సిక్కిం ప్రభుత్వం
భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం
సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం, సిక్కిం రాష్ట్ర 6 జిల్లాల పరిపాలనా కార్యనిర్వాహక అధికార సంస్థ, జాతీయ రాజ్యాంగం ద్వారా రాష్ట్రాన్ని పరిపాలించడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ అధికారంగా సృష్టించబడ్డాయి. గవర్నరుకు రాష్ట్ర అధిపతి అయినప్పటికి అధికారాలు నామమాత్రంగా ఉంటాయి. కార్యనిర్వాహక అధికారం వాస్తవంగా ప్రభుత్వ ప్రధాన అధిపతి అయిన ముఖ్యమంత్రికి ఉంటాయి. గాంగ్‌టక్ సిక్కిం రాజధాని. ఇక్కడ శాసనసభ (శాసనసభ) సచివాలయం, సిక్కిం హైకోర్టు ఉన్నాయి.
ప్రస్తుత సిక్కిం శాసనసభ ఏకసభ, ఇందులో 32 మంది శాసనసభ సభ్యులు (ఎం.ఎల్.లు) ఉన్నారు. శాసనసభను ముందుగానే రద్దు చేయకపోతే దీని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది