సి.కె.నాయుడు
సి. కె. నాయుడుగా పేరు గాంచిన కొఠారి కనకయ్య నాయుడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు, 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో రెండు దశాబ్దాలు (1916-1936) నాయుడు యుగంగా ప్రసిద్ధి గాంచాయి.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | Nagpur [1] | 1895 అక్టోబరు 31 ,|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1967 నవంబరు 14Indore | (వయసు 72),|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం స్లో మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1] |
నాయుడు 1895, అక్టోబరు 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రథమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకముగా జరిగింది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యం తన క్రీడాజీవితపు చివరినాళ్ల వరకు చెక్కుచెదరలేదు.
ఆరు దశాబ్దాలపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి. కె. నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62 వ యేట అతను చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో 52 పరుగులు చేశాడు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్ గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించాడు.
ఈయన 1967, నవంబరు 14న ఇండోర్‌లో మరణించాడు.
కుటుంబ నేపథ్యం
మార్చుసి.కె.నాయుడు పూర్వీకులు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన సుప్రసిద్ద తెలగ నాయుడు వర్గంవారు. అయితే, ఆయన తాతగారైన కొట్టారి నారాయణస్వామి నాయుడు గారికి రెండు తరాలకి ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాదుకి తరలిపోయింది. నారాయణస్వామి నాయుడు గారి తాతగారు నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్కు మారింది. చివరికి సి.కె.నాయుడి తండ్రి సూర్యప్రకాశరావు నాయుడు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ, నాగపూరులో స్థిరపడ్డారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. సి.కె.ప్రతిభను గౌరవిస్తూ, హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనకి తన సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి, ఇండోర్ రావలసిందిగా ఆహ్వానించాడు. తన ఆఖరు రోజుల వరకూ సి.కె. అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో రాసారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడి గారి కుటుంబంలో కొనసాగాయి. సి.కె.మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీధికి సి.కె. పేరు పెట్టారు. సి.కె.నాయుడు సోదరుడు సి.ఎస్.నాయుడు కూడా ప్రముఖ క్రికెటర్. సి.కె. కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత.
క్రికెట్ కెరీర్
మార్చునలభై ఎనిమిదేళ్ళ సుదీర్ఘ ఫస్ట్ క్లాసు కెరీర్ లో సి.కె. ముంబై క్వాడ్రాంగులర్స్, పెంటాంగులర్స్, రంజీట్రోఫీ, మద్రాసు ప్రెసిడెన్సీ మ్యాచ్ లు, నాగపూర్ క్వాడ్రాంగులర్స్, సూరత్ క్వాడ్రాంగులర్స్, అమృతసర్ ట్రయాంగులర్స్, రోషనారా టోర్నమెంటు, మొయినుద్దౌలా గోల్డ్ కప్ ఇలా అనేక టోర్నమెంట్లలో ఆడేవాడు. ఇవి కాక, వివిధ రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ ఎలెవెన్, గవర్నర్ ఎలెవెన్ జట్లకి కూడా ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 344 మ్యాచ్ లు ఆడి 11825 పరుగులు చేశాడు, 411 వికెట్లు తీసుకున్నాడు. విశేషం ఏమిటంటే సి.కె. కెరీర్ లో ఆడిన మ్యాచ్ లలో సగానికి పైగా ఆయనకి నలభై ఏళ్ళు దాటాక ఆడినవే.
ఏడు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన సి.కె. 350 పరుగులు చేశాడు, తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు.
రికార్డులు, ఘనతలు
మార్చు- భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్
- 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన సి.కె. తన ఆఖరు మ్యాచ్ ఆడింది 1963లో, అరవై ఎనిమిదేళ్ళ వయసులో. క్రికెట్ చరిత్రలో 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న వారు మరొకరు లేరు.
- ఫస్ట్ క్లాసు క్రికెట్లో యాభై ఏళ్ళ వయసు దాటాక కూడా డబుల్ సెంచురీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ళలో సి.కె. ఒకరు.
- భారత జట్టుకి ఆడినవారిలో "విజ్డెన్" పత్రిక "క్రికెటర్ ఆఫ్ ది యియర్"గా ఎంపికైన మొదటి వ్యక్తి (1933)
సి.కె. గురించి కొందరు ప్రముఖుల మాటలు
మార్చు- "సి.కె.నాయుడు బంతిని అందుకోవడం చూస్తే చాలు, ఆయన క్రికెట్ ఆడడం కోసమే పుట్టాడని అర్థమవుతుంది" - జాక్ హాబ్స్, ఇంగ్లండు క్రికెటర్
- "నేను హోల్కర్ పాలకుడినైతే కావొచ్చు, కానీ ఔట్ డోర్ గేంస్ లో రారాజు మాత్రం సి.కె. నే" - యశ్వంత్ రావు, హోల్కర్ మహారాజా
- "తాత్వికుల చింతన కన్నా ఉన్నతమైన సిక్సర్లతో ఆయన కెరీర్ నిండిపోయింది" - డాం మొరేస్, రచయిత
- "డగ్లస్ జార్డిన్ జట్టుపై సి.కె.నాయుడు బ్యాటింగ్ జోరు చూశాక విదేశీయులంటే అప్పటివరకూ నాలో గూడు కట్టుకుని ఉన్న భయం కాస్తా పోయింది." - పృథ్వీరాజ్ అన్న అప్పటి యువక్రికెటర్
- "సి.కె.నాయుడుకు భారత క్రికెట్ ఎంతగానో రుణపడి ఉంది. ఆయన భారత క్రికెట్ కు డబ్ల్యు.జి.గ్రేస్ వంటి వాడు" - ఎస్.కె.గురునాథన్, క్రికెట్ రచయిత.
- "ప్రాచ్య దేశాల మార్మికతను రంజీ తర్వాత మళ్ళీ సి.కె.లోను, ముస్తాఖ్ అలీలోను మనం చూడగలం." - ఇ.డబ్ల్యు.స్వాంటన్, ప్రసిద్ధ క్రీడా రచయిత.
- "క్రికెట్ అనూహ్య పరిణామాలకు వేదిక అన్న నానుడికి సి.కె. నుండి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. మరో నాయుడును మనం ఊహించను కూడా ఊహించలేం" - నెవిల్ కార్డస్, ప్రసిద్ధ క్రికెట్ రచయిత.
సి.కె.నాయుడు గురించి వచ్చిన పుస్తకాలు
మార్చు- సి.కె.నాయుడు: ఎ డాటర్ రిమెంబర్స్ - చంద్ర నాయుడు
- సి.కె.నాయుడు : క్రికెటర్, స్కిప్పర్, పేట్రియార్క్ -ప్రకాశరావు నాయుడు
- సి.కె.నాయుడు : ది షహెన్ షా ఆఫ్ ఇండియన్ క్రికెట్ - వసంత్ రైజీ
- కల్నల్ సి.కె.నాయుడు : సి. వెంకటేష్
“సి కె” క్రికెట్ జీవిత విషయ సారంశం:
ఆడిన మ్యాచ్ లు – 207 చేసిన పరుగులు – 11,825 అత్యుత్తమ పరుగులు (స్కోరు) – 200 సెంచరీలు – 26 యాబైలు – 28 తీసిన వికెట్లు – 411 పట్టిన క్యాచ్ లు – 170
ఇవి కూడా చూడండి
మార్చు- సి.కె. నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- సి.కె. నాయుడు ట్రోఫీ
- చంద్ర నాయుడు - తొలి భారతీయ మహిళా క్రికెట్ వ్యాఖ్యాత
మూలాలు
మార్చు- ↑ "Cricket archive profile".
- ↑ "తెలుగు వెలుగులు - 9" (PDF). Press Academy of Andhra Pradesh. Andhra Patrika. నవంబరు 1959. Retrieved డిసెంబరు 27 2018.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help)[permanent dead link]
- కల్నల్ సి.కె.నాయుడు, రచన: సి.వెంకటేష్, సి.పి.బ్రౌన్ అకాడెమీ ప్రచురణ, 2011.