సింగరి సంజీవ్ కుమార్

(సింగరి సంజీవ్‌ కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)

సింగరి సంజీవ్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు. [1]

సింగరి సంజీవ్‌ కుమార్‌

పార్లమెంట్ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం
ముందు బుట్టా రేణుక

వ్యక్తిగత వివరాలు

జననం 03 జనవరి 1967
కర్నూలు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సింగరి శ్రీరంగం, రంగమ్మ
జీవిత భాగస్వామి వసుంధర
సంతానం సౌమ్య, అక్షయ్, అభిరామ్‌
వృత్తి వైద్యుడు, రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

సింగరి సంజీవ్‌ కుమార్‌ 03 జనవరి 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కర్నూలులో సింగరి శ్రీరంగం, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1990లో కర్నూలు మెడికల్‌ కాలేజీ నుండి ఎంబీబీఎస్, 1995లో ఎంఎస్‌ (జనరల్‌ సర్జరీ), 2000లో హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంసీహెచ్‌ (యూరాలజీ) పూర్తి చేశాడు. ఆయన కర్నూలులో ఆయుస్మాన్‌ హాస్పిటల్‌ను నిర్వహిస్తూ కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని ఉచిత వైద్య శిబిరాలను, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.

రాజకీయ జీవితం మార్చు

సింగరి సంజీవ్‌ కుమార్‌ 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనను వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థిగా 16 మార్చి 2019న పార్టీ ప్రకటించింది.[2] ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పై 148889 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు.[3]

2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంకు వైసీపీ ఎంపీ టికెట్‌ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న డా.సంజీవ్‌కుమార్‌ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశాడు.[4]

మూలాలు మార్చు

  1. Lok Sabha (2019). "Members : Lok Sabha". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  2. Sakshi (17 March 2019). "బీసీలకు మరోసారి అవకాశం". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  3. Sakshi (2019). "AP Lok Sabha Election Results 2019 | Andhra Pradesh MP Election Results and Winners List". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  4. Eenadu (10 January 2024). "వైకాపాకు గుడ్‌బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.