సిద్ధి వినాయక దేవాలయం (ముంబై)
సిద్ధి వినాయక దేవాలయం మహారాష్ట్ర లోని ముంబయి లోని ప్రభావతి ప్రాంతంలో ఉంది. దీనికి రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వినాయకుడు.[1] ఈ దేవాలయం నవంబరు 19,1801 లో లక్ష్మణ్ వితు అంరియు దూబాయ్ పాటిల్ చే నిర్మించబడింది. ఇది ముంబైలోని అతి ఐశ్వర్యవంతమైన దేవాలయం.[2] ఈ ఆలయానికి పర్వదినాలలో భక్తుల తాకిడి ఎక్కువ. మంగళ వారం నాడు సుమారు డెబ్బై వేలమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రతి ఏడు కానుకలుగా పది కోట్లకు పైగా వస్తుంటుంది. ఈ ఆలయ సంపద విలువ మూడు వందల యాబై కోట్ల రూపాయలు పైగానే ఉంది. 1801 సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ గుడి కాల క్రమంలో ఆరు అంతస్తులతో ఉంది. ఆలయ శిఖర గోపురానికి బంగారు తాపడం చేయించారు. ఆగ్రిసమజ్ కు చెందిన దూబె పాటిల్ అనే శ్రీమంతురాలు ఈ ఆలయాన్ని కట్టించింది. పిల్లలు కలగని మహిళలు ఈ స్వామి వారిని దర్శిస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసము. ఈ ఆలయంలో వినాయకుని ఎత్తు 2.6 అడుగులు. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి వుండడము ఈ ఆలయం ప్రత్యేకత. ఒకచేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావళం, ఒక చేతిలో కుడుములు ఉన్న పాత్ర ఉన్నాయి. ప్రముఖ వ్వాపార వేత్తలు, సినీ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండటంతో ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఈ దేవాలయం గోపురం లోపలి భాగంలోని పైకప్పు బంగారంతో తాపడం చేయడం జరిగింది.
సిద్ధి వినాయక దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 19°01′01″N 72°49′49″E / 19.016920°N 72.830409°E |
పేరు | |
స్థానిక పేరు: | సిద్ధి వినాయక మందిర్ |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మహారాష్ట్ర |
జిల్లా: | ముంబై |
ప్రదేశం: | ప్రభాదేవి |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | వినాయకుడు |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | నవంబరు 19, 1801 |
నిర్మాత: | లక్ష్మణ్ వితు, దూబాయ్ పాటిల్ |
వెబ్‌సైటు: | http://siddhivinayak.org |
చరిత్ర
మార్చుఈ దేవాలయం నబంబరు 19 1801 న నిర్మించబడింది. దీని వాస్తవ నిర్మాణం చాలా చిన్నదిగా 3.6మీ x 3.6 మీ కొలతలుగా ఉన్న చతురస్రాకార స్థలంలో శిఖరాన్ని కలిగి యుండే నిర్మాణంగా యుండెడిది. ఈ దేవాలయం లక్ష్మణ్ వితుల్ పాటిల్ అనే కాంట్రాక్టరుచే నిర్మించబడింది. ఈ దేవాలయానికి నిధులను ధనవంతురాలైన అగ్రి మహిళ అయిన దెబాయ్ పాటిల్ చే సమకూర్చబడినవి. ఆమెకు సంతానం లేరు.
మూలాలు
మార్చు- ↑ "Shree Siddhivinayak Mandir". Amazing Maharashtra.
- ↑ "The Birth of Shree Siddhivinayak Ganapati". Archived from the original on 2015-05-27. Retrieved 2015-08-22.