాలను ప్రదర్శించాడు. ఇతని తండ్రి వై.జి.పార్థసారథి ఆధునిక తమిళ నాటకరంగ మార్గదర్శులలో ఒకడు. తల్లి రాజలక్ష్మి పార్థసారథి పద్మ శేషాద్రి బాల భవన్ వ్యవస్థాపకురాలు. ఇతని మేనమామ కె.బాలాజీ తమిళ సినిమా నిర్మాత. నటి వైజయంతిమాల[1], నటులు రజనీకాంత్, మోహన్ లాల్‌లు ఇతని బంధువులు.

వై.జి.మహేంద్రన్
జననం
యెచ్చ గుంజ పార్థసారథి మహేంద్రన్

(1950-01-09) 1950 జనవరి 9 (వయసు 74)
అమీంజికారై, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • నాటక ప్రయోక్త
  • నటుడు
  • గాయకుడు
  • నాటక రచయిత
క్రియాశీల సంవత్సరాలు1970–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుధా మహేంద్ర (m. 1975–ప్రస్తుతం)
పిల్లలు
  • మధువంతి అరుణ్
  • హర్షవర్ధన్
తల్లిదండ్రులు
బంధువులు

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు వై.జి.పార్థసారథి, రాజలక్ష్మి దంపతులకు 1950, జనవరి 9న జన్మించాడు.[2][3] ఇతని తండ్రి వై.జి.పార్థసారథి 1952లో మద్రాసులోని తొలి నాటకసమాజాలలో ఒకటైన యునైటెడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ (UAA) అనే నాటక కంపెనీని స్థాపించాడు.[4] ఆ నాటక సమాజం ఆ కాలంలోని ఉత్తమ నాటక కళాకారులతో అనేక తమిళ నాటకాలను ప్రదర్శించింది. ఇతని తల్లి రాజలక్ష్మి పార్థసారథి నుంగంబాక్కంలోని తన ఇంటి టెర్రస్ లో ఉన్న షెడ్లో నుంగంబాక్కం లేడీస్ రిక్రియేషన్ క్లబ్ సభ్యులతో కలిసి రాజలక్ష్మి 13 మంది విద్యార్థులతో పద్మ శేషాద్రి బాలభవన్ అనే పాఠశాలను ప్రారంభించి భారతదేశంలోని ఉత్తమపాఠశాలలో ఒకటిగా దానిని తీర్చిదిద్దింది. నాటకరంగం పట్ల అభిమానం ఉన్న కుటుంబంలో జన్మించిన మహేంద్రన్‌కు బాల్యంలోనే నాటకాల పట్ల అభిరుచి కలిగింది. తన పాఠశాల నాటకాలలో హాస్యపాత్రలు ధరించి బహుమతులు గెలుచుకున్నాడు. ఇతడు ఎగ్మోర్‌లోని డాన్ బాస్కో స్కూలులో చదివిన తరువాత గిండీలోని అలగప్ప కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. తరువాత ఎం.బి.ఎ. పూర్తి చేశాడు.[5] ఇతడు కళాశాల చదివే సమయంలోనే తన తండ్రి డ్రామా ట్రూపు (యునైటెడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్) నాటకాలలో నటించి వేలాది ప్రేక్షకుల మన్ననను సంపాదించాడు. కొద్ది రోజులలోనే మహేంద్ర పేరు మద్రాసు నాటకరంగంలో మారుమ్రోగింది. దీనితో ఇతడు నటననే వృత్తిగా స్వీకరించాడు.

ఇతని కుమార్తె మధువంతి జెమినీ గణేశన్, సావిత్రిల మనుమడు వి.అరుణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది.

వృత్తి

మార్చు

ఇతడు 1971లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన నవగ్రహం అనే తమిళ సినిమాద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. అది మొదలు ఇతడు అనేక సినిమాలలో అనేక పాత్రలను ధరించాడు. ఇతడు నాలుగు దశాబ్దాలుగా శివాజీ గణేశన్, జైశంకర్, కమల్ హాసన్, రజనీకాంత్ మొదలైన నటుల సరసన సహాయ పాత్రలలో నటించాడు. ఇతడు సినిమాలలో నటించడమే కాకుండా కొన్ని టెలివిజన్ సీరియళ్ళలో, వెబ్ సీరీస్‌లలో, స్టేజి నాటకాలలో నటించాడు. 1987లో కథై కథయం కారణమం అనే తమిళ సినిమాకి దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్, బాబూమోహన్ వంటి నటులకు తమిళసినిమాలలో డబ్బింగ్ చెప్పాడు.

నటించిన సినిమాల పాక్షికజాబితా

మార్చు
విడుదల సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష విశేషాలు
1970 నవగ్రహం అనుమంతు తమిళం మొదటి సినిమా
1974 గౌరవం శివాజీ గణేశన్ డ్రైవర్ తెలుగు గౌరవం తమిళ సినిమా డబ్బింగ్
1974 దీర్ఘ సుమంగళి తమిళం ఇదే పేరుతో తెలుగులో పునర్మించబడింది.
1974 దిక్కట్ర పార్వతి తమిళం
1975 అన్బే ఆరుయిరె తమిళం గృహలక్ష్మి రీమేక్
1975 అపూర్వ రాగంగళ్ తమిళం
1976 మన్మథ లీల తెలుగు మన్మథ లీలై తమిళ సినిమా డబ్బింగ్
1979 అమ్మ ఎవరికైనా అమ్మ తెలుగు అన్నై ఒరు ఆలయం తమిళ సినిమా డబ్బింగ్
1980 గురు తెలుగు గురు తమిళ సినిమా డబ్బింగ్
1980 పాటగాడు డ్రామా ఆర్టిస్ట్ తెలుగు తాయిల్లమాల్ నాన్ ఇల్లై తమిళ సినిమా డబ్బింగ్
1980 కళ్యాణ జ్యోతి తెలుగు ఇదియ మాలర్ తమిళ సినిమా డబ్బింగ్
1981 అమావాస్య చంద్రుడు చంటి తెలుగు
1982 చిలిపి చిన్నోడు తెలుగు ఎల్లన్ ఇంబా మయ్యం తమిళ సినిమా డబ్బింగ్
1982 పోకిరి రాజా తమిళం చుట్టాలున్నారు జాగ్రత్తకు రీమేక్
1982 వసంత కోకిల తెలుగు మూండ్రాం పిరై తమిళ సినిమా డబ్బింగ్
1982 రాణి తేని తమిళం కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాకు రీమేక్
1982 పల్లెటూరి సింహం తెలుగు సకల కళా వల్లవన్ తమిళ సినిమా డబ్బింగ్
1983 చట్టం తెలుగు సట్టం తమిళ సినిమా డబ్బింగ్
1983 పెంకిఘటం తెలుగు ఇనియవలే వా తమిళ సినిమా డబ్బింగ్
1983 స్నేహాభిషేకం వాసు తెలుగు సిమ్లా స్పెషల్ తమిళ సినిమా డబ్బింగ్
1983 ఊమక్కుయిల్ మలయాళం
1983 నీతిబతి తమిళం జస్టిస్ చౌదరికి రీమేక్
1984 రౌడీలకు సవాల్ తెలుగు తడిక్కుం కరంగళ్ తమిళ సినిమా డబ్బింగ్
1984 సాహస సింహం తెలుగు పగడై పనిరెండు తమిళ సినిమా డబ్బింగ్
1984 వెట్రి తమిళం దేవాంతకుడు పేరుతో తెలుగులో రీమేక్ చేయబడింది.
1984 నల్లవనుక్కు నల్లవన్ తమిళం ధర్మాత్ముడుకు రీమేక్
1985 పచ్చని కాపురం తెలుగు
1985 సూర్యచంద్ర కబీర్ తెలుగు
1986 నాన్ అడిమై ఇల్లై తమిళం పచ్చని కాపురం రీమేక్
1986 జల్సా బుల్లోడు తెలుగు ఉయర్న్దా ఉల్లం తమిళ సినిమా డబ్బింగ్
1986 ధర్మదేవతై తమిళం ప్రతిఘటన రీమేక్
1987 శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం తెలుగు శ్రీ రాఘవేంద్రర్ తమిళ సినిమా డబ్బింగ్
1987 అమెరికా అబ్బాయి తెలుగు
1987 చిన్నారి దేవత తెలుగు
1987 అత్తగారు జిందాబాద్ తెలుగు
1987 ఆనంద్ తమిళం మజ్ను రీమేక్
1987 కథై కథయం కారణమం తమిళం వై.జి.మహేంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా
1988 వేగుచుక్క పగటిచుక్క తెలుగు
1989 అజాతశత్రువు చంటిబాబు తెలుగు
1990 లేడీ టార్జాన్ హిందీ టార్జాన్ సుందరి తెలుగు సినిమా డబ్బింగ్
1993 జీవనవేదం తెలుగు
1993 ముకాబ్‌లా పోలీస్ కానిస్టేబుల్ సాజన్ హిందీ పోలీస్ బ్రదర్స్ రీమేక్
1994 వీరా తమిళం అల్లరి మొగుడు సినిమా రీమేక్
1996 మైనర్ మప్పిల్లై సినిమా దర్శకుడు తమిళం పరువు ప్రతిష్ట రీమేక్
2000 హే రామ్ తమిళం
2004 కొదమ సింహాలు తెలుగు నీన్‌గళ్ కెట్టవై తమిళ సినిమా డబ్బింగ్
2009 మల్లన్న తెలుగు కందస్వామి తమిళ సినిమా డబ్బింగ్
2013 వర్ణ తెలుగు ఇరందాం ఉలగం తమిళ సినిమా డబ్బింగ్
2014 రామానుజన్ ఎస్.నారాయణ అయ్యర్ ఇంగ్లీష్/తమిళం
2016 కణితన్ తమిళం అర్జున్ సురవరం పేరుతో రీమేక్ చేయబడింది.
2017 జాగో తెలుగు వేలైక్కారన్ తమిళ సినిమా డబ్బింగ్
2019 గజేంద్రుడు తెలుగు కదంబన్ తమిళ సినిమా డబ్బింగ్
2020 శ్యామరాగం రామనాథ భాగవతార్ మలయాళం

మూలాలు

మార్చు
  1. "You and Sivaji made a great jodi". The Hindu. 20 September 2004. Archived from the original on 10 April 2005. Retrieved 8 December 2010.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  2. Profile of Y. Gee. Mahendra at Nilacharal.com
  3. A short autobiography of Y Gee M on his official website Archived 9 మే 2008 at the Wayback Machine
  4. History of UAA Archived 9 మే 2008 at the Wayback Machine
  5. His educational qualifications at ygeem.com[permanent dead link]

బయటి లింకులు

మార్చు