సింగరి శంకరయ్య భారత స్వాతంత్ర్యసమరయోధుడు.

హైరతాబాదు గణేశ్ ఉత్సవ రూపకర్త మార్చు

అతను ఒకప్పటి ఖైరతాబాదు కౌన్సిలర్. వీరు ఖైరతాబాదు గణేశ్ ఉత్సవాలకి రూపకర్త. 1954వ సంవత్సరంలో వీరు ఖైరతాబాదు ఉత్సవాలను ప్రారంభించారు.[1][2] స్వాతంత్ర్య పోరాట సమయంలో బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఖైరతాబాద్‌లో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. శంకరయ్య తదనంతరం అతను సోదరుడు సుదర్శన్ ఆ బాధ్యతలను తలకెత్తుకొని అతను కొడుకు సింగరి రాజ్‌కుమార్‌తో కలిసి ఉత్సవాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.[3] 1954 సెప్టెంబరు 8న మొట్టమొదటిగా ఒక చిన్న మండపాన్ని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు. కేవలం వంద రూపాయలలోపు ఖర్చుతోనే ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రతి ఏడాదీ ఒక అడుగు వంతున విగ్రహం ఎత్తును పెంచాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.[4]

అతను 1994లో మరణించాడు.[5]

మూలాలు మార్చు

  1. "about s.sankarayya in ganapathideva-khairathabad". Archived from the original on 2016-08-30. Retrieved 2016-09-10.
  2. ఖైరతాబాద్ గణపతికి 62ఏళ్లు:
  3. త్రిశక్తిమయ మోక్ష గణపతి
  4. ఈ వినాయకుడు 60 అడుగులు పెరిగాడు…[permanent dead link]
  5. భక్తుల సాయంతోనే ఉత్సవాలు 07-09-2014[permanent dead link]