సికిందరాబాద్ ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ – లోకమాన్య తిలక్ టెర్మినస్ దురంతో ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్, లోకమాన్య తిలక్ టెర్మినస్ ల మధ్య నడిచే దురంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. [1]
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్, దురంతో ఎక్స్‌ప్రెస్ |
తొలి సేవ | 2011 ఫిబ్రవరి 23 |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే |
మార్గం | |
మొదలు | సికింద్రాబాద్ జంక్షన్ |
ఆగే స్టేషనులు | 7 (2 passenger stops, 5 technical stops) |
గమ్యం | లోకమాన్య తిలక్ టర్మినస్ |
ప్రయాణ దూరం | 772 కి.మీ. (480 మై.) |
సగటు ప్రయాణ సమయం | 12 గంటలు |
రైలు నడిచే విధం | వారానిల్కి 2 రోజులు. 12220 Secunderabad–Lokmanya Tilak Terminus Duronto Express – Tuesday & Friday. 12219 Lokmanya Tilak Terminus–Secunderabad Duronto Express – Wednesday & Saturday. |
రైలు సంఖ్య(లు) | 12220 Up, 12219 Down |
సదుపాయాలు | |
శ్రేణులు | AC 1st Class, AC 2 tier, AC 3 tier[ఆధారం చూపాలి] |
కూర్చునేందుకు సదుపాయాలు | No |
పడుకునేందుకు సదుపాయాలు | Yes |
ఆహార సదుపాయాలు | Pantry car attached |
చూడదగ్గ సదుపాయాలు | LHB coaches |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | ప్రామాణిక దురంతో బోగీలు |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 110 km/h (68 mph) (Maximum Speed), 64.37376 km/h (40 mph) (Average speed), including halts |
ఈ సేవను దక్షిణ మధ్య రైల్వే జోన్ నడుపుతోంది. రైలు నంబర్లు 12220 (సికింద్రాబాద్-ముంబై (LTT)) 12219 (ముంబయి (LTT)-సికింద్రాబాద్) కలిగిన ఈ రైలు తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతుంది.
సేవ
మార్చు12220/19 సికింద్రాబాద్-ముంబై (LTT) దురంతో ఎక్స్‌ప్రెస్ 773 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల్లో కవర్ చేస్తుంది. (64.42 కిమీ./గం వేగంతో). ఎక్స్‌ప్రెస్ రైలు సగటు వేగం 55 km/h (34 mph) కంటే ఎక్కువగా ఉన్నందున భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం అదనపు సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్‌ని వసూలు చేస్తారు.
ఈ రైలులో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. దీనిలో సాధారణంగా 1 AC 1వ తరగతి కోచ్, 3 AC 2-టైర్ కోచ్‌లు, 9 AC 3-టైర్ కోచ్‌లు ఉంటాయి. ఇరువైపులా జనరేటర్ కోచ్‌లు, క్యాటరింగ్ సేవల కోసం ఒక ప్యాంట్రీ కారు ఉంటాయి.
ప్రమాదాలు
మార్చు- 2014 మే 4 న, 12220 సికింద్రాబాద్-లోకమాన్య తిలక్ టెర్మినస్ దురంతో ఎక్స్‌ప్రెస్ పూణే జంక్షన్ సమీపంలో ఒక ట్రాక్టర్ ట్రయిలర్‌ను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. [2]
- 2015 సెప్టెంబరు 12 న, 12220 సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్ ఉదయం 2:15 గంటలకు కర్ణాటకలోని షోలాపూర్ డివిజన్‌లోని షాబాద్, గుల్బర్గాల మధ్య మార్టూరు స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
మూలాలు
మార్చు- ↑ "New Bi-weekly Duranto Express to Mumbai from Feb 22". Retrieved 2014-08-01.
- ↑ "3 killed, 8 hurt as Duronto hits tractor near Pune". DNA India. 4 May 2014. Retrieved 2014-08-01.