సి.కె. నాయుడు ట్రోఫీ
కల్నల్ సి.కె. నాయుడు ట్రోఫీ భారతదేశంలో వివిధ రాష్ట్రాల, ప్రాంతీయ క్రికెట్ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే అండర్-25 జట్ల మధ్య జరిగే దేశీయ క్రికెట్ ఛాంపియన్‌షిప్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) నిర్వహించే ఈ టోర్నమెంటుకు భారతదేశపు మొదటి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ CK నాయుడు పేరు పెట్టారు.[1][2] ఒక్కో మ్యాచ్ నాలుగు రోజుల పాటు ఆడతారు. దాని చరిత్రలో, ఇది అండర్-22, అండర్-23, అండర్-25తో సహా వివిధ వయో పరిమితుల జట్లతో జరిగింది. [3] 2023 ఫైనల్లో ముంబైని ఓడించి గుజరాత్, ప్రస్తుత ఛాంపియన్ అయింది. [4]
సి.కె. నాయుడు ట్రోఫీ | |
---|---|
దేశాలు | India |
నిర్వాహకుడు | BCCI |
ఫార్మాట్ | First-class cricket |
చివరి టోర్నమెంటు | 2022–23 |
ప్రస్తుత ఛాంపియన్ | Gujarat |
చరిత్ర
మార్చు1973-74లో, బిసిసిఐ అండర్-22 క్రికెటర్ల కోసం ఒక టోర్నమెంటును రూపొందించి భారతదేశపు మొదటి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ CK నాయుడు పేరు పెట్టింది. దీనిని మొదట్లో 'కల్నల్ నాయుడు ట్రోఫీ కోసం భారత జూనియర్ టోర్నమెంట్' అని పిలిచేవారు. [1] నాయుడు జ్ఞాపకార్థం చిరస్థాయిగా నిలిచేందుకు బాంబే క్రికెట్ అసోసియేషన్ నిధులు సేకరించి ట్రోఫీని అందజేసింది. [1]
2014-15 సీజన్ నుండి బిసిసిఐ, ఈ టోర్నమెంటు వయోపరిమితిని 25 నుండి 23కి తగ్గించింది. ప్లేయింగ్ XIలో రంజీ ట్రోఫీ క్రికెటర్ల సంఖ్యను కేవలం ముగ్గురికి మాత్రమే పరిమితం చేసింది. [3] 23 ఏళ్ల వయోపరిమితి 2019-20 సీజన్ వరకు కొనసాగింది. 2021-22 సీజన్ నుండి, ఈ వయోపరిమితిని మళ్ళీ 25 సంవత్సరాలుగా విధించింది.[5]
విజేతలు
మార్చుకింది జట్లు టోర్నమెంటును గెలుచుకున్నాయి:
బుతువు | విజేత | ద్వితియ విజేత | గమనిక | మూలాలు |
---|---|---|---|---|
2007-08 | ముంబై | మహారాష్ట్ర | U-22 | [6] |
2014-15 | ఉత్తర ప్రదేశ్ | హిమాచల్ ప్రదేశ్ | U-23 | [7] |
2015-16 | ముంబై | మధ్యప్రదేశ్ | U-23 | [8] |
2016-17 | పంజాబ్ | ఆంధ్ర | U-23 | [9] |
2017-18 | ఢిల్లీ | ముంబై | U-23 | [10] |
2018-19 | పంజాబ్ | బెంగాల్ | U-23 | [11] |
2019-20 | విదర్భ | మధ్యప్రదేశ్ | U-23 | [12] |
2020–21 | COVID-19 మహమ్మారి కారణంగా నిర్వహించలేదు [13] | |||
2021-22 | ముంబై | విదర్భ | U-25 | [14] |
2022-23 | గుజరాత్ | ముంబై | U-25 | [4] [15] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Raiji, Vasant (1989). C.K. Nayudu, the Shahenshah of Indian Cricket (in ఇంగ్లీష్). Marine Sports. p. 62. ISBN 978-81-85361-00-0.
- ↑ Bhushan, Aditya (2019). A Colonel Destined To Lead (in ఇంగ్లీష్). StoryMirror. p. 67. ISBN 978-93-87269-27-9.
- ↑ 3.0 3.1 Mukherjee, Sudatta (29 July 2014). "BCCI's changes age-limit to 23 for CK Nayudu Trophy". Cricket Country (in ఇంగ్లీష్). Retrieved 27 April 2023.
- ↑ 4.0 4.1 Mayure, Subodh (16 March 2023). "CK Nayudu Trophy final: Mumbai succumb to Gujarat in just 12 minutes". Mid-Day (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
- ↑ Karhadkar, Amol (5 March 2022). "CK Nayudu Trophy to begin on March 22". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 27 April 2023.
The tournament that is reverted from U-23 to U-25 from this season was postponed due to the COVID-19 surge in January.
- ↑ "Mumbai win CK Nayudu Trophy". ESPNcricinfo (in ఇంగ్లీష్). 22 December 2007. Retrieved 28 September 2022.
- ↑ "2014-15 Col C K Nayudu Trophy". BCCI (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
- ↑ "CK Nayudu Trophy 2015-16: Mumbai U-23 wins title". Cricket Country (in ఇంగ్లీష్). 3 March 2016. Retrieved 26 April 2023.
- ↑ "2016-17 Col C K Nayudu Trophy". BCCi (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
- ↑ "क्रिकेट में दिल्ली टीम की एक और बड़ी सफलता, मुंबई को हराकर इस ट्रॉफी पर जमाया कब्जा". NDTV (in హిందీ). 20 December 2017. Retrieved 28 September 2022.
- ↑ "2018-19 Col C K Nayudu Trophy". BCCI (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
- ↑ "2019-20 Col C K Nayudu Trophy". BCCI (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
- ↑ Gupta, Gaurav (5 March 2022). "CK Nayudu Trophy to begin from March 17". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 September 2022.
- ↑ "Shams Mulani helps Mumbai U-25 lift Col CK Nayudu Trophy". The Indian Express (in ఇంగ్లీష్). 27 April 2022. Retrieved 28 September 2022.
- ↑ "2022-23 Col C K Nayudu Trophy". BCCI (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.