సిద్ధగురు
సిద్ధగురు రమణానంద మహర్షి భారతీయ ఆధ్యాత్మిక లివింగ్ సిద్ధ గురువు. ఈయనను 'సిద్ధగురు' అని శిష్యులు సంబోధించెదరు. ఆయన "శివుడే దేవాది దేవుడు ఆదిదేవుడు పరమపురుషుడు", "ఆత్మదర్శన అనుభూతి", "శక్తిపాతం ", "శిరిడి సాయి అనుగ్రహ సేవా రహస్యం " రచయిత. శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం -రమణేశ్వరంలో 1008 శివలింగాలను విజయవంతంగా ప్రతిష్ఠ చేసినందుకు "ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్" ఆయనను సత్కరించింది.[1][2]
సిద్ధగురు | |
---|---|
జననం | కప్పట్రాళ్ళ, ఆంధ్ర ప్రదేశ్ | 1968 ఏప్రిల్ 27
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | రమణానంద మహర్షి |
వృత్తి | శక్తిపాత సిద్ధయోగీశ్వరులు, సిద్ధగురువు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తత్త్వ వేత్త |
గుర్తించదగిన సేవలు | శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమశివుడు గ్రంథ వితరణ |
జీవితం తొలి దశలో
మార్చుసిద్ధగురు రమణానంద మహర్షి వారు 1968 ఏప్రిల్ 27 వ సంవత్సరములో కీ.శే. శ్రీ గూడూరు నరసయ్య, శ్రీమతి నాగమ్మ దంపతులకు జన్మించారు.[3] మహర్షి వారు అనంతపురం JNTU కళాశాలనుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైనారు. ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత 1995 నుండి 2001 వరకు mathematics lecturer గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. సిద్ధగురు, విజయలక్ష్మి గారిని 1995 మార్చి 8 న వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఆయనకు 1995వ సంవత్సరం జూన్ 29వ తేదీన ఆత్మసాక్షాత్కారం కలిగినది.ఆయనకు తన గురువైన మాత శ్రీ పూర్ణానందగిరి యోగిని వారు "సిద్ధగురు రమణానంద మహర్షి" అని ఆధ్యాత్మిక నామకరణం చేసారు.[4]
మూలాలు
మార్చు- ↑ "Siddhaguru And Self-Realization - An Intuitive Connection". Outlook India.
- ↑ "SIDDHAGURU – Understanding an accomplished enlightened Guru". Telegraph India.
- ↑ "'A guru who is always conscious of the absolute bliss is the right guru', says shaktipat yogi Siddhaguru". The Statesman.[permanent dead link]
- ↑ "Siddhaguru - A Guru with endearing dimension". Mid Day.