గాంగ్‌టక్

సిక్కిం రాష్ట్ర రాజధాని

గాంగ్‌టక్, భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర రాజధాని, సిక్కిం రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణం. తూర్పు సిక్కిం జిల్లా ప్రధాన కార్యాలయం, ఒక నగరం, మునిసిపాలిటీ. ఇది తూర్పు హిమాలయ శ్రేణిలో 1,650 మీటర్ల (5,410 అడుగుల) ఎత్తులో ఉంది. ఈ పట్టణంలో 1,00,000 జనాభా ఉంది. ఇక్కడ భూటియా, లెప్చా, ఇండియన్ గూర్ఖాల వంటి వివిధ జాతుల వారు ఉన్నారు.

గాంగ్‌టక్
రాష్ట్ర రాజధాని
గాంగ్‌టక్ దృశ్యం
గాంగ్‌టక్ దృశ్యం
గాంగ్‌టక్ is located in Sikkim
గాంగ్‌టక్
గాంగ్‌టక్
సిక్కింలోని గాంగ్‌టక్ ప్రదేశం
గాంగ్‌టక్ is located in India
గాంగ్‌టక్
గాంగ్‌టక్
గాంగ్‌టక్ (India)
గాంగ్‌టక్ is located in Asia
గాంగ్‌టక్
గాంగ్‌టక్
గాంగ్‌టక్ (Asia)
Coordinates: 27°20′N 88°37′E / 27.33°N 88.62°E / 27.33; 88.62
దేశం భారతదేశం
రాష్ట్రంసిక్కిం
జిల్లాతూర్పు సిక్కిం
Government
 • Typeనగర పాలక సంస్థ
 • Bodyగాంగ్‌టక్ నగర పాలక సంస్థ
 • మేయర్శక్తి సింగ్ చౌదరి[1]
Area
 • Total19.2 km2 (7.4 sq mi)
Elevation1,650 మీ (5,410 అ.)
Population
 (2011)
 • Total1,00,290
 • Density5,223/km2 (13,530/sq mi)
భాషలు[3][4]
 • అధికారిక
 • ఇతర అధికారిక భాషలు
 • గురుంగ్
 • లింబు
 • మాగర్
 • ముఖియా
 • నెవారి
 • రాయ్
 • షెర్పా
 • తమంగ్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
737101
టెలిఫోన్ కోడ్03592
Vehicle registrationఎస్ కె-01

1840లో ఎన్చీ మొనాస్టరీని నిర్మించిన తరువాత ఈ నగరం, బౌద్ధ తీర్థయాత్రగా పేరొందింది. 1894లో సిక్కిం చోగ్యాల్, తూటోబ్ నాంగ్యాల్ రాజధానిని గాంగ్‌టక్ నగరానికి మార్చారు. 1947లో భారతదేశం బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, సిక్కిం స్వతంత్ర రాజ్యంగా ఉంది. 1975లో భారత యూనియన్‌తో కలిసిన తరువాత, గ్యాంగ్‌టక్‌ను భారతదేశ 22వ రాష్ట్ర రాజధానిగా చేశారు.

చరిత్ర

మార్చు

1840లో ఎన్చీ మొనాస్టరీని నిర్మించే వరకు ఇది ఒక చిన్న గ్రామంగా ఉండేది. 19వ శతాబ్దం మధ్యకాలంలో ఆంగ్లేయుల ఆక్రమణ తరువాత సిక్కింలో మిగిలిపోయిన ప్రాంతాలకు ఇది రాజధానిగా చేయబడింది. బ్రిటిష్ వారు టిబెటన్లను ఓడించిన తరువాత, 19వ శతాబ్దం చివరిలో టిబెట్, బ్రిటిష్ ఇండియా మధ్య వర్తక వ్యాపారాల్లో ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆ సమయంలో చాలా రోడ్లు, టెలిగ్రాఫ్ సౌకర్యాలు నిర్మించబడ్డాయి.

1894లో బ్రిటీష్ పాలనలో సిక్కిం చక్రవర్తి తుటోబ్ నాంగ్యాల్, రాజధానిని తుమ్లాంగ్ నుండి గాంగ్‌టక్ కు మార్చి, నగర ప్రాముఖ్యతను పెంచాడు. కొత్త రాజధానిలో ఇతర రాజ భవనాలతోపాటు ఇతర రాష్ట్ర భవనాలు కూడా నిర్మించబడ్డాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సిక్కిం రాష్ట్ర రాజధానిగా మారింది.

1975లో అనేక సంవత్సరాల రాజకీయ అనిశ్చితి, పోరాటం తరువాత రాచరికం రద్దు చేయబడి, భారతదేశ ఇరవై రెండవ రాష్ట్రంగా సిక్కిం అవతరించింది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత గాంగ్‌టక్ ను రాజధానిగా చేశారు. గాంగ్‌టక్ నగరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. 1997, జూన్ నెలలో అతిపెద్ద విపత్తు సంభవించి 38మంది మరణించగా, వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి.

భౌగోళికం

మార్చు

గాంగ్‌టక్ నగరం 27°19′57″N 88°36′50″E / 27.3325°N 88.6140°E / 27.3325; 88.6140 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది దిగువ హిమాలయాలలో 1,650 మీ. (5,410 అడుగులు) ఎత్తులో ఉంది. నగరానికి పశ్చిమ దిశలో ప్రపంచంలోని మూడవ ఎత్తైన శిఖరమైన కాంచన్‌జంగా పర్వతం (8,598 మీటర్లు లేదా 28,208 అడుగులు) కనిపిస్తుంది. ఈ నగరం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో సమశీతోష్ణ, ఆకురాల్చే అడవులు, పోప్లర్, బిర్చ్, ఓక్, ఎల్మ్, తడి ఆల్పైన్ జోన్ సతత హరిత, శంఖాకార చెట్లు ఉన్నాయి. ఇక్కడ వెదురు చెట్లు కూడా అధికంగా ఉన్నాయి. నవంబరు, డిసెంబరులలో పొద్దు తిరుగుడు, బంతి పువ్వు, పాయిన్‌సెట్టియా, ఇతర పువ్వులు వికసిస్తాయి.

రవాణా

మార్చు

రోడ్డుమార్గం

మార్చు

ఈ నగరంలో టాక్సీలు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది పట్టణ కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు,[5] వారిలో ఎక్కువమందికి సొంత వాహనాలైన ద్విచక్ర వాహనాలు, కార్లు కలిగి ఉన్నాయి.[6] సిటీ బస్సులు కూడా ఉన్నాయి. ఈ నగరం 31ఎ జాతీయ రహదారి ద్వారా మిగిలిన నగరాలకు కలుపబడి ఉంది. ఈ నగరానికి 114 కి.మీ.ల (71 మైళ్ళ) దూరంలో బెంగాల్ రాష్ట్రం ఉంది.

రైలుమార్గం

మార్చు

గాంగ్‌టక్ నుండి 124 కి.మీ.ల (77 మైళ్ళ) దూరంలో సిలిగురిలోని న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషను ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని సెవోక్ నుండి సిక్కింలోని రాంగ్‌పో వరకు బ్రాడ్ గేజ్ రైల్వే లైను కోసం పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైను గాంగ్‌టక్ వరకు విస్తరించడానికి ప్రణాళిక చేయబడింది.[7]

వాయుమార్గం

మార్చు

గాంగ్‌టక్ నగరానికి సమీపంలో పాక్యాంగ్ విమానాశ్రయం (గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం) ఉంది.[8] 400 హెక్టార్లలో (990 ఎకరాలు) విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయం గాంగ్‌టక్ నగరానికి దక్షిణాన 35 కి.మీ.ల (22 మైళ్ళ) దూరంలో ఉన్న పాక్యాంగ్ పట్టణంలో నిర్మించబడింది.[9] 4500 అడుగుల ఎత్తులో వద్ద ఉన్న ఈ పాక్యాంగ్ విమానాశ్రయం భారతదేశంలోని ఐదు ఎత్తైన విమానాశ్రయాలలో ఒకటి.[10] భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఇది.[11] భారతదేశంలో 100వ విమానాశ్రయం, సిక్కిం రాష్ట్రంలోని ఏకైక విమానాశ్రయం ఇది.[12][13]

ఈ విమానాశ్రయాన్ని 2018, సెప్టెంబరు 24న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు.[14] విమానాశ్రయం నుండి మొదటి వాణిజ్య విమాన కార్యకలాపాలు 2018, అక్టోబరు 4న పాక్యాంగ్, కోల్‌కతా నగరాల మధ్య ప్రారంభమయ్యాయి.[15]

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గాంగ్‌టక్ నగరపాలక సంస్థలో 98,658 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 53% మంది, స్త్రీలు 47% మంది ఉన్నారు. తూర్పు సిక్కిం జిల్లాలోని గాంగ్‌టక్ ఉపవిభాగం 2,81,293 జనాభాను కలిగి ఉంది. ఈ నగర సగటు అక్షరాస్యత రేటు 82.17% కాగా, జాతీయ సగటు 74% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 85.33% కాగా, స్త్రీ అక్షరాస్యత 78.68% గా ఉంది.[16]

బ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నేపాలీలు స్థిరపడ్డారు. భూటియాలు కూడా జనాభాలో ఎక్కువశాతం ఉన్నారు. పెద్ద సంఖ్యలో టిబెటన్లు కూడా పట్టణానికి వలస వచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన వలసవారిలోమార్వాడీలు, బిహారీలు, బెంగాలీలు ఉన్నారు. ఇక్కడ హిందూ మతం, బౌద్ధమతం చాలా ముఖ్యమైన మతాలు. క్రైస్తవవులు, ముస్లింలు కూడా ఉన్నారు. నార్త్ ఈస్ట్ ప్రెస్బిటేరియన్ చర్చి, రోమన్ కాథలిక్ చర్చి, అంజుమాన్ మసీదు మైనారిటీల ప్రార్థనా స్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా నేపాలీ మాట్లాడుతారు. ఇంగ్లీష్, హిందీ, భూటియా, టిబెటన్, లెప్చా భాషలు కూడా ఉన్నాయి.

సంస్కృతి

మార్చు

ఇక్కడ దశైన్, తిహార్, క్రిస్మస్, హోలీ మొదలైన ప్రధాన మత ఉత్సవాలతో పాటు, ఇతర స్థానిక పండుగలు జరుగుతాయి. లెప్చాలు, భూటియాలు జనవరిలో కొత్త సంవత్సరాన్ని జరుపుకోగా, టిబెటన్లు జనవరి-ఫిబ్రవరిలో "డెవిల్ డాన్స్"తో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. మాఘ సంక్రాంతి, రామనవమి నేపాల్ పండుగలలో ముఖ్యమైన పండుగలు.

ఇవి కూడ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. "Gangtokmunicipalcorporation.org". Gangtokmunicipalcorporation.org. Archived from the original on 31 December 2011. Retrieved 24 December 2020.
 2. 2.0 2.1 "Gangtok, India page". Global Gazetteer Version 2.1. Falling Rain Genomics, Inc. Archived from the original on 17 జూలై 2011. Retrieved 24 డిసెంబరు 2020.
 3. "1977 Sikkim government gazette" (PDF). sikkim.gov.in. Governor of Sikkim. p. 188. Archived from the original (PDF) on 22 July 2018. Retrieved 24 December 2020.
 4. "50th Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). 16 July 2014. p. 109. Archived from the original (PDF) on 2 January 2018. Retrieved 24 December 2020.
 5. "City Assessment: Physical Infrastructure" (PDF). City Development Plan-Gangtok City. Jawaharlal Nehru National Urban Renewal Mission, Ministry of Urban Development, Government of India. pp. 4–25. Archived from the original (PDF) on 5 February 2011. Retrieved 24 December 2020.
 6. "City Assessment: Physical Infrastructure" (PDF). City Development Plan-Gangtok City. Jawaharlal Nehru National Urban Renewal Mission, Ministry of Urban Development, Government of India. pp. 4–27. Archived from the original (PDF) on 5 February 2011. Retrieved 24 December 2020.
 7. "Speech of Mamata Banerjee introducing the Railway Budget 2010-11" (PDF). 30 March 2010. Archived from the original (PDF) on 30 March 2010. Retrieved 24 December 2020.
 8. "Sikkim to have 100th functional airport in India". 2 May 2018.
 9. "Wait for Sikkim air link". Archived from the original on 2018-06-12. Retrieved 2020-12-24.
 10. "Sikkim's Greenfield Airport". Punjlloyd. Retrieved 24 December 2020.
 11. "Sikkim's Pakyong airport stuns before it flies". 24 September 2018.
 12. "Sikkim to get its first airport at Pakyong". The Indian Express. 17 November 2007. Retrieved 24 December 2020.
 13. "Pakyong airport in Sikkim to become the 100th functional airport in India: Jayant Sinha". Financial Express. PTI. 3 May 2018. Retrieved 24 December 2020.
 14. "PM Narendra Modi inaugurates Sikkim's Pakyong airport". The Economic Times. 24 September 2018. Retrieved 24 December 2020.
 15. "Sikkim's Pakyong Airport welcomes first commercial flight in state with water cannon salute". First Post. First Post. Retrieved 24 December 2020.
 16. "Population of Sikkim – 2011 census results". populationindia.com. 14 మే 2011. Archived from the original on 31 మే 2012. Retrieved 24 డిసెంబరు 2020.

వెలుపలి లంకెలు

మార్చు