1801 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1798 1799 1800 - 1801 - 1802 1803 1804
దశాబ్దాలు: 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు మార్చు

  • జనవరి 1: గిసెప్పి పియాజ్జీ మరుగుజ్జు గ్రహం సెరెస్‌ను కనుగొన్నాడు. దీనికి రోమన్ దేవత పేరును పెట్టాడు
  • జనవరి 1: ఐర్లండు రాజ్యం గ్రేట్ బ్రిటనుతో కలిసిపోయి యునైటెడ్ కింగ్‌డమ్ ఆవిర్భవించింది.
  • మార్చి 10: గ్రేట్ బ్రిటనులో తొలి జనగణన జరిగింది. గ్రేట్ బ్రిటను జనాభా 89 లక్షలని తేలింది.[1] అందులో లండను జనాభా 8,60,035.
  • ఏప్రిల్ 21: వైశాఖి పండుగ నాడు రంజిత్ సింగ్ తనను తాను పంజాబ్ మహారాజాగా ప్రకటించుకున్నాడు.
  • జూన్: హస్తినాపురంలోని శ్రీ దిగంబర జైన మందిరాన్ని లాలా జైకుమార్ మాల్ పర్యవేక్షణలో రాజా హర్‌షుక్ రాయ్ నిర్మించాడు
  • ఆగస్టు 1: అమెరికా ట్రిపోలి, అల్జీర్స్, ట్యునిస్, మొరాకోలపై మొదటి బార్బరీ యుద్ధం మొదలుపెట్టింది. ఈ దేశాలకు చెందిన సముద్రపు దొంగలు అమెరికా నౌకలను పట్టుకుని, వాటిని విడిచేందుకు డబ్బులు డిమాండు చేసేవారు.
  • అక్టోబరు 24: స్వాతంత్ర్య సమర యోధులైన మరుదు సోదరులను బ్రిటిషు వారు శివగంగై జిల్లా లోని తిరుపత్తూరులో ఉన్న శిథిలమైన కోటలో ఉరితీసారు.
  • నవంబరు 10: సైన్య సహకర ఒప్పందం కింద బ్రిటిషు వారికి చెల్లించాల్సిన రుణానికి బదులుగా నవాబు సాదత్ అలి ఖాన్, రోహిల్‌ఖండును 1801 నవంబరు 10 ఒప్పందం తరువాత ఈస్టిండియా కంపెనీకి స్వాధీనం చేసాడు.[2]
  • నవంబరు 19: సిద్ధి వినాయక దేవాలయం,ముంబై
  • డిసెంబరు 24: రోడ్డుపై నడిచే స్టీము లోకోమోటివ్ ఇంజను ఆవిష్కరణ
  • తేదీ తెలియదు: బొబ్బిలి సంస్థాన ప్రభువు చిన్న రంగారావుతో బ్రిటిషువారు శాశ్వత సంధి ఒడంబడిక కుదుర్చుకున్నారు
  • తేదీ తెలియదు: అవధ్ నవాబు బ్రిటిషు వారితో సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నవాబు, తన భూభాగంలో సగాన్ని కంపెనీకి ఇచ్చుకోవలసి వచ్చింది.
  • తేదీ తెలియదు: మద్రాసులో సుప్రీమ్ కోర్టు స్థాపించారు
  • తేదీ తెలియదు: జాన్ విల్‌హెల్మ్ రిట్టర్ అల్ట్రా వయొలెట్ రేడియేషన్ను కనుగొన్నాడు
 
1801లో ఐరోపా

జననాలు మార్చు

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Chronology of State Medicine". Archived from the original on August 9, 2007. Retrieved 2007-08-10.
  2. Hafiz British Library.
"https://te.wikipedia.org/w/index.php?title=1801&oldid=3846063" నుండి వెలికితీశారు