తమిళ సంప్రదాయంలోని సిద్ధాడు(తమిళం: சித்தர், సంస్కృత సిద్ధ నుండి) ఒక పరిపూర్ణ వ్యక్తి. ఆయన కొన్ని విద్యా విభాగాలను నిరంతరం సాధన చేయడం ద్వారా సిద్ధి అనే మేధో శక్తులను సాధించాడు.

మొదటి సిద్ధుడు అగస్త్యుడు
మరుదమలై లోని పాంబాట్టి సిద్ధుడు

చారిత్రాత్మకంగా సిద్దరు పురాతన తమిళ బోధనవిధానంలో, సాధనద్వారా అష్టమాసిద్ధులు అనే 8 సిద్ధులను (అణిమ, గరిమ, లఘుమ, మహిమ, ప్రాప్తి, ప్రకార్య, ఇచ్చ, వాచ్య) సాధించిన సాధకుడు. పిన్నవయసులోనే గురుశుశ్రూష ద్వారా గురువు నుండి ఉపదేశం పొంది. దానిని ఉపాసన, సాధన ద్వారా అష్టమా సిద్ధులను సాధించి దేశసంచారం చేస్తూ ప్రజలకు తగిన సేవలను అందించే వ్యక్తిని సిద్ధుడు అంటారు. తత్వశాస్త్రంలో ఆధిపత్యం వహించిన వ్యక్తిగా కూడా సూచిస్తుంది. వారు సైన్సు, టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, లలిత కళలు, సంగీతం, నాటకం, నృత్యం వంటి వాటిలో పరిజ్ఞానం కలిగి ఉన్నారు. సామాన్య ప్రజలకు వారి అనారోగ్యం, వారి భవిష్యత్తు గురించి సలహాలను అందించారు. ప్రజలు వారి భవిష్యత్తు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి, అలాగే ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి వీరిని ఆశ్రయిస్తుంటారు. తెలుగు భాషలో వీరిని సిద్ధుడు అంటారు. [1]మొదటి సంగం కాలంలో వారి సిద్ధాంతాలలో కొన్ని ఉద్భవించినట్లు భావిస్తారు.[2][3][4]

అభ్యాసంసవరించు

సాధారణంగా సిద్ధులు సాధువులు, వైద్యులు, రసవాదులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ ఒకటే అని భావిస్తారు. వారు తమ పరిశోధనలను తమిళ భాషలో కవితల రూపంలో, తాటి ఆకుల మీద ("తాళపత్ర వ్రాతప్రతులు") వ్రాయబడిన వ్రాతప్రతులు అని అంటారు. ఇవి ఇప్పటికీ తమిళనాడులోని కొన్ని కుటుంబాల యాజమాన్యంలో ఉండి వంశపారంపర్యంగా సంరక్షించబడుతుంటాయి. అలాగే భారతదేశం, జర్మనీ, గ్రేటు బ్రిటను, యునైటెడు స్టేట్సు లోని విశ్వవిద్యాలయాలు వంటి ప్రభుత్వ సంస్థలలో సంరక్షించబడుతున్నాయి.[5]

ఈ విధంగా సిద్ధులు విస్తారమైన అనేక శాఖలలో జ్ఞాన వ్యవస్థను అభివృద్ధి చేసారు. ప్రస్తుతం సిద్ధుల వైద్యవిధానాన్ని సిద్ధవైద్యం అని పిలుస్తారు. దీనిని ప్రధానంగా తమిళనాడులో ఒక రకమైన సాంప్రదాయ స్థానిక వైద్యవిధానంగా అభ్యసించారు. తమిళనాడు గ్రామాలలో అనుభవజ్ఞులైన పెద్దలు సిద్ధ వైద్యానికి సమానమైన మోటైన వైధానాన్ని పాటిస్తున్నారు. (ఇది కొన్నిసార్లు పాట్టి (అవ్వ) వైద్యం, నాట్టు మరుందు (సాంప్రదాయ తమిళ ఔషధం రూపాలు), మూలిగై మరిత్వం (మూలికావైద్యం) (ఆయుర్వేద ఔషధం) తో అయోమయం చెందుతుంది.

అదే సమయంలో ఆత్మరక్షణ, యుద్ధ కళ అయిన వర్మకళా విధానాన్ని సిద్ధులు స్థాపించారని విశ్వసిస్తున్నారు. వర్మం అనేది మానవ శరీరంలో ఉన్న నిర్దిష్ట పాయింట్లు, ఇవి వివిధ మార్గాలలో నొక్కినప్పుడు, ఆత్మరక్షణలో దాడి చేసేవారిని స్థభింపచేసి తిరిగి అవసరమైనప్పుడు తిరిగి సాధారణ శారీరక పరిస్థితికి తీసుకునిరావడం, ప్రథమ చికిత్సా వైద్య చికిత్స వంటి వివిధ ఫలితాలను ఇస్తాయి.

వ్యాధుల మూలాన్ని గుర్తించడానికి పల్సు-రీడింగు (తమిళంలో "నాడి పార్తలు") ను అభివృద్ధి చేసిన మొదటి వ్యక్తులు తమిళ సిద్ధులు.

సిద్ధులు అనేక ఆధ్యాత్మిక కవితలు కూడా రాశారు. తమిళనాడులోని తనిప్పరై గ్రామానికి సమీపంలో ఉన్న చతురగిరి అనే ఆధ్యాత్మిక పర్వతంలో వీరిలో ఎక్కువ మంది యుగాలుగా నివసించారని విశ్వసిస్తున్నారు.

కొంతమంది సిద్ధులుసవరించు

అభిథానా చింతామణి ఎంసైక్లోపీడియాలో 9-18 మంది సిద్ధులను జాబితా చేసింది. అయినప్పటికీ అగత్యుడు వారి తరువాత సిద్ధులను, వారి శిష్యులను పలువురిని పేర్కొన్నాడు. అనేకమంది సిద్ధులు మంత్రసిద్ధులు, ఆధ్యాత్మిక శక్తులు ఉన్నవారిగా ప్రజలు విశ్వసిస్తుంటారు.[ఉల్లేఖన అవసరం]

9 మంది సిద్ధులుసవరించు

"అబితన చింతామణి" లో జాబితా చేయబడిన 9 ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 1. సత్యనాథరు.
 2. సతోగనాథరు
 3. ఆధినాథరు
 4. ఆధినాథరు.
 5. వెగులినాథరు
 6. మధంగనాథరు.
 7. మచీంద్రనాథరు.
 8. గజేంద్రనాథరు(గదేంద్రనాథరు)
 9. గోరకునాథరు.

18 సిద్ధులుసవరించు

 
కరువూరరు

తమిళ సిద్ధ సంప్రదాయంలో సిద్ధులు.[6][7]

 1. నందిశ్వర (నందిదేవరు లేదా నంది (ఎద్దు))
 2. తిరుములారు
 3. ఋషి
 4. కలంగి నాథరు
 5. పతంజలి
 6. కొరక్కరు
 7. పులిపాని
 8. కొనగనారు
 9. సత్తాముని
 10. తెరైయారు
 11. రామదేవరు
 12. శివ వాకియారు
 13. ఎడైక్కడారు
 14. మచ్చముని
 15. కరువూర దేవరు
 16. బోగరు
 17. పంబట్టి (పంబట్టి సిద్ధరు)
 18. కుతంబి

పైన పేర్కొన్న 18 సిద్దార్లతో 9 నవగ్రాహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది సిద్ధర్ల జాబితా ఉంది (నవగ్రహానికి ఒక్కొక్క నవగ్రహానికి ఇద్దరు సిద్ధర్లు ప్రాతినిధ్యం వహిస్తారు) అన్ని నవగ్రహ దోషాల పరిహారాలు సిద్ధర్లకు సిద్దరు వెల్వి (సిద్దారు యాగం) గా నిర్వహిస్తారు .18 వివరాలు. 9 నవగ్రహాలను సూచించే సిద్ధర్ల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

 1. శ్రీ శివ వాక్య సిద్ధరు - చంద్రుడు
 2. శ్రీ కైలాయ కంబిలి సట్టై ముని సిద్ధరు - చంద్రుడు
 3. శ్రీ భోగరు సిద్ధరు - అంగారకుడు.
 4. శ్రీ కగభుజంగ సిద్ధరు - బృహస్పతి
 5. శ్రీ పుల్లిపనిసిద్దరు - అంగారకుడు
 6. శ్రీ సట్టై ముని సిద్ధారు- కేతు
 7. శ్రీ అగవై సిద్ధరు - బృహస్పతి
 8. శ్రీ అజుగాని సిద్ధరు -రాహువు
 9. శ్రీకుడంబాయి సిద్ధారు - కేతు
 10. శ్రీ వల్లర్సిద్ధరు - బుధుడు
 11. శ్రీ ఎడీకద్దరు సిద్ధరు-బుధుడు
 12. శ్రీ పట్టినాథరు సిద్ధరు- సూర్యుడు
 13. శ్రీ కడువెల్లి సిద్ధరు- సూర్యుడు
 14. శ్రీ కంజమలై సిద్ధరు - శుక్రుడు
 15. శ్రీ సెన్నిమలై సిద్ధరు- శుక్రుడు
 16. శ్రీకాపిలార్ర్ సిద్ధరు-శని
 17. శ్రీకారూరారు సిద్ధరు-శని
 18. శ్రీ పంబట్టి సిద్ధరు -రాహువు

సద్గురు శ్రీ శేషాద్రి స్వామిగళు ఆదేశంతో చెన్నైలోని మాడంబక్కం వద్ద ఉన్న 18 మంది సిద్ధర్లకు శ్రీచక్ర మహమేరు శ్రీ శేషాద్రి స్వామిగళు 18 సిద్ధర్ల బృందావన శక్తి పీఠం స్థాపించబడింది. - గురుజీ కె.వి.ఎల్.ఎన్.

సిద్ధుల శక్తులుసవరించు

సిద్ధర్లకు పెద్ద, చిన్న శక్తులు ఉన్నాయని విశ్వసిస్తారు. ఇవి వివిధ యోగ, మత గ్రంథాలలో వివరంగా వివరించబడ్డాయి.[8] వారి ద్రవ్యరాశిని శక్తిగా మార్చే శక్తి ఉందని, తద్వారా వివిధ విశ్వాలకు ప్రయాణించే శక్తి కూడా ఉందని చెబుతారు.

 1. అనిమా (కుదించడం) - అణువు పరిమాణంగా మారి చిన్న జీవుల్లోకి ప్రవేశించే శక్తి
 2. మహిమా (అస్థిరత) - శక్తితో, విశ్వంతో సహ-విస్తృతంగా మారే శక్తి. పరిమితి లేకుండా ఒకరి పరిమాణాన్ని పెంచే శక్తి
 3. లాగిమా (తేలిక) - పరిమాణంలో పెద్దది అయినప్పటికీ చాలా తేలికగా ఉండే సామర్థ్యం
 4. గారిమా (బరువు) - పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ చాలా బరువు ఉండే సామర్థ్యం
 5. ప్రాప్తి (కోరికల నెరవేర్పు) - బ్రహ్మ లోకం నుండి దిగువ ప్రపంచానికి అన్ని ప్రపంచాలలోకి ప్రవేశించే సామర్థ్యం. ఇది కోరుకున్న ప్రతిదాన్ని సాధించగల శక్తి
 6. ప్రకాసిస్ము (ఇర్రెసిస్టిబుల్ సంకల్పం) - ఉన్నచోటులో ఉంటూనే ఆత్మను విడదీసి ఇతర శరీరాల్లోకి ప్రవేశించడం, స్వర్గానికి వెళ్లి ప్రతి ఒక్కరూ కోరుకునేదాన్ని ఆస్వాదించే శక్తి.
 7. ఇష్టవం (ఆధిపత్యం) - భగవంతుని సృజనాత్మక శక్తిని కలిగి ఉండడం. సూర్యుడు, చంద్రుడు, అంశాల మీద నియంత్రణ కలిగి ఉండండం.
 8. వాశిత్వం (మూలకాల మీద ఆధిపత్యం) - రాజులు, దేవతల మీద నియంత్రణ శక్తి. ప్రకృతి గతిని మార్చే శక్తి, ఏ రూపాన్ని అయినా ఊహించుకునే శక్తి

ఈ ఎనిమిది గొప్ప సిద్ధిలు (అష్టామ సిద్ధిలు) లేదా గొప్ప పరిపూర్ణతలు.[9]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. Meditation Revolution: A History and Theology of the Siddha Yoga Lineage. Motilal Banarsidass. 2000. ISBN 9788120816480.
 2. S. Cunjithapatham, M. Arunachalam (1989). Musical tradition of Tamilnadu. International Society for the Investigation of Ancient Civilizations. p. 11.
 3. Journal of Indian history, Volume 38. Dept. of History, University of Kerala. 1960.
 4. Weiss, Richard (2009). Recipes for Immortality : Healing, Religion, and Community in South India: Healing, Religion, and Community in South India. Oxford University Press. p. 80. ISBN 9780199715008.
 5. V. Jayaram. "Study of siddhas". Hinduwebsite.com. Retrieved 2013-06-22.
 6. "18 siddhars". Palanitemples.com. Retrieved 2013-06-22.
 7. "Siddhars". Sathuragiri.org. Archived from the original on 2013-05-18. Retrieved 2013-06-22.
 8. Thirumandiram 668
 9. "Ashtama Siddhis". Siddhars.com. Archived from the original on 2013-03-07. Retrieved 2013-06-22.

18 siddars who represent the 9 NAVAGRAHAS ( 2 SIDDAR REPRESENT EACH PLANET)REFER WEBSITE www.seshadri.info

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సిద్ధుడు&oldid=2878470" నుండి వెలికితీశారు