సిద్ధి భైరవ దేవాలయం, హన్మకొండ

హిందూ దేవాలయం

సిద్ధి భైరవ దేవాలయం తెలంగాణ రాష్ట్రం, హన్మకొండలోని సిద్ధులగుట్ట సమీపంలో ఉన్న ఆలయం. ఈ ప్రాంతంలో సిద్ధులు తపస్సు చేయడంవల్ల గుట్టకు సిద్ధులగుట్ట అని, సిద్ధులు పూజించడంవల్ల ఈ దేవాలయంలోని స్వామిని సిద్ధి భైరవ స్వామి అని పిలుస్తున్నారు.[1]

సిద్ధి భైరవ దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హన్మకొండ జిల్లా
ప్రదేశం:హన్మకొండ
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:(శివుడు) సిద్ధి భైరవుడు

చరిత్ర మార్చు

పూర్వకాలంలో ఈ గుట్టపై సిద్ధులు నివసించేవారు. శివున్ని ఆరాధించే ఆ సిద్ధుల కోరిక మేరకు సిద్ధ భైరవుడుగా వెలశాడని పురాణ గాథ. అలా సిద్ధులు నివసించిన గుట్టను సిద్ధుల గుట్టగా, సిద్ధులు పూజించిన శివున్ని సిద్ధి భైరవ స్వామిగా కొలుస్తుంటారు.

మూల విగ్రహం మార్చు

ఆలయంలో దిగంబరంగా ఉన్న భైరవస్వామి మూల విగ్రహం ఎప్పుడు వెలిసిందో చెప్పే ఆధారాలు లభించలేదు. జైనమత ప్రచారం అధికంగా ఉన్న సమయంలో ఈ ఆలయం నిర్మించడం వల్ల స్వామి దిగంబరునిగా ఉన్నాడని అక్కడివారి అభిప్రాయం. దొరికిన చారిత్రక ఆధారాల వల్ల ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదని, ఇక్కడ ఉన్న గుహలను చూస్తుంటే చాలా ఏళ్ళక్రితం అనేక మంది తపస్సు చేసుకున్నారని తెలుస్తుంది. చుట్టూప్రక్కల ఎక్కడ చూసినా శిలారూపాలే దర్శనమిస్తుంటాయి. ఒక్కడ ఉన్న ఒక కొండలో ఎనిమిది భైరవ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఈ గుట్టపై నుండి భద్రకాళి దేవాలయంకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణించేవారన్నదానికి నిదర్శనంగా సొరంగాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

సాధారణంగా భైరవుడు భయంకరాకారంలో రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణంతో వుంటాడు. నాలుగు చేతులలో పుర్రె, ఢమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తిమంతుడు రక్షాదక్షుడు ఈ కాల భైరవుడు. కాలభైరవుని క్షేత్రపాలక అని కూడా అంటారు.

ఎలా చేరుకోవాలి మార్చు

హన్మకొండ బస్ స్టేషన్ నుంచి పద్మాక్షి గుట్ట వెళ్లే దారిలో ఎడమ వైపు 200 మీటర్లు దూరంలో సిద్ధేశ్వర ఆలయం, దాని పక్కన సిద్ధులగుట్ట ఉంటుంది. గుట్టపైకి వెళ్ళడానికి మెట్లదారి ఉంది.

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ఆదివారం సంచిక (9 September 2018). "సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 13 September 2018. Retrieved 13 September 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)

వెలుపలి లంకెలు మార్చు