సింగ్‌షోర్ వంతెన, పెల్లింగ్
సింగ్‌షోర్ వంతెన భారతదేశం, సిక్కింలోని పెల్లింగ్‌లో ఉన్న వేలాడే వంతెన.[1] ఇది ఆసియాలోనే రెండవ ఎత్తైన వేలాడే వంతెన.[2]
సింగ్‌షోర్ వంతెన | |
---|---|
నిర్దేశాంకాలు | 27°15′42″N 88°06′42″E / 27.26154°N 88.11167°E |
OS grid reference | [1] |
స్థలం | పెల్లింగ్, పశ్చిమ సిక్కిం జిల్లా, సిక్కిం, భారతదేశం |
లక్షణాలు | |
డిజైను | వేలాడే వంతెన |
మొత్తం పొడవు | 240 మీ (787 అడుగులు) |
ఎత్తు | 100 మీ (328 అడుగులు) |
ప్రదేశం | |
వివరణ
మార్చుఈ వంతెన 240 మీ (787 అడుగులు) పొడవు ఉంటుంది. ఇది 100 మీ (328 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తులో ఉంది, ఇది సిక్కింలోనే ఎత్తైన వంతెన.[3] [4] [5] [6] ఇది 2000 సంవత్సరం ప్రారంభంలో నిర్మించబడింది,[5][7] ఇది కేవలం ఇనుము, కాంక్రీటుతో నిర్మించబడింది. పచ్చని కొండలు, లోయల మధ్య ఏర్పాటు చేయబడిన ఈ వంతెన డెంటమ్, ఉత్తరే అనే రెండు గ్రామాలను కలుపుతుంది.[5] [7]ఈ వంతెనను రెండు కనుమల మధ్య దూరాన్ని తగ్గించాడనికి నిర్మించారు.[8]
స్థానం
మార్చుసింగ్షోర్ వంతెన, సిక్కింలోని పెల్లింగ్ నుండి 5 కిమీ (3.1 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది ఉత్తరే గ్రామం నుండి దాదాపు 20 కి.మీ (12.4 మైళ్ళు) దూరంలో ఉంది.[5] వంతెన నుండి చాలా దూరంలో అల్పైన్ చీజ్ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ గౌడ జున్నును తయారుచేస్తారు. [6]
రవాణా
మార్చుసమీప రైల్వే స్టేషన్ అయిన న్యూ జల్పైగురి జంక్షన్ రైల్వే స్టేషన్, సిలిగురిలోని బాగ్డోగ్రా విమానాశ్రయం నుండి ట్యాక్సీ లేదా బస్సులో ఇక్కడికి చేరుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ Chowdhary, Charu. "What to See And do When in Sikkim | India.com". www.india.com. Retrieved 2022-05-11.
- ↑ "Singshore Bridge Pelling". www.tourmyindia.com. Retrieved 2023-07-03.
- ↑ "Singshore Bridge Pelling". www.tourmyindia.com. Retrieved 2022-05-11.
- ↑ David, Priti (2017-11-17). "A walk in the wilderness". mint. Retrieved 2022-05-11.
- ↑ 5.0 5.1 5.2 5.3 "Did You Know Asia's Second-Highest Bridge, With An Altitude Of 328-Feet, Was In India?". IndiaTimes. 2016-05-27. Retrieved 2022-05-11.
- ↑ 6.0 6.1 "Incredible India | Singshore Bridge". www.incredibleindia.org. Retrieved 2022-05-11.
- ↑ 7.0 7.1 "Singshore Bridge Pelling". 1001 Things About North Bengal, North East India & Bhutan. 2019-04-05. Retrieved 2022-05-11.
- ↑ "Singshore Bridge, Pelling - Best time to visit". Trawell.in. Retrieved 2022-05-11.