సింహాద్రి అప్పన్న సేవ
విశాఖ పట్టణానికి అతి సమీపంలో వున్న పుణ్య క్షేత్రం సింహాచలం. సింహాచల క్షేత్రంలో ప్రసిద్ధమైన వరాహ నరసింహ స్వామి దేవాలయం ఉంది. దీనినే సింహాద్రి అప్పన్న కొండ అంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి మొదలైన జిల్లాల ప్రజలకూ అటు ఒడిషా ప్రజలకూ ఆరాధ్య పుణ్యక్షేత్రం సింహాచలం. దేవుడికి పూజ చేయటమే సేవ, సింహాచల క్షేత్రానికి మ్రొక్కు బడులు చెల్లించ టానికి వచ్చే ప్రజలు ఆచరించేదే సింహాద్రి అప్పన్న సేవ.
- సింహాద్రి అప్పన్న సేవ
వరాహ నరసింహ స్వామిని కీర్తిస్తూ కథకుడు నల్లని వెండి పొన్నుల కర్రను చేతిలో ధరించి మరో చేతిలో నెమలి ఈకల కుంచెను పట్టుకొని కథను చెపుతూ వుండగా తనకు వంతగా వున్న భక్తులందరూ పెద్ద పెద్ద తాళాలను చేత పడతారు. అందరూ జరీ అంచుగల తలపాగలను ధరిస్తారు. బృందంలోని మరి కొందరు నూనె గుడ్డలను చుట్టిన కోలలను వెలిగించి పట్టుకుంటారు. ఈ కోలల వెలుగులో పెద్ద తాళాలను మ్రోగిస్తూ బృందం వలయాకారంగా తిరుగుతారు. ప్రధాన కథకుడు చరణం పాడితే, వారి దానిని వంతగా అనుసరిస్తారు. ఇది బృంద గానం, హరిహరి నారాయణా ఆది నారాయణా అనే పల్లవిని ప్రారంభిస్తారు.
-
నడకదారిలో మెట్లు
-
పల్లకి
-
పంచాయతన శివుడు దేవాలయం
-
పుష్కరణి
-
సింహాచలం పుణ్యక్షేత్రం
సూచికలు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ప్రచురించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు